Realme 10 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Dec 2022 09:42:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఇవాళ సేల్‌కి వచ్చిన Realme 10 Pro 5G: బ్యాంక్ ఆఫర్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-10-pro-5g-first-sale-india-price-bank-offers/ Fri, 16 Dec 2022 09:40:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4026 హైలైట్స్ భారత్ లో తొలిసారిగా నేడు సేల్ కి వచ్చిన Realme 10 Pro ఈనెల ఆరంభంలో లాంచైన Realme 10 Pro స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Realme 10 Pro+, Realme 10 Pro స్మార్ట్ ఫోన్స్ ఈ నెల ఆరంభంలో భారత్ లో లాంచ్ అయ్యాయి. Realme 10 Pro+ ఇప్పటికే సేల్ కి […]

The post ఇవాళ సేల్‌కి వచ్చిన Realme 10 Pro 5G: బ్యాంక్ ఆఫర్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో తొలిసారిగా నేడు సేల్ కి వచ్చిన Realme 10 Pro
  • ఈనెల ఆరంభంలో లాంచైన Realme 10 Pro స్మార్ట్ ఫోన్
  • 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+, Realme 10 Pro స్మార్ట్ ఫోన్స్ ఈ నెల ఆరంభంలో భారత్ లో లాంచ్ అయ్యాయి. Realme 10 Pro+ ఇప్పటికే సేల్ కి రాగా, నేటి నుంచి Realme 10 Pro కూడా విక్రయానికి వచ్చింది. Realme 10 Pro+ కంటే Realme 10 Pro డివైజ్ తక్కువ ధరలో లభిస్తుంది. Realme 10 Pro స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

భారత్ లో Realme 10 Pro ధర, లభ్యత

Realme 10 Pro నేడు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వచ్చింది. ఈ డివైజ్ ని రియల్మీ.కామ్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మ్యాటర్, నెబులా బ్లూ. Realme 10 Pro ఫోన్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

Realme 10 Pro కొనుగోలు పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్ పై ఈఎంఐ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఫోన్ ని ఈఎంఐ కాకుండా కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ కార్డ్ యూజర్లకు కూడా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme 10 Pro స్పెసిఫికేషన్స్

Realme 10 Pro డివైజ్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది.

Realme 10 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme 10 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉంటాయి. Realme 10 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ సేల్‌కి వచ్చిన Realme 10 Pro 5G: బ్యాంక్ ఆఫర్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
20GB ర్యామ్, 108MP కెమెరా, 33W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro https://www.91mobiles.com/telugu/realme-10-pro-launched-india-with-20gb-ram-108mp-camera-33w-charging-support/ Thu, 08 Dec 2022 07:12:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=3878 హైలైట్స్ భారత్ లో లాంచైన Realme 10 Pro స్మార్ట్ ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10 Pro 8జిబి వర్చువర్ ర్యామ్ ఫీచర్ తో వచ్చిన Realme 10 Pro రియల్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న Realme 10 Pro సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Realme 10 Pro మరియు Realme 10 Pro+ అనే […]

The post 20GB ర్యామ్, 108MP కెమెరా, 33W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Realme 10 Pro స్మార్ట్ ఫోన్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10 Pro
  • 8జిబి వర్చువర్ ర్యామ్ ఫీచర్ తో వచ్చిన Realme 10 Pro

రియల్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న Realme 10 Pro సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Realme 10 Pro మరియు Realme 10 Pro+ అనే రెండు మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు డివైజెస్ 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. Realme 10 Pro లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడగా, Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఈ ఆర్టికల్ లో Realme 10 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme 10 Pro స్పెసిఫికేషన్స్

Realme 10 Pro స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ స్క్రీన్ 680 నిట్స్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 16.7 మిలియన్ కలర్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ని ఇందులో వాడారు. 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Realme 10 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Realme 10 Pro 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో 20 జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

భారత్ లో Realme 10 Pro ధర, విక్రయ తేదీ

Realme 10 Pro స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి యూనిట్ ధర రూ.19,999 గా నిర్ణయించారు. Realme 10 Pro డివైజ్ నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Realme 10 Pro డిసెంబర్ 16 నుంచి ప్లిప్ కార్ట్ మరియు రియల్మీ వెబ్ సైట్, స్టోర్స్ ద్వారా సేల్ కి వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 20GB ర్యామ్, 108MP కెమెరా, 33W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ ధర https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-price-officially-confirmed/ Mon, 28 Nov 2022 04:18:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=3693 హైలైట్స్ డిసెంబర్ 8 న లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్ ఈ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Realme 10 Pro, Realme 10 Pro+ రూ.25,000 లోపు ధరతో రానున్న Realme 10 Pro+, ట్వీట్ ద్వారా తెలిపిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme సంస్థ తన తదుపరి నంబర్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 8 న లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్
  • ఈ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Realme 10 Pro, Realme 10 Pro+
  • రూ.25,000 లోపు ధరతో రానున్న Realme 10 Pro+, ట్వీట్ ద్వారా తెలిపిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్

Realme సంస్థ తన తదుపరి నంబర్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 8 న లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్మీ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు ఫోన్లు ఇటీవలె చైనాలో లాంచ్ అయ్యాయి. ఇంకొక రెండు వారాల్లో భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే రియల్మీ కంపెనీ ఫోన్లపై అంచనాలను పెంచేందుకు వరుసగా టీజర్లను వదులుతోంది.

తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme 10 Pro+ యొక్క ధర గురించి ఓ హింట్ ఇచ్చారు. దాన్ని బట్టి ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. టాప్ మోడల్ ధర రూ.25,000 లోపు ఉండనుండటంతో, స్టాండర్డ్ మోడల్ ధర మరింత తక్కువగా ఉండనుంది.

Realme 10 Pro స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్ ని అందించారు. ఇది ఓఎల్ఈడీ ప్యానెల్ తో తయారైంది. డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ని ఇందులో వాడారు. ఇది 6ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన, 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వచ్చింది. దీంతో మొత్తం ర్యామ్ ని 20జిబి వరకు పెంచుకునే వీలుంది.

Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఇది 6ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన, 64బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది.

Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Realme 10 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 17 నిమిషాల్లో ఈ మొబైల్ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ ధర first appeared on 91Mobiles Telugu.

]]>