హైలైట్స్
- డిసెంబర్ 8 న లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్
- ఈ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Realme 10 Pro, Realme 10 Pro+
- రూ.25,000 లోపు ధరతో రానున్న Realme 10 Pro+, ట్వీట్ ద్వారా తెలిపిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్

Realme సంస్థ తన తదుపరి నంబర్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 8 న లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్మీ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు ఫోన్లు ఇటీవలె చైనాలో లాంచ్ అయ్యాయి. ఇంకొక రెండు వారాల్లో భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే రియల్మీ కంపెనీ ఫోన్లపై అంచనాలను పెంచేందుకు వరుసగా టీజర్లను వదులుతోంది.
తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme 10 Pro+ యొక్క ధర గురించి ఓ హింట్ ఇచ్చారు. దాన్ని బట్టి ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. టాప్ మోడల్ ధర రూ.25,000 లోపు ఉండనుండటంతో, స్టాండర్డ్ మోడల్ ధర మరింత తక్కువగా ఉండనుంది.
Kudos to our product team for figuring this one out. #realme10ProSeries5G pic.twitter.com/A5DZNMyWek
— Madhav Sheth (@MadhavSheth1) November 26, 2022
Realme 10 Pro స్పెసిఫికేషన్స్
Realme 10 Pro 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్ ని అందించారు. ఇది ఓఎల్ఈడీ ప్యానెల్ తో తయారైంది. డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ని ఇందులో వాడారు. ఇది 6ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన, 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వచ్చింది. దీంతో మొత్తం ర్యామ్ ని 20జిబి వరకు పెంచుకునే వీలుంది.
Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్
Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఇది 6ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన, 64బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది.
Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
Realme 10 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 17 నిమిషాల్లో ఈ మొబైల్ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













