Realme 10S - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Dec 2022 15:07:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Dimensity 810 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme 10S 5G https://www.91mobiles.com/telugu/realme-10s-5g-launched-china-price-specs/ Sat, 17 Dec 2022 03:35:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=4039 హైలైట్స్ చైనాలో లాంచైన Realme 10S 5G స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 10S 5G మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 60హెర్ట్జ్ డిస్ప్లేతో వచ్చిన Realme 10S 5G Realme 10S 5G స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. త్వరలో ఈ డివైజ్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. […]

The post Dimensity 810 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme 10S 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Realme 10S 5G స్మార్ట్ ఫోన్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 10S 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 60హెర్ట్జ్ డిస్ప్లేతో వచ్చిన Realme 10S 5G

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. త్వరలో ఈ డివైజ్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. Realme 10S 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 10S 5G ధర

Realme 10S 5G చైనాలో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1099 (సుమారు రూ.13,100) కాగా, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1299 (సుమారు రూ.15,400) గా ఉంది. ఈ ఫోన్ స్ట్రీమర్ బ్లూ మరియు క్లిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 10S 5G స్పెసిఫికేషన్స్

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ అమర్చారు. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రిటైల్ బాక్స్ లో చార్జర్ ఉంటుంది. ఇకపోతే ఈ డివైజ్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

ఇప్పుడు Realme 10S 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Realme 10S 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Realme 10S 5G డివైజ్ 164.4 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.1 మిల్లీ మీటర్ల మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది. త్వరలో భారత లాంచ్ తేదీని రియల్మీ ప్రకటించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 810 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme 10S 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 16 న లాంచ్ కానున్న Realme 10S https://www.91mobiles.com/telugu/realme-10s-specs-revealed-before-launch/ Thu, 15 Dec 2022 12:34:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=4002 హైలైట్స్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్న రియల్మీ కంపెనీ డిసెంబర్ 16 న లాంచ్ అవుతోన్న Realme 10S స్మార్ట్ ఫోన్ 256జిబి వరకు స్టోరేజీ, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme 10S ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సిద్ధమవుతోంది. చూస్తుంటే రియల్మీ తన 10 సిరీస్ ని మరింతగా విస్తరించాలని […]

The post డిసెంబర్ 16 న లాంచ్ కానున్న Realme 10S first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్న రియల్మీ కంపెనీ
  • డిసెంబర్ 16 న లాంచ్ అవుతోన్న Realme 10S స్మార్ట్ ఫోన్
  • 256జిబి వరకు స్టోరేజీ, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme 10S

ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సిద్ధమవుతోంది. చూస్తుంటే రియల్మీ తన 10 సిరీస్ ని మరింతగా విస్తరించాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. డిసెంబర్ 16 న Realme 10S డివైజ్ చైనాలో లాంచ్ కానున్నట్లు సమాచారం. రియల్మీ తన రాబోవు స్మార్ట్ ఫోన్ Realme 10S యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ ని కూడా రివీల్ చేసింది. రియల్మీ 10 4జీ, రియల్మీ 10 5జీ ఫోన్లకు పైన Realme 10S ఉంటుంది.

సరే ఓసారి Realme 10S యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై కన్నేద్దాం పదండి.

బడ్జెట్ శ్రేణిలో వస్తోన్న Realme 10S స్మార్ట్ ఫోన్

Realme 10S భారత్ లో వచ్చే ఏడాది లాంచ్ కానుంది. డిసెంబర్ 16 న అఫీషియల్ గా ఈ డివైజ్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 256జిబి స్టోరేజీతో వస్తున్నట్లు రియల్మీ వెల్లడించింది. ఫోన్ డిజైన్ ని కూడా రివీల్ చేసింది. ఫోన్ చూడటానికి రియల్మీ 10 4జీ మాదిరి కనిపిస్తోంది.

Realme 10S ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంది. ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉంది. వాల్యూమ్ రాకర్, సిమ్ ట్రే ఫోన్ కి ఎడమ వైపున ఉన్నాయి. పవర్ బటన్ కుడి వైపున ఉంది. రియర్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. వీటిలో రెండు కెమెరాలు ఉంటాయి. ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ కెమెరా సెన్సర్స్ కి పక్కన ఉంది.

ఇకపోతే ఫోన్ యొక్క ఫ్రంట్ డిజైన్ ఇంకా రివీల్ కాలేదు. స్క్రీన్ ఫ్లాట్ గా, సన్నని బెజెల్స్ తో ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. పంచ్ హోల్ కటౌట్ ఈ ఫోన్ లో ఉంటుంది.

Realme 10S స్పెసిఫికేషన్స్

TENAA ద్వారా Realme 10S యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. దాని ప్రకారం, Realme 10S లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటుంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. అలాగే 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Realme 10S స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపి మెయిన్ కెమెరా, 0.3 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇక Realme 10S యొక్క బరువు 191 గ్రాములు, పొడవు 164.4 మిల్లీ మీటర్లు, వెడల్పు 75.1 మిల్లీ మీటర్లు, మందం 8.1 మిల్లీ మీటర్లు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 16 న లాంచ్ కానున్న Realme 10S first appeared on 91Mobiles Telugu.

]]>