డిసెంబర్ 16 న లాంచ్ కానున్న Realme 10S

హైలైట్స్

  • మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్న రియల్మీ కంపెనీ
  • డిసెంబర్ 16 న లాంచ్ అవుతోన్న Realme 10S స్మార్ట్ ఫోన్
  • 256జిబి వరకు స్టోరేజీ, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme 10S

ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సిద్ధమవుతోంది. చూస్తుంటే రియల్మీ తన 10 సిరీస్ ని మరింతగా విస్తరించాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. డిసెంబర్ 16 న Realme 10S డివైజ్ చైనాలో లాంచ్ కానున్నట్లు సమాచారం. రియల్మీ తన రాబోవు స్మార్ట్ ఫోన్ Realme 10S యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ ని కూడా రివీల్ చేసింది. రియల్మీ 10 4జీ, రియల్మీ 10 5జీ ఫోన్లకు పైన Realme 10S ఉంటుంది.

సరే ఓసారి Realme 10S యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై కన్నేద్దాం పదండి.

బడ్జెట్ శ్రేణిలో వస్తోన్న Realme 10S స్మార్ట్ ఫోన్

Realme 10S భారత్ లో వచ్చే ఏడాది లాంచ్ కానుంది. డిసెంబర్ 16 న అఫీషియల్ గా ఈ డివైజ్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 256జిబి స్టోరేజీతో వస్తున్నట్లు రియల్మీ వెల్లడించింది. ఫోన్ డిజైన్ ని కూడా రివీల్ చేసింది. ఫోన్ చూడటానికి రియల్మీ 10 4జీ మాదిరి కనిపిస్తోంది.

Realme 10S ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంది. ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉంది. వాల్యూమ్ రాకర్, సిమ్ ట్రే ఫోన్ కి ఎడమ వైపున ఉన్నాయి. పవర్ బటన్ కుడి వైపున ఉంది. రియర్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. వీటిలో రెండు కెమెరాలు ఉంటాయి. ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ కెమెరా సెన్సర్స్ కి పక్కన ఉంది.

ఇకపోతే ఫోన్ యొక్క ఫ్రంట్ డిజైన్ ఇంకా రివీల్ కాలేదు. స్క్రీన్ ఫ్లాట్ గా, సన్నని బెజెల్స్ తో ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. పంచ్ హోల్ కటౌట్ ఈ ఫోన్ లో ఉంటుంది.

Realme 10S స్పెసిఫికేషన్స్

TENAA ద్వారా Realme 10S యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. దాని ప్రకారం, Realme 10S లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటుంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. అలాగే 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Realme 10S స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపి మెయిన్ కెమెరా, 0.3 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇక Realme 10S యొక్క బరువు 191 గ్రాములు, పొడవు 164.4 మిల్లీ మీటర్లు, వెడల్పు 75.1 మిల్లీ మీటర్లు, మందం 8.1 మిల్లీ మీటర్లు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article6.7-inch డిస్ప్లే, 5050mAh బ్యాటరీతో లాంచైన Nokia C31
Next articleBSNL రూ.528 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఒక్క ప్లాన్ తో 3 బెనిఫిట్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.