Realme 11 Pro+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Jun 2023 15:51:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! https://www.91mobiles.com/telugu/2023-june-lo-launch-ayye-smartphones-list/ Thu, 01 Jun 2023 15:51:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=6583 స్మార్ట్ ఫోన్ల లాంచ్ విషయానికి వస్తే, జూన్ నెల ఎంతో ముఖ్యమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో చాలా ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. టాప్ బ్రాండ్ అయిన శాంసంగ్ జూన్ 6 న Galaxy F54 ని జూన్ 6 న లాంచ్ చేయబోతోంది. మరోవైపు రియల్మీ సంస్థ జూన్ 8 న Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా రియల్మీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ […]

The post Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్ ఫోన్ల లాంచ్ విషయానికి వస్తే, జూన్ నెల ఎంతో ముఖ్యమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో చాలా ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. టాప్ బ్రాండ్ అయిన శాంసంగ్ జూన్ 6 న Galaxy F54 ని జూన్ 6 న లాంచ్ చేయబోతోంది. మరోవైపు రియల్మీ సంస్థ జూన్ 8 న Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా రియల్మీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా హిందీ నటుడు షారుఖ్ ఖాన్ ని నియమించుకుంది.

2023 జూన్ లో షావోమి, ఒప్పో, వివో, మోటోరోలా, వన్‌ప్లస్ తదితర సంస్థలు తమ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సరే, ఓసారి జూన్ నెలలో లాంచ్ అవుతోన్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇక్కడ చూద్దాం.

2023 జూన్ లో భారత్ లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

Samsung Galaxy F54

  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ధర: రూ.30,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 6, 2023

జూన్ 6 న శాంసంగ్ సంస్థ Samsung Galaxy F54 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ Galaxy M54 కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి.

Realme 11 Pro

  • డైమెన్సిటీ 7050 చిప్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ధర: 23,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 8, 2023

Realme 11 Pro స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత్ లో జూన్ 8 న లాంచ్ అవ్వనుంది. గ్లోబల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, డ్యూయల్ నానో సిమ్, 12జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7050 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Realme 11 Pro+

  • 200ఎంపి ప్రైమరీ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ధర: రూ.30,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 8, 2023

రియల్మీ కంపెనీ చైనాలో Realme 11 Pro+ డివైజ్ ని లాంచ్ చేసింది. జూన్ 8 న భారత్ లో Realme 11 Pro తో పాటు Realme 11 Pro+ డివైజ్ భారత్ లో లాంచ్ కానుంది. గ్లోబల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, 12జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, 200 ఎంపి ప్రైమరీ కెమెరా, సూపర్ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

OPPO Reno 10 సిరీస్

  • 120హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 100 వాట్ చార్జింగ్ సపోర్ట్
  • ధర: రూ.31,000-రూ.33,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్, 2023 (అంచనా)

OPPO Reno 10 సిరీస్ జూన్ లో భారత్ లో లాంచ్ అవుతోంది. OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ ఈ లైనప్ లో రానున్నాయి. 120 హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 778జి, మీడియాటెక్ డైమెన్సిటీ 8200, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 80 వాట్ చార్జింగ్, 100 వాట్ చార్జింగ్ ఈ ఫోన్లలో ఉన్నాయి.

OnePlus Nord 3

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరా
  • ధర: రూ.27,999 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్, 2023 (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.

2023 జూన్ లో గ్లోబల్ గా లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు

Motorola Razr 40

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ధర: 104,399 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 1, 2023

Motorola Razr 40 సిరీస్ ఫోన్ 2023 జూన్ 1 న గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో 2 ఫోల్డబుల్ ఫోన్లు Motorola Razr 40, Motorola Razr 40 Ultra ఫోన్లు లాంచ్ అయ్యాయి. Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ పోల్డబుల్ డిస్ప్లే, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ + 13ఎంపి అల్ట్రావైడ్ డ్యూయల్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

  • Vivo V29 సిరీస్
  • Xiaomi 13 Ultra

The post Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme 11 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ, ర్యామ్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/realme-11-pro-11-pro-plus-india-launch-date-ram-price-color-options-leaked/ Mon, 29 May 2023 05:53:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=6517 చైనాలో ఇటీవలె లాంచైన Realme 11 Pro సిరీస్ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. లాంచ్ కి ముందు, టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే లాంచ్ తేదీ, ర్యామ్ వివరాలు, కలర్ ఆప్షన్స్ తదితర విషయాలను పంచుకున్నారు. ఆయన లీక్ చేసిన Realme 11 Pro సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందా పదండి. Realme 11 Pro ఇండియా లాంచ్ తేదీ, లభ్యత (అంచనా) టిప్‌స్టర్ చెబుతున్న […]

The post లీకైన Realme 11 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ, ర్యామ్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 8 న Realme 11 Pro సిరీస్ భారత్‌లో లాంచ్ అవుతుందని అంచనా
  • లైనప్ లో రానున్న Realme 11 Pro, Realme 11 Pro+
  • కలర్ ఆప్షన్స్: సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్

చైనాలో ఇటీవలె లాంచైన Realme 11 Pro సిరీస్ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. లాంచ్ కి ముందు, టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే లాంచ్ తేదీ, ర్యామ్ వివరాలు, కలర్ ఆప్షన్స్ తదితర విషయాలను పంచుకున్నారు. ఆయన లీక్ చేసిన Realme 11 Pro సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందా పదండి.

Realme 11 Pro ఇండియా లాంచ్ తేదీ, లభ్యత (అంచనా)

టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, Realme 11 Pro జూన్ 8 న భారత్ లో లాంచ్ కానుంది. ఈ సిరీస్ తో పాటు Realme Buds Air 5 Pro టీడబ్ల్యూఎస్ కూడా లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

భారత్ లో Realme 11 Pro సిరీస్ లాంచ్ తేదీని రియల్మీ సంస్థ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే లాంచ్ తర్వాత Realme 11 Pro సిరీస్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని తెలుస్తోంది.

Realme 11 Pro స్టోరేజీ కన్ఫిగరేషన్స్ (లీక్)

Realme 11 Pro

  • స్టోరేజీ: బేస్ మోడల్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి+128జిబి, 12జిబి+256జిబి మరియు 8జిబి+256జిబి.
  • కలర్స్: ఈ స్మార్ట్ ఫోన్ సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 11 Pro+

  • స్టోరేజీ: Realme 11 Pro+ డివైజ్ 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కలర్స్: ఇది సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 11 Pro సిరీస్ భారత మార్కెట్ ధర (అంచనా)

రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, Realme 11 Pro ధర రూ.22,000 నుంచి రూ.23,000 మధ్య ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు Realme 11 Pro+ డివైజ్ ధర రూ.28,000 నుంచి రూ.29,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ధరలు ప్రారంభ ధరలు మాత్రమేనని తెలుస్తోంది.

The post లీకైన Realme 11 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ, ర్యామ్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
‘మూన్ మోడ్’ ఫీచర్ తో వస్తోన్న Realme 11 Pro+ https://www.91mobiles.com/telugu/realme-11-pro-plus-new-feature-moon-mode-expected-specs/ Sun, 23 Apr 2023 17:10:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=5998 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ ని షావోమి యొక్క రెడ్మీ నోట్ 12 సిరీస్ కి పోటీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో తన కొత్త లైనప్ లో రియల్మీ కంపెనీ Realme 11 Pro+, Realme 11 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఇప్పుడు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో […]

The post ‘మూన్ మోడ్’ ఫీచర్ తో వస్తోన్న Realme 11 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే నెలలో చైనాలో లాంచ్ కానున్న Realme 11 Pro+
  • మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వచ్చే అవకాశం
  • 200ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలియజేస్తోన్న లీక్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ ని షావోమి యొక్క రెడ్మీ నోట్ 12 సిరీస్ కి పోటీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో తన కొత్త లైనప్ లో రియల్మీ కంపెనీ Realme 11 Pro+, Realme 11 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఇప్పుడు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో పై రియల్మీ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఓ విషయాన్ని వెల్లడించారు. రాబోవు రియల్మీ సిరీస్ డెడికేటెడ్ మూన్ మోడ్ తో వస్తున్నట్లు ఆయన తెలిపారు.

Realme 11 Pro+ గురించి ఇప్పటివరకు తెలిసినవి

రియల్మీ చైనా మార్కెటింగ్ డైరెక్టర్ జెస్సీ షేర్ చేసిన మూడ్ మోడ్ శాంపిల్

Realme 11 Pro+ డివైజ్ లో మూన్ మోడ్ ని తీసుకొస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్ లో టెలీఫోటో కెమెరా యూనిట్ ని తీసుకొస్తున్నట్లు వెల్లడించలేదు. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ జూమ్ ఫీచర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది శాంసంగ్ తీసుకొచ్చిన స్పేస్ జూమ్ ఫీచర్ తరహాలో ఉంటుంది. శాంసగ్ తన ఫ్లాగ్ఫిప్ గెలాక్సీ ఎస్-సిరీస్ కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్21 అల్ట్రా నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

అయితే రియల్మీ తీసుకొచ్చే ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఇండస్ట్రీ ట్రెండ్స్ ని బట్టి, Realme 11 Pro+ లో టెలీఫోటో కెమెరా యూనిట్ ని రియల్మీ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా ఏఐ అల్గారిథమ్స్, సాఫ్ట్‌వేర్ ఇంప్రూవ్మెంట్స్ తో జూమ్ పెర్ఫామెన్స్ ని ఆప్టిమైజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేకించి చందమామ ఫోటోను తీసుకునేందుకు ఈ అప్‌గ్రేడ్స్ ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతానికైతే మూన్ మోడ్ ఫీచర్ వివరాలు రహస్యంగానే ఉన్నాయి.

Realme 11 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ లేదా ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.

చిప్సెట్

  • Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఇది 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన చిప్ అని తెలుస్తోంది. ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ ఉంటాయని అంచనా.

కెమెరా

  • Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ లో 200 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని అంచనా.

ఓఎస్

  • Realme 11 Pro+ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

రియల్మీ సంస్థ Realme 11 Pro+ డివైజ్ ని తొలుత చైనాలో లాంచ్ చేసి, తర్వాత భారత మార్కెట్ లోకి విడుదల చేస్తుందని అంచనా. ఈ డివైజ్ రియల్మీ 10 ప్రో+ డివైజ్ ని రిప్లేస్ చేయనుంది. ప్రస్తుతం రియల్మీ 10 ప్రో+ ధర భారత్ లో రూ.24,999 గా ఉంది. అంటే Realme 11 Pro+ ధర రూ.30,000 కి కాస్త అటు ఇటూగా ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ‘మూన్ మోడ్’ ఫీచర్ తో వస్తోన్న Realme 11 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>