Realme 12 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Jul 2024 18:44:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 12 Pro 5G ధర రూ.4,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-price-drop-by-rs-4500-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-price-drop-by-rs-4500-know-full-details/#respond Tue, 23 Jul 2024 18:26:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=12644 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 12 ప్రో సిరీస్ లోని Realme 12 Pro 5G డివైజ్ ధరను తగ్గించింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.4,500 తక్కువ ధరకు లభించనుంది. రియల్మీ 12 ప్రో లాంచ్ ధర రూ.25,999 గా ఉంది. ఇప్పుడు తగ్గింపు తర్వాత ఈ ఫోన్‌ని యూజర్లు రూ.21,990 కే సొంతం చేసుకోవచ్చు. ధర తగ్గింపుకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. Realme 12 Pro 5G ధర తగ్గింపు వివరాలు […]

The post Realme 12 Pro 5G ధర రూ.4,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12 Pro 5G ధర తగ్గింపు
  • రూ.4,500 తగ్గిన రియల్మీ 12 ప్రో
  • ప్రస్తుత ప్రారంభ ధర రూ.21,990

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 12 ప్రో సిరీస్ లోని Realme 12 Pro 5G డివైజ్ ధరను తగ్గించింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.4,500 తక్కువ ధరకు లభించనుంది. రియల్మీ 12 ప్రో లాంచ్ ధర రూ.25,999 గా ఉంది. ఇప్పుడు తగ్గింపు తర్వాత ఈ ఫోన్‌ని యూజర్లు రూ.21,990 కే సొంతం చేసుకోవచ్చు. ధర తగ్గింపుకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro 5G ధర తగ్గింపు వివరాలు

Realme 12 Pro 5G రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్‌ రూ.25,999 ధరతో విడుదలైంది. ప్రస్తుతం రూ.4,009 తగ్గింపు తర్వాత ఇది రూ.21,990 కి లభిస్తుంది.

Realme 12 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.26,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రూ.4,505 తగ్గింపు తర్వాత దీన్ని రూ.22,494 కే సొంతం చేసుకోవచ్చు.

Realme 12 Pro 5G 12జిబి + 256జిబి స్టోరేజీ మోడల్ కూడా తర్వాత లాంచ్ అయ్యింది. ఈ వేరియంట్ ధర తగ్గింపు వివరాలు ఇంకా తెలియదు.

Realme 12 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1.07 బిలియన్ కలర్స్, 100% పీ3 కలర్ గేముత్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి. డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

కెమెరా: Realme 12 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme 12 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Realme 12 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme 12 Pro 5G లో హై-రెజ్ డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.

The post Realme 12 Pro 5G ధర రూ.4,500 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-price-drop-by-rs-4500-know-full-details/feed/ 0
Realme: భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-12gb-ram-variant-launched-in-india/ Tue, 12 Mar 2024 06:14:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10638 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2024 ఆరంభంలో Realme 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G మరియు Realme 12 Pro+ 5G ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ లోని ప్రో మోడల్ 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు రియల్మీ సంస్థ Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ ని తీసుకొచ్చింది. కర్వ్డ్ ఫోన్లలో అత్యధిక ర్యామ్ […]

The post Realme: భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OLED డిస్ప్లే
  • రూ.28,999 ధర
  • మార్చి 15 సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2024 ఆరంభంలో Realme 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G మరియు Realme 12 Pro+ 5G ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ లోని ప్రో మోడల్ 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు రియల్మీ సంస్థ Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ ని తీసుకొచ్చింది. కర్వ్డ్ ఫోన్లలో అత్యధిక ర్యామ్ గల ఫోన్ ఇదేనంటూ రియల్మీ కంపెనీ చెబుతోంది. ఓసారి ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro 5G ధర

Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.28,999 గా ఉంది.

Realme 12 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

Realme 12 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.

Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ మోడల్‌ని కంపెనీ రూ.28,999 ధరతో లాంచ్ చేసింది. 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ప్రారంభ సేల్ లో భాగంగా 12జిబి వేరియంట్ కొనుగోలుపై రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

దీంతో యూజర్ ఈ ఫోన్‌ని రూ.24,999 కే సొంతం చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ మరియు ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మార్చి 15వ తేదీ నుంచి Realme 12 Pro 5G సేల్ ప్రారంభమవుతుంది. రియల్మీ వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme 12 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1.07 బిలియన్ కలర్స్, 100% పీ3 కలర్ గేముత్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి. డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Realme 12 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 12 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 12 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12 Pro 5G లో హై-రెజ్ డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.
  • బరువు, మందం: Realme 12 Pro 5G డివైజ్ 190 గ్రాముల బరువు, 8.75 మి.మీ మందం ఉంటుంది.
  • కలర్ ఆప్షన్స్: Realme 12 Pro 5G ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 12 Pro+ 5G పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-5g-discount-offer-know-the-full-details/ Thu, 22 Feb 2024 18:14:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=10380 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2024 జనవరిలో భారతీయ మార్కెట్ లో Realme 12 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే లాంచై నెల రోజులు పూర్తి కాకుండానే ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ లో భాగంగా Realme 12 Pro+ 5G పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తోంది. Realme 12 Pro+ 5G కొనాలని భావించే కస్టమర్లకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, […]

The post Realme 12 Pro+ 5G పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరిలో లాంచైన Realme 12 Pro+ 5G
  • లాంచైన నెలలోపే డిస్కౌంట్
  • డివైజ్ పై రూ.2,000 డిస్కౌంట్ ఆఫర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme 2024 జనవరిలో భారతీయ మార్కెట్ లో Realme 12 Pro+ 5G డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే లాంచై నెల రోజులు పూర్తి కాకుండానే ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ లో భాగంగా Realme 12 Pro+ 5G పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తోంది. Realme 12 Pro+ 5G కొనాలని భావించే కస్టమర్లకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G ఆఫర్

  • Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ పై మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
  • Realme 12 Pro+ 5G డివైజ్ పై ఆఫర్ లో భాగంగా రూ.2,000 తగ్గింపుని పొందవచ్చు.
  • ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 29 వరకు, ఏడు రోజుల పాటు Realme 12 Pro+ 5G పై ఈ డిస్కౌంట్ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
  • ఆఫర్ సమయంలో, Realme 12 Pro+ 5G 8జిబి+256జిబి మోడల్ ని రూ.29,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.31,999.

Realme 12 Pro+ 5G ధర

  • Realme 12 Pro+ 5G డివైజ్ భారత్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • Realme 12 Pro+ 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.
  • Realme 12 Pro+ 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది.
  • Realme 12 Pro+ 5G 12జిబి+256జిబి మోడల్ ధర రూ.33,999 గా ఉంది.
  • Realme 12 Pro+ 5G డివైజ్‌ని సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్ మరియు ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Realme 12 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro+ 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Realme 12 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme 12 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme 12 Pro+ 5G పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-vs-redmi-note-13-pro-5g-which-is-best/ Mon, 29 Jan 2024 15:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9963 Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ మిడ్ రేంజ్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో లాంచ్ చేయబడ్డాయి. ఈసారి ఈ రెండు ఫోన్లు మార్కెట్ లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. రెండు ఫోన్లు కూడా చక్కటి కెమెరా సామర్థ్యంతో వచ్చాయి. డిజైన్ మరియు బిల్ట్ క్వాలిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి రెండు ఫోన్లలో ఏ ఫోన్ జనాల ఆదరణ ఎక్కువగా పొందుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఈలోపు […]

The post Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ మిడ్ రేంజ్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో లాంచ్ చేయబడ్డాయి. ఈసారి ఈ రెండు ఫోన్లు మార్కెట్ లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. రెండు ఫోన్లు కూడా చక్కటి కెమెరా సామర్థ్యంతో వచ్చాయి. డిజైన్ మరియు బిల్ట్ క్వాలిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి రెండు ఫోన్లలో ఏ ఫోన్ జనాల ఆదరణ ఎక్కువగా పొందుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. ఈలోపు మనం రెండు ఫోన్లలో ఉన్న స్పెసిఫికేషన్స్ ని పోల్చి చూద్దాం.

Realme 12 Pro vs Redmi Note 13 Pro

ప్రాసెసర్

  • Realme 12 Pro డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ ఉపయోగించారు.
  • Redmi Note 13 Pro లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్సెట్ కూడా 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ

  • Realme 12 Pro మరియు Redmi Note 13 Pro డివైజెస్ లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • Realme 12 Pro లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

డిస్ప్లే

  • Realme 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • Redmi Note 13 Pro లో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్

  • Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • Redmi Note 13 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ

  • రెండు ఫోన్లలో 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
  • అయితే Redmi Note 13 Pro లో ఎన్ఎఫ్‌సీ ఉంది. Realme 12 Pro లో ఎన్ఎఫ్‌సీని అందించలేదు.

కెమెరా

  • Realme 12 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
  • Redmi Note 13 Pro లో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ

  • Realme 12 Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • Redmi Note 13 Pro లో 5,100ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఏది కొనాలి?

  • Realme 12 Pro లో సోని కెమెరా లెన్సెస్, టెలీఫోటో లెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు Redmi Note 13 Pro విషయానికి వస్తే, 200ఎంపి మెయిన్ కెమెరా, 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఆకట్టుకుంటున్నాయి.
  • వినియోగదారులు తమ అభిరుచికి తగిన ఫోన్‌ని అన్ని స్పెసిఫికేషన్స్ ని బాగా పోల్చి చూసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

The post Realme 12 Pro 5G vs Redmi Note 13 Pro 5G: రెండింట్లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: 32MP టెలీఫోటో కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G https://www.91mobiles.com/telugu/realme-12-pro-5g-launched-in-india-with-32mp-telephoto-camera/ Mon, 29 Jan 2024 08:10:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9951 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G, Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 12 Pro 5G గురించి తెలుసుకుందాం. Realme 12 Pro 5G డివైజ్ 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, […]

The post Realme: 32MP టెలీఫోటో కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Realme 12 Pro సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme 12 Pro 5G, 12 Pro+ 5G
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన Realme 12 Pro 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro 5G, Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 12 Pro 5G గురించి తెలుసుకుందాం. Realme 12 Pro 5G డివైజ్ 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Realme 12 Pro 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro 5G ధర

  • Realme 12 Pro 5G డివైజ్ భారత్ లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • Realme 12 Pro 5G 8జిబి+128జిబి మోడల్ ధరను రూ.25,999 గా నిర్ణయించారు.
  • Realme 12 Pro 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
  • ఇప్పుడు Realme 12 Pro 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 12 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1.07 బిలియన్ కలర్స్, 100% పీ3 కలర్ గేముత్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి మరియు 8జిబి+256జిబి. డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Realme 12 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 12 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme 12 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12 Pro 5G లో హై-రెజ్ డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.
  • బరువు, మందం: Realme 12 Pro 5G డివైజ్ 190 గ్రాముల బరువు, 8.75 మి.మీ మందం ఉంటుంది.
  • కలర్ ఆప్షన్స్: Realme 12 Pro 5G ఫోన్ సబ్‌మరైన్ బ్లూ, నేవిగేటర్ బీజ్, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Realme: 32MP టెలీఫోటో కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 12 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>