200MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro Plus

Highlights

  • భారత్‌లో లాంచైన Redmi Note 13 సిరీస్
  • 120W ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన Redmi Note 13 Pro Plus
  • 67W ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న Note 13 Pro

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఇక, ఈ లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus గురించి తెలుసుకుందాం. Redmi Note 13 5G వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇకపోతే, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus డివైజెస్ 200ఎంపి మెయిన్ కెమెరా, 12జిబి ర్యామ్, డాల్బీ అట్మాస్, హెచ్డీఆర్10+ వంటి ఫీచర్లతో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus ధరలు

  • Redmi Note 13 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధరను రూ.29,999 గా పెట్టారు.
  • Redmi Note 13 Pro డివైజ్ జనవరి 10 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
  • Redmi Note 13 Pro డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమి పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Redmi Note 13 Pro ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ని కంపెనీ అందిస్తోంది.
  • Redmi Note 13 Pro Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా నిర్ణయించారు.
  • Redmi Note 13 Pro Plus 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.33,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro Plus 12జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro Plus డివైజ్ జనవరి 10 వ తేదీ నుంచి సేల్ కి వస్తోంది.
  • Redmi Note 13 Pro Plus స్మార్ట్‌ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమి పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Redmi Note 13 Pro Plus కొనుగోలుపై షావోమి కంపెనీ రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తోంది. ఇంకా అదనంగా రూ.2,500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.