Realme 12x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Oct 2024 05:56:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-12x-5g-discount-rs-1500-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-12x-5g-discount-rs-1500-know-full-details/#respond Mon, 07 Oct 2024 05:55:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=13942 ప్రస్తుతం భారత్ లో పండుగల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లపై మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరలో చక్కటి 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది సరైన ఆప్షన్ అవ్వచ్చు. ఓసారి ఆఫర్ వివరాలు మరియు రియల్మీ 12ఎక్స్ 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Realme 12x 5G ఆఫర్లు మరియు ధర […]

The post Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12x 5G పై డిస్కౌంట్
  • రూ.1500 ప్రయోజనం
  • ఫ్లిప్‌కార్ట్ లో సేల్

ప్రస్తుతం భారత్ లో పండుగల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లపై మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరలో చక్కటి 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది సరైన ఆప్షన్ అవ్వచ్చు. ఓసారి ఆఫర్ వివరాలు మరియు రియల్మీ 12ఎక్స్ 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 12x 5G ఆఫర్లు మరియు ధర

  • Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి మరియు 8జిబి మోడల్స్ పై కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది.
  • Realme 12x 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ను రూ.1500 తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్ రూ.13,499 కి లభించనుంది. దీని అసలు ధర రూ.14,999 గా ఉంది.
  • మీరు గనుక 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఎంచుకుంటే మీకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్‌ని మీరు రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.13,499 గా ఉంది. ఇక, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఇంకా కూడా రూ.11,999 ధరతోనే లభిస్తోంది.
  • మీరు గనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా Realme 12x 5G డివైజ్‌ కొంటే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
  • ఈ ఆఫర్లతో పాటు, కంపెనీ రూ.8,650 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. అయితే మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
  • అంతేకాదు, 3 నుంచి 24 నెలల కాలపరిమితితో ఈఎంఐ ద్వారా Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ కోరల్ రెడ్, ట్విలైట్ పర్పుల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఎక్కడ కొనాలి?

రియల్మీ 12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై కొనుగోలు చేయవచ్చు. క్రింద మేం ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే డివైజ్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా, ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్ పై కూడా లభిస్తుంది. కాకపోతే, లాంచ్ ధరకే కొనాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

Realme 12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

ఓఎస్: Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి. అలాగే 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.

కనెక్టివిటీ: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో ఎయిర్ జెశ్చర్స్ మరియు డైనమిక్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-12x-5g-discount-rs-1500-know-full-details/feed/ 0
Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/realme-6th-anniversary-sale-discounts-on-realme-12x-5g-realme-p1-series-and-other-products/ Fri, 03 May 2024 11:17:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11339 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 6వ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను భారత్‌లో ప్రకటించింది. సేల్ సందర్భంగా, కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లు మరియు ఇయర్‌బడ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. Realme 12x 5G, P1 5G, P1 Pro 5G, Narzo 70 Pro 5G ఫోన్లతో పాటు, Realme Buds Air 5 Pro పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క ఆన్‌స్టోర్స్ పై వర్తిస్తాయి. ఓసారి ఆ […]

The post Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రియల్మీ యానివర్శరీ సేల్‌లో డిస్కౌంట్స్
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్మీ స్టోర్‌లో ఆఫర్లు
  • డిస్కౌంట్‌పై లభిస్తోన్న Realme 12x 5G, P1 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 6వ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను భారత్‌లో ప్రకటించింది. సేల్ సందర్భంగా, కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లు మరియు ఇయర్‌బడ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. Realme 12x 5G, P1 5G, P1 Pro 5G, Narzo 70 Pro 5G ఫోన్లతో పాటు, Realme Buds Air 5 Pro పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క ఆన్‌స్టోర్స్ పై వర్తిస్తాయి. ఓసారి ఆ డిస్కౌంట్ వివరాలను తెలుసుకుందాం.

Realme 6th యానివర్శరీ సేల్ ఆఫర్లు

Realme 12x 5G

రియల్మీ ఆరవ వార్షికోత్సవ సేల్ లో భాగంగా, Realme 12x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మోడల్ రూ.10,999 కే లభించనుంది. మరోవైపు, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మోడల్‌ని రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాదు, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ వేరియంట్ ని రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు.

Realme P1 5G

Realme P1 5G డివైజ్ 6జిబి+128జిబి, 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ రూ.14,999 కి, మిడ్ వేరియంట్ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ + రూ.500 అడిషనల్ డిస్కౌంట్ కలుపుకుని రూ.15,999 కి, టాప్ స్టోరేజీ వేరియంట్ రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ కలుపుకుని రూ.16,999 కి లభిస్తుంది.

Realme P1 Pro 5G

Realme P1 Pro 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి మోడల్స్ ధరలు రూ.1000 కూపన్ డిస్కౌంట్ తర్వాత వరుసగా రూ.19,999 మరియు రూ.20,999 గా ఉన్నాయి.

Realme Narzo 70 Pro 5G

Realme Narzo 70 Pro 5G 8జిబి+128జిబి మోడల్ పై రూ.2,000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ పై రూ.3,000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ల తర్వాత వీటి ధరలు వరుసగా రూ.17,999 మరియు రూ.18,999 గా ఉన్నాయి.

Realme Narzo 70 5G

Realme Narzo 70 5G డివైజ్ యొక్క 6జిబి+128జిబి మరియు 8జిబి+128జిబి మోడల్స్ పై రూ.1000 కూపన్ డిస్కౌంట్ తర్వాత రూ.14,999 మరియు రూ.15,999 కి లభించనున్నాయి.

Realme Narzo 70x 5G

Realme Narzo 70x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి వేరియంట్ పై రూ.1,500 డిస్కౌంట్ మరియు 6జిబి వేరియంట్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.10,999 మరియు రూ.11,999 కి చేరుతాయి.

Realme Buds Air 5, Realme Buds Air 5 Pro

Realme Buds Air 5 పై రూ.700 డిస్కౌంట్ లభిస్తోంది. మరోవైపు, Realme Buds Air 5 Pro పై రూ.500 డిస్కౌంట్ మరియు రూ.300 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాదు, రియల్మీ ఇతర ఉత్పత్తులైన, Realme 12 Pro 5G, Realme 12 Pro+ 5G, Narzo 60x 5G మరియు Realme Buds T100 డివైజెస్ పై కూడా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: 45W చార్జింగ్, 120Hz డిస్ప్లేతో లాంచైన Realme 12x 5G https://www.91mobiles.com/telugu/realme-12x-5g-launched-india-45w-fast-charging-120hz-display/ Tue, 02 Apr 2024 16:41:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=10934 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు మెమొరీ వేరియంట్లలో వచ్చింది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. రియల్మీ 12ఎక్స్ 5జీ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. […]

The post Realme: 45W చార్జింగ్, 120Hz డిస్ప్లేతో లాంచైన Realme 12x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Realme 12x 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు మెమొరీ వేరియంట్లలో వచ్చింది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. రియల్మీ 12ఎక్స్ 5జీ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Realme 12x 5G ధర, సేల్ తేదీ

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 12x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు.

Realme 12x 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా పెట్టారు.

ఈ ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ట్విలైట్ పర్పుల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

ఓఎస్: Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి. అలాగే 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.

కనెక్టివిటీ: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో ఎయిర్ జెశ్చర్స్ మరియు డైనమిక్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Realme: 45W చార్జింగ్, 120Hz డిస్ప్లేతో లాంచైన Realme 12x 5G first appeared on 91Mobiles Telugu.

]]>