Realme: 45W చార్జింగ్, 120Hz డిస్ప్లేతో లాంచైన Realme 12x 5G

Highlights

  • భారత్‌లో లాంచైన Realme 12x 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 12x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు మెమొరీ వేరియంట్లలో వచ్చింది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. రియల్మీ 12ఎక్స్ 5జీ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Realme 12x 5G ధర, సేల్ తేదీ

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 12x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు.

Realme 12x 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా పెట్టారు.

ఈ ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ట్విలైట్ పర్పుల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

ఓఎస్: Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి. అలాగే 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.

కనెక్టివిటీ: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో ఎయిర్ జెశ్చర్స్ మరియు డైనమిక్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.