Realme 13 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Sep 2024 17:57:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/ https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/#respond Tue, 17 Sep 2024 17:14:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13551 Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి […]

The post Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం.

Realme 13 vs CMF Phone 1: ధరలు

స్టోరేజీ వేరియంట్స్ రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
6జిబి+128జిబి రూ.15,999
8జిబి+128జిబి రూ.17,999 రూ.17,999
8జిబి+256జిబి రూ.19,999

 

గీక్‌బెంచ్

ఇప్పుడు రెండు ఫోన్ల యొక్క గీక్‌బెంచ్ స్కోర్లను చెక్ చేద్దాం. ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ ను ఎంచుకోవడం జరిగింది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

స్కోర్లను బట్టి చూస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1, రియల్మీ 13 కంటే బెటర్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టెస్టుల్లో రియల్మీ 13 వెనకబడింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ అనేది బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ లపై ప్రభావం చూపుతుంది. మరోవైపు, మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి హెవీ టాస్కులపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్స్ ప్రకారం, సీఎంఎఫ్ ఫోన్ 1 లో ఈ అన్నీ టాస్కులు స్మూథ్ గా నడుస్తాయని స్పష్టమవుతోంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
సింగిల్-కోర్ 782 1015
మల్టీ-కోర్ 1978 2867

 

విజేత: CMF Phone 1

అంటుటు

గీక్‌బెంచ్ కంటే మరింత లోతైన ఫలితాలను అంటుటు అందిస్తుంది. ఇది సీపీయూ, జీపీయూ, మెమొరీ మరియు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ఇక్కడ కూడా.. అంటుటు స్కోర్ల విషయానికి వస్తే, రియల్మీ 13 పై సీఎంఎఫ్ ఫోన్ 1 పైచేయి సాధించింది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

రెండు ఫోన్ల యొక్క ఫలితాలను గమనిస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క జీపీయూ స్కోర్ ఎక్కువగా ఉంది. ఇతర స్కోర్లు కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. రియల్మీ 13 తో పోల్చితే, సీఎంఎఫ్ ఫోన్ 1 అన్ని విభాగాల్లోనూ బెటర్ గా పెర్ఫామర్ గా నిలిచింది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
అంటుటు 4,52,218 6,42,187

 

విజేత: CMF Phone 1

సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్

తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందో అనే విషయాన్ని సీపీయూ థ్రాట్లిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ కోసం మేము, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ను ఉపయోగించాం. ఈ టెస్టులో సీఎంఎఫ్ ఫోన్ 1 కంటే రియల్మీ 13 మంచి స్కోర్ చేసింది. మీరు గనుక, రోజూ ఎక్కువగా గేమ్స్ ఆడటంతో పాటు ఇంటెన్సివ్ టాస్కులు చేస్తే, మీకు రియల్మీ 13 బాగా సరిపోతుంది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)
రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
ఒత్తిడి సమయంలో పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ 63.5 58.2

 

విజేత: Realme 13

గేమింగ్ టెస్ట్

మేం రెండు ఫోన్లలోనూ ఒక్కో దానిలో 30 నిమిషాల చొప్పున కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్‌లను ఆడాం. ఈ మూడు గేముల్లోనూ సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హీట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే.. 90 నిమిషాల గేమింగ్ సెషన్ తర్వాత, రియల్మీ 13 యొక్క టెంపరేచర్ 15.3 డిగ్రీలు పెరిగింది. సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క టెంపరేచర్ 14.6 డిగ్రీలు పెరిగింది.

థర్మల్స్ విషయానికి వస్తే, రెండు ఫోన్లలో పెద్దగా తేడా లేదు. అయితే, మీరు గనుక రోజూ గేమ్స్ ఆడే వారైతే, మీకు సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ ఆప్షన్ అవుతుంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
90 నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 5.1 డిగ్రీల సెల్సియస్ 4.86 డిగ్రీల సెల్సియస్

 

విజేత: CMF Phone 1

ఏది బెటర్?

అన్ని ఫలితాలను బట్టి చూస్తే, Realme 13 పై CMF Phone 1 విజయం సాధించిందని అర్థమవుతోంది. మంచి బెంచ్‌మార్క్ ఫలితాలను సీఎంఎఫ్ ఫోన్ 1 కలిగి ఉంది. గేమింగ్ పెర్ఫామెన్స్ కూడా బాగుంది. హీట్ మేనేజ్మెంట్ ఫర్వాలేదు. రెండు ఫోన్లలో CMF Phone 1 బెటర్ చాయిస్ అని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే, దీని ధర కూడా తక్కువే.

ఈ స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: గౌరవ్ శర్మ

The post Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/feed/ 0
Realme 13+ 5G: డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్‌తో లాంచైన రియల్మీ 13 ప్లస్ https://www.91mobiles.com/telugu/realme-13-plus-launched-india-dimensity-7300-energy-chipset/ https://www.91mobiles.com/telugu/realme-13-plus-launched-india-dimensity-7300-energy-chipset/#respond Thu, 29 Aug 2024 11:51:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13242 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 13 5G సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G అనే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మనం Realme 13+ 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, […]

The post Realme 13+ 5G: డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్‌తో లాంచైన రియల్మీ 13 ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో రియల్మీ 13 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వచ్చిన Realme 13, 13+
  • రియల్మీ 13+ ప్రారంభ ధర రూ.22,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 13 5G సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G అనే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మనం Realme 13+ 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 13+ 5G సేల్ వివరాలు, ధర

Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+256జిబి వేరియంట్ ధరను రూ.26,999 గా ఉంది.

సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనేవారికి రూ.1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ప్రీ-బుకింగ్ ఆఫర్ లో భాగాంగా రూ.3,000 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. నేటి నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.

Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్ విక్టరీ గోల్డ్ మరియు స్పీడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 13+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13+ 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180హెర్ట్జ్/1200హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 13+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 జీపీయూ వినియోగించారు.

కెమెరా: Realme 13+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme 13+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Realme 13+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 13+ 5G లో ఐపీ65 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్‌టచ్ టెక్నాలజీ, వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

The post Realme 13+ 5G: డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్‌తో లాంచైన రియల్మీ 13 ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-plus-launched-india-dimensity-7300-energy-chipset/feed/ 0
Realme 13 5G: 18జిబి వరకు ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-13-5g-launched-india-up-to-18gb-ram/ https://www.91mobiles.com/telugu/realme-13-5g-launched-india-up-to-18gb-ram/#respond Thu, 29 Aug 2024 09:09:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=13239 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన 13-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Realme 13 5G సిరీస్ లో భాగంగా Realme 13 5G మరియు Realme 13 5G Plus ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 18జిబి వరకు ర్యామ్ పవర్‌ను అందించడం విశేషం. ఓసారి ఈ ఫోన్ యొక్క సేల్ వివరాలు, ధర […]

The post Realme 13 5G: 18జిబి వరకు ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో Realme 13 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన 13-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Realme 13 5G సిరీస్ లో భాగంగా Realme 13 5G మరియు Realme 13 5G Plus ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 18జిబి వరకు ర్యామ్ పవర్‌ను అందించడం విశేషం. ఓసారి ఈ ఫోన్ యొక్క సేల్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 5G ధర, సేల్ వివరాలు

Realme 13 5G స్మార్ట్‌పోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ కూడా ఉంది.

Realme 13 5G స్మార్ట్‌ఫోన్‌ని సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్మీ వెబ్‌సైట్ పై మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కూడా కొనవచ్చు.

Realme 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 580నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐ-కంఫర్ట్, డార్క్ మోడ్ ఫీచర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 10జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. డైనమిక్ ర్యామ్ వల్లన, యూజర్‌కి గరిష్టంగా 18జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి శాంసంగ్ S5KJNS ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోటో కెమెరా లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme 13 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 13 5G లో ఐపీ64 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, స్టీరియో స్పీకర్స్, ఆంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ సిస్టమ్, 6 యాక్సెస్ హైపర్ సెన్సిటివ్ జైరోస్కోప్, స్మార్ట్ ఇమేజ్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ స్మార్ట్ లుక్, ఏఐ గేమింగ్ నెట్వర్క్ ఉన్నాయి.

The post Realme 13 5G: 18జిబి వరకు ర్యామ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-5g-launched-india-up-to-18gb-ram/feed/ 0
Realme 13 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 5జీ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-13-5g-specs-revealed-via-tenaa-listing/ https://www.91mobiles.com/telugu/realme-13-5g-specs-revealed-via-tenaa-listing/#respond Fri, 02 Aug 2024 06:28:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=12801 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రియల్మీ 13 ప్రో 5జీ, రియల్మీ 13 ప్రో ప్లస్ 5జీ అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. తాజాగా స్టాండర్డ్ మోడల్ Realme 13 5G సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post Realme 13 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 5జీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ RMX3952
  • ఎల్టీపీఎస్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రియల్మీ 13 ప్రో 5జీ, రియల్మీ 13 ప్రో ప్లస్ 5జీ అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. తాజాగా స్టాండర్డ్ మోడల్ Realme 13 5G సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme 13 5G TENAA సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 5G డివైజ్ యొక్క చైనీస్ వేరియంట్ RMX3952 మోడల్ నంబర్ తో TENAA సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

Realme 13 5G డివైజ్ 6.72-ఇంచ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 4880 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme 13 5G స్మార్ట్‌ఫోన్ లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్సెట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్ గా ఉంది. Realme 13 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీతో టీఈఎన్ఏఏ పై లిస్ట్ అయ్యింది.

ఇంకా ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

Realme 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13 Pro లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ (2412*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, 10 బిట్ కలర్ డెప్త్ ఉన్నాయి.

చిప్సెట్: Realme 13 Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+256జిబి, 12జిబి+512జిబి ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme 13 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. అల్ట్రా క్లియర్ ఏఐ, ఏఐ హైపర్ రా అల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ అల్గారిథమ్ ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Realme 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 13 Pro లో ఐపీ65 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, రెయిన్‌వాటర్ స్మార్ట్‌టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme 13 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 5జీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-5g-specs-revealed-via-tenaa-listing/feed/ 0