
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన 13-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Realme 13 5G సిరీస్ లో భాగంగా Realme 13 5G మరియు Realme 13 5G Plus ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 18జిబి వరకు ర్యామ్ పవర్‌ను అందించడం విశేషం. ఓసారి ఈ ఫోన్ యొక్క సేల్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Realme 13 5G ధర, సేల్ వివరాలు
Realme 13 5G స్మార్ట్‌పోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ కూడా ఉంది.
Realme 13 5G స్మార్ట్‌ఫోన్‌ని సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్మీ వెబ్‌సైట్ పై మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కూడా కొనవచ్చు.
Realme 13 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme 13 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 580నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐ-కంఫర్ట్, డార్క్ మోడ్ ఫీచర్స్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
ర్యామ్, స్టోరేజీ: Realme 13 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 10జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. డైనమిక్ ర్యామ్ వల్లన, యూజర్‌కి గరిష్టంగా 18జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్: Realme 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Realme 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి శాంసంగ్ S5KJNS ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోటో కెమెరా లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme 13 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Realme 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme 13 5G లో ఐపీ64 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, స్టీరియో స్పీకర్స్, ఆంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ సిస్టమ్, 6 యాక్సెస్ హైపర్ సెన్సిటివ్ జైరోస్కోప్, స్మార్ట్ ఇమేజ్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ స్మార్ట్ లుక్, ఏఐ గేమింగ్ నెట్వర్క్ ఉన్నాయి.











