Realme 13 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 05 Sep 2024 17:08:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-which-phone-has-better-camera/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-which-phone-has-better-camera/#respond Thu, 05 Sep 2024 17:08:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13365 స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి […]

The post Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఈ ఆర్టికల్ లో Nothing Phone 2a Plus మరియు Realme 13 Pro స్మార్ట్‌ఫోన్లను పోల్చి, ఎందులో ఉత్తమమైన కెమెరా ఉందో తెలుసుకుందాం.

డే లైట్

రియల్మీ 13 ప్రో ఫోన్ డేలైట్ కండిషన్స్ లో బ్రైట్ మరియు పంచీ కలర్స్ ను ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. ఓవరాల్ గా రెండు ఫోన్లలో తీసిన ఫోటోల్లో ఒకే విధమైన డైనమిక్ రేంజ్, బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ ఉన్నాయి.

అయితే రియల్మీ 13 ప్రో మాత్రం నాయిస్ ను తగ్గించేందుకు కొన్ని డీటెయిల్స్ ను సాఫ్ట్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో దీనికి విరుద్ధంగా, ఎక్కువ షార్ప్‌నెస్ గల డీటెయిల్స్ ఉన్నాయి. పొదలు కూడా ఎంతో నేచురల్ గా కనిపించాయి.

2ఎక్స్ మోడ్ లో తీసిన ఫోటోలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. కలర్ ట్రీట్మెంట్ విషయంలో రియల్మీ 13 ప్రో తడబడినట్లు మా టెస్టులో స్పష్టమైంది.

విజేత: Nothing Phone 2a Plus

అల్ట్రావైడ్

50ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్ తో.. మెగాపిక్సెల్స్ విషయంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, రియల్మీ 13 ప్రో కంటే ముందుంది. రియల్మీలో 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంది.

ఈ రెండు ఫోన్లలో తీసిన ఫోటోలను పోల్చి చూస్తే, ప్రైమరీ కెమెరా మాదిరి కలర్ సైన్స్‌ను, ఏ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా కలిగి లేదు. రియల్మీ 13 ప్రో ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉన్నప్పటికీ, డీటెయిల్స్ స్పష్టంగా లేవు.

మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచి డైనమిక్ రేంజ్ అందించింది. బ్యాగ్రౌండ్ లో కనిపించే డీటెయిల్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, రియల్ లైఫ్ కలర్స్‌ను క్యాప్చర్ చేసే విషయంలో రియల్మీ 13 ప్రో కంటే బెటర్ గా ఉంది.

విజేత: Nothing Phone 2a Plus

పొట్రెయిట్

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మరియు రియల్మీ 13 ప్రో ఫోన్లు రెండూ కూడా పొట్రెయిట్ షాట్స్ కోసం తమ మెయిన్ కెమెరా పైనే ఆధారపడ్డాయి. రెగ్యులర్ ఫోటో మోడ్ లో నేచురల్ గా కనిపించే కొద్దిపాటి డెప్త్ ఏరియా సాధ్యమవుతుంది. కానీ, పొట్రెయిట్ మోడ్.. సోషల్ మీడియా-రెడీ ఔట్‌పుట్ అందిస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ద్వారా తీసిన పొట్రెయిట్ పిక్స్ లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది. మరోవైపు, రియల్మీ 13 ప్రో తో తీసిన ఫోటోల్లో స్కిన్ టోన్ సరిగ్గా ఉంది.

ఎడ్జ్ డిటెక్షన్, బ్లర్ బ్యాగ్రౌండ్ విషయాల్లో రియల్మీ 13 ప్రో మెరుగ్గా ఉంది. అయితే రెండు ఫోన్లు కూడా ముఖంలోని డీటెయిల్స్ ను సాఫ్ట్ చేశాయి.

విజేత: Realme 13 Pro

సెల్ఫీ (పొట్రెయిట్ మోడ్)

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ తన బ్రైట్నెస్ లెవెల్స్ ను ముఖం పైన బాగానే బ్యాలన్స్ చేసింది. అంతేకాదు, ఫేస్ పైన డీటెయిల్స్ ను కూడా చక్కగా క్యాప్చర్ చేసింది.

ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో రియల్మీ 13 ప్రో తడబడినట్లు సెల్ఫీస్ ను గమనిస్తే అర్థమైంది. సెల్ఫీస్ లో హై కాంట్రాస్ట్ ఉండటంతో, డీటెయిల్స్ కనిపించలేదు.

విజేత: Nothing Phone 2a Plus

లో-లైట్

రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లో-లైట్ పరిస్థితుల్లో బ్రైట్నెస్ విషయంలో ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. అయితే లో-లైట్ పెర్ఫామెన్స్ కచ్చితంగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

యాంబియెంట్ లైట్స్ ‌ను బ్యాలన్స్ చేయడంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మరియు రియల్మీ 13 ప్రో తడబడ్డాయి. ఓవరాల్ గా ఫోటోల యొక్క షార్ప్‌నెస్, స్టెబిలిటీ యావరేజీగా ఉన్నాయి.

బ్రైట్ ఔట్‌పుట్, డీటెయిల్స్ విషయంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచిగా పెర్ఫామ్ చేసింది. ఎక్స్‌పోజర్ బ్యాలన్సింగ్ విషయంలో రియల్మీ 13 ప్రో ఇబ్బంది పడింది.

విజేత: Nothing Phone 2a Plus

లో-లైట్ (నైట్ మోడ్)

నైట్ మోడ్ సాయంతో, కాస్త మెరుగైన ఫోటోలు వచ్చాయి. కానీ పెద్దగా మార్పు లేదు. హై కాంట్రాస్ట్ ఉన్నప్పటికీ, రియల్మీ 13 ప్రో ఇమేజెస్ చూసేందుకు బాగున్నాయి. కాకపోతే, బిల్డింగ్స్ పై ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ డీటెయిల్స్ స్పష్టంగా లేవు.

మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో ఈ సమస్యలు ఏమీ లేవు. అయితే, రెండు ఫోన్లు కూడా యాంబియెంట్ లైట్‌ను మ్యానేజ్ చేయడంలో ఇబ్బంది పడ్డాయి. రూ.30,000 లోపు ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ సమస్య తరచూ కనిపించేదే.

విజేత: Nothing Phone 2a Plus

ఏది బెటర్?

మేం జరిపిన కెమెరా టెస్టును బట్టి, Realme 13 Pro కంటే Nothing Phone 2a Plus ముందుంది. కొన్ని విషయాల్లో రెండూ కూడా సమానంగా ఉన్నాయి.

అయితే, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 50ఎంపి కెమెరా సిస్టమ్ ఎక్కువ డీటెయిల్స్ ను క్యాప్చర్ చేస్తుంది. మీరు గనుక మీ సోషల్ మీడియా ప్రాజెక్ట్స్ కోసం ఇమేజెస్ ను క్రాప్ చేస్తే, ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేచురల్ కలర్స్ కి దగ్గరగా ఉన్న ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తున్న Nothing Phone 2a Plus సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

The post Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-which-phone-has-better-camera/feed/ 0
Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/#respond Thu, 22 Aug 2024 18:14:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=13122 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. ఈ […]

The post Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

ఈ ఆర్టికల్ లో Nothing Phone (2a) Plus మరియు Realme 13 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకోండి.

Nothing Phone (2a) Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. Realme 13 Pro లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పెద్ద బ్యాటరీ ఉన్న రియల్మీ 13 ప్రో, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కంటే బెటర్ రిజల్ట్స్ అందిస్తుందా? ఆ విషయం తెలుసుకుందాం పదండి.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా రెండు ఫోన్లలోని బ్యాటరీలు ఎలా పని చేస్తున్నాయో తెలిసింది. ఈ టెస్టును ఫ్లయిట్ మోడ్ ఆన్ చేసి చేయడం జరిగింది. అలాగే రెండు ఫోన్లను పూర్తిగా చార్జ్ చేసి, ఒకే విధమైన ఆడియో/బ్యాటరీ లెవెల్స్ సెట్ చేసి టెస్ట్ జరిపాం. ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Nothing Phone 2A Plus పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో 14 గంటల 34 నిమిషాలు స్కోర్ చేసింది. మరోవైపు Realme 13 Pro 10 గంటల 48 నిమిషాలు స్కోర్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో చిన్న బ్యాటరీ ఉన్నప్పటికీ, పెద్ద బ్యాటరీ ఉన్న రియల్మీ 13 ప్రో కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

విజేత: Nothing Phone (2a) Plus

యూట్యూబ్ వీడియో

రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూడగా, Nothing Phone (2a) Plus లో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు, Realme 13 Pro లో కూడా 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

అయితే రెండు ఫోన్లు 4 శాతం బ్యాటరీని తీసుకున్నాయి కానీ, కచ్చితమైన ఫలితాలు చూస్తే, Nothing Phone (2a) Plus 200mAh బ్యాటరీ, Realme 13 Pro 208mAh బ్యాటరీ వినియోగించాయి.

విజేత: Nothing Phone (2a) Plus

గేమింగ్ టెస్ట్

మేం గేమింగ్ టెస్ట్ కోసం మూడు ప్రధాన గేమ్స్ ఎంచుకున్నాం. అవి: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ), కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ), మరియు రియల్ రేసింగ్ 3. రెండు ఫోన్లలో ఈ గేమ్స్ ప్రతీ ఒక్కదాన్ని 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. యావరేజీ బ్యాటరీ డ్రాప్ రిజల్ట్స్ చూద్దాం.

Nothing Phone (2a) Plus లో యావరేజీ బ్యాటరీ డ్రాప్ 6.3 శాతంగా నమోదైంది. మరోవైపు, Realme 13 Pro లో 7 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.

కచ్చితమైన ఫలితాలను గమనిస్తే, Nothing Phone (2a) Plus 315mAh బ్యాటరీ పవర్ ను వాడుకోగా, Realme 13 Pro 364mAh బ్యాటరీ పవర్‌ను వినియోగించుకుంది.

విజేత: Nothing Phone (2a) Plus

చార్జింగ్

Realme 13 Pro లో పెద్ద బ్యాటరీ ఉంది. Nothing Phone (2a) Plus 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అయితే ఈ నథింగ్ ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్ రాదు. దీంతో మేం, మోటోరోలా పీడీ చార్జర్ వాడాం.

Nothing Phone (2a) Plus డివైజ్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాలు సమయం పట్టింది. Realme 13 Pro ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాలు సమయం పట్టింది.

విజేత: Nothing Phone (2a) Plus

ఏది బెటర్?

ఓవరాల్ గా చూస్తే, Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ చిన్న బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ, Realme 13 Pro కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

అయితే, Nothing Phone (2a) Plus ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్‌ను కంపెనీ అందించడం లేదు. కేవలం టైప్-సీ టు టైప్-సీ కేబుల్ మాత్రమే అందిస్తోంది. కానీ, Realme 13 Pro తో పాటు బాక్స్ లో చార్జర్ వస్తుంది.

మేం అందించిన బ్యాటరీ టెస్టు ఫలితాలు, మీకు నచ్చిన ఫోన్ ఎంచుకునేందుకు సాయపడతాయని ఆశిస్తున్నాం.

The post Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/feed/ 0
Realme 13 Pro+ 5G: Sony LYT సెన్సర్స్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ 13 ప్రో+ 5జీ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-launched-india-sony-lyt-sensors/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-launched-india-sony-lyt-sensors/#respond Tue, 30 Jul 2024 13:37:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12739 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన కొత్త నంబర్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 13 Pro మరియు Realme 13 Pro+ 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 Pro+ 5G గురించి తెలుసుకుందాం. Realme 13 Pro కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక Realme 13 Pro+ 5G విషయానికి […]

The post Realme 13 Pro+ 5G: Sony LYT సెన్సర్స్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ 13 ప్రో+ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Realme 13 Pro+ 5G లాంచ్
  • 12జిబి ర్యామ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ
  • డివైజ్ ప్రారంభ ధర రూ.32,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన కొత్త నంబర్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 13 Pro మరియు Realme 13 Pro+ 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 Pro+ 5G గురించి తెలుసుకుందాం. Realme 13 Pro కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక Realme 13 Pro+ 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ సోని ఎల్‌వైటీ కెమెరా, రూ.32,999 ప్రారంభ ధర, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 Pro+ 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Realme 13 Pro+ 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.34,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.36,999 గా ఉంది. మానెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఆగస్టు 6వ తేదీ నుంచి Realme 13 Pro+ 5G డివైజ్ సేల్‌కి వస్తోంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, రూ.3,000 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Realme 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 13 Pro+ 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: Realme 13 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

మెమొరీ: Realme 13 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Realme 13 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-701 మెయిన్ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ ఓఐఎస్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 73ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఇన్-సెన్సర్ జూమ్ టెక్నాలజీ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ: Realme 13 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Realme 13 Pro+ 5G: Sony LYT సెన్సర్స్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ 13 ప్రో+ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-launched-india-sony-lyt-sensors/feed/ 0
Realme 13 Pro: 45W ఫాస్ట్ చార్జింగ్, ఓఎల్ఈడీ స్క్రీన్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ 13 ప్రో https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-launched-india-45w-fast-charging-oled-screen/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-launched-india-45w-fast-charging-oled-screen/#respond Tue, 30 Jul 2024 10:54:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=12735 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన కొత్త నంబర్ సిరీస్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ లైనప్ లో Realme 13 Pro మరియు Realme 13 Pro+ అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 Pro గురించి తెలుసుకుందాం. Realme 13 Pro Plus 5G కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక రియల్మీ 13 ప్రో విషయానికి వస్తే, ఈ […]

The post Realme 13 Pro: 45W ఫాస్ట్ చార్జింగ్, ఓఎల్ఈడీ స్క్రీన్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ 13 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో Realme 13 Pro సిరీస్ లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 12జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన కొత్త నంబర్ సిరీస్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ లైనప్ లో Realme 13 Pro మరియు Realme 13 Pro+ అనే రెండు మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 13 Pro గురించి తెలుసుకుందాం. Realme 13 Pro Plus 5G కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక రియల్మీ 13 ప్రో విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి డివైజ్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 13 Pro ధర, లభ్యత

Realme 13 Pro స్మార్ట్‌ఫోన్ భారత్ లో 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Realme 13 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.26,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.28,999 గా పెట్టారు. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.31,999 గా ఉంది.

Realme 13 Pro డివైజ్ మానెట్ పర్పుల్, మానెట్ గోల్డ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్‌కి వస్తోంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మూడు మోడల్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ ఫోన్లు వరుసగా రూ.23,999, రూ.25,999, రూ.28,999 ధరకి లభిస్తాయి.

Realme 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13 Pro లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ (2412*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, 10 బిట్ కలర్ డెప్త్ ఉన్నాయి.

చిప్సెట్: Realme 13 Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+256జిబి, 12జిబి+512జిబి ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme 13 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. అల్ట్రా క్లియర్ ఏఐ, ఏఐ హైపర్ రా అల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ అల్గారిథమ్ ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Realme 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 13 Pro లో ఐపీ65 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, రెయిన్‌వాటర్ స్మార్ట్‌టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme 13 Pro: 45W ఫాస్ట్ చార్జింగ్, ఓఎల్ఈడీ స్క్రీన్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ 13 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-launched-india-45w-fast-charging-oled-screen/feed/ 0
Realme 13 Pro 5G: బీఐఎస్ పై లిస్టైన రియల్మీ 13 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-listed-on-bis-website/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-listed-on-bis-website/#respond Wed, 24 Jul 2024 06:22:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12649 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లోని స్టాండర్డ్ మోడల్ Realme 13 Pro 5G తాజాగా భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. జులై 31వ తేదీన ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. సరే, ఓసారి రియల్మీ 13 ప్రో 5జీ యొక్క బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 13 Pro […]

The post Realme 13 Pro 5G: బీఐఎస్ పై లిస్టైన రియల్మీ 13 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro 5G
  • ఇండియా లాంచ్ తేదీ జులై 31
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లోని స్టాండర్డ్ మోడల్ Realme 13 Pro 5G తాజాగా భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. జులై 31వ తేదీన ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. సరే, ఓసారి రియల్మీ 13 ప్రో 5జీ యొక్క బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 Pro 5G సిరీస్ బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 Pro 5G సిరీస్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఈ రియల్మీ ఫోన్ RMX3990, RMX3921 అనే మోడల్ నంబర్లతో భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Realme 13 Pro 5G, Realme 13 Pro+ 5G అనే ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Realme 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి మరియు 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.

Realme 13 Pro 5G TENAA సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3989 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది. రెండర్ ద్వారా సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్‌ఈడీ ఫ్లాష్ కనిపించాయి.

పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. రెండర్స్‌ని గమనిస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Realme 13 Pro 5G డివైజ్ 161.3 మి.మీ పొడవు, 73.9 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Realme 13 Pro 5G: బీఐఎస్ పై లిస్టైన రియల్మీ 13 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-listed-on-bis-website/feed/ 0
Realme 13 Pro 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-13-pro-specs-revealed-via-tenaa-listing/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-specs-revealed-via-tenaa-listing/#respond Fri, 19 Jul 2024 08:34:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12576 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాగంగా Realme 13 Pro 5G మరియు Realme 13 Pro Plus 5G ఫోన్లు విడుదలవ్వనున్నాయి. తాజాగా Realme 13 Pro 5G డివైజ్ చైనాలో లాంచ్‌కి ముందు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Realme […]

The post Realme 13 Pro 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro 5G లాంచ్
  • జులై 30న లాంచ్ అయ్యే అకాశం
  • 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాగంగా Realme 13 Pro 5G మరియు Realme 13 Pro Plus 5G ఫోన్లు విడుదలవ్వనున్నాయి. తాజాగా Realme 13 Pro 5G డివైజ్ చైనాలో లాంచ్‌కి ముందు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Realme 13 Pro 5G టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3989 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది. రెండర్ ద్వారా సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్‌ఈడీ ఫ్లాష్ కనిపించాయి.

పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. రెండర్స్‌ని గమనిస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Realme 13 Pro 5G డివైజ్ 161.3 మి.మీ పొడవు, 73.9 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి మరియు 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.

రానున్న రోజుల్లో Realme 13 Pro 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ను రియల్మీ కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది.

The post Realme 13 Pro 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-specs-revealed-via-tenaa-listing/feed/ 0
Realme 13 Pro, 13 Pro Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-13-pro-13-pro-plus-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-13-pro-plus-india-launch-date-confirmed/#respond Mon, 15 Jul 2024 06:28:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=12510 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి కొత్త నంబర్ సిరీస్ లాంచ్ కాబోతోంది. Realme 13 Pro మరియు Realme 13 Pro+ ఈ సిరీస్ లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఇండియా లాంచ్ తేదీని రియల్మీ ఖరారు చేసింది. జులై 30వ తేదీన ఈ రియల్మీ 13 ప్రో సిరీస్ విడుదలవుతోంది. హైపర్‌ఇమేజ్+ తో కూడిన ఏఐ ఫోటోగ్రఫీని ఈ సిరీస్ లో అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme […]

The post Realme 13 Pro, 13 Pro Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 13 Pro సిరీస్ లాంచ్ తేదీ వెల్లడి
  • జులై 30వ తేదీన భారత్ లో లాంచ్
  • హైపర్‌ఇమేజ్+ టెక్నాలజీ హైలైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి కొత్త నంబర్ సిరీస్ లాంచ్ కాబోతోంది. Realme 13 Pro మరియు Realme 13 Pro+ ఈ సిరీస్ లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఇండియా లాంచ్ తేదీని రియల్మీ ఖరారు చేసింది. జులై 30వ తేదీన ఈ రియల్మీ 13 ప్రో సిరీస్ విడుదలవుతోంది. హైపర్‌ఇమేజ్+ తో కూడిన ఏఐ ఫోటోగ్రఫీని ఈ సిరీస్ లో అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 13 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

Realme 13 Pro సిరీస్ భారత్ లో జులై 30న లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ లైనప్ లో రియల్మీ 13 ప్రో 5జీ మరియు రియల్మీ 13 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. లాంచ్‌ ఈవెంట్‌ను రియల్మీ వెబ్‌సైట్ మరియు రియల్మీ సోషల్ మీడియా చానల్స్ ద్వారా చూడవచ్చు.

Realme 13 Pro మరియు Realme 13 Pro+ డివైజెస్ మానెట్ గోల్డ్, మానెట్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లాంచ్ అవుతాయి. వీటిలో మానెట్ కలర్స్ రెండూ గ్లాస్ ప్యానెల్ తో వస్తున్నాయి. మరోవైపు, ఎమరాల్డ్ గ్రీన్ వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో వస్తోంది.

Realme 13 Pro+ కెమెరా వివరాలు

రియల్మీ సంస్థ ఇప్పటికే Realme 13 Pro+ కెమెరా వివరాలను వెల్లడించింది. వాటి ప్రకారం, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ-701 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. రియల్మీ 13 ప్రో మరియు రియల్మీ 13 ప్రో ప్లస్ ఫోన్లలో హైపర్‌ఇమేజ్+ తో కూడిన ఏఐ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ ఉంటుంది.

The post Realme 13 Pro, 13 Pro Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-13-pro-plus-india-launch-date-confirmed/feed/ 0
Realme 13 Pro 5G: రియల్మీ 13 ప్రో 5జీ సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-series-india-launch-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-series-india-launch-confirmed/#respond Tue, 02 Jul 2024 14:36:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=12333 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 Pro 5G సిరీస్‌ను భారత్‌లో లాంచ్ లాంచ్ చేయనుంది. 2024 జనవరిలో లాంచైన రియల్మీ 12 ప్రో 5జీ సిరీస్ కు ఇది సక్సెసర్ గా వస్తోంది. Realme 13 Pro 5G ప్రొఫెషనల్ ఏఐ కెమెరా కలిగిన మొదటి రియల్మీ ఫోన్‌గా నిలవనుంది. మరి ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం. Realme 13 Pro 5G సిరీస్ టీజర్ విశేషాలు Realme 13 Pro […]

The post Realme 13 Pro 5G: రియల్మీ 13 ప్రో 5జీ సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro 5G సిరీస్ లాంచ్
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ
  • ప్రొఫెషనల్ ఏఐ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 Pro 5G సిరీస్‌ను భారత్‌లో లాంచ్ లాంచ్ చేయనుంది. 2024 జనవరిలో లాంచైన రియల్మీ 12 ప్రో 5జీ సిరీస్ కు ఇది సక్సెసర్ గా వస్తోంది. Realme 13 Pro 5G ప్రొఫెషనల్ ఏఐ కెమెరా కలిగిన మొదటి రియల్మీ ఫోన్‌గా నిలవనుంది. మరి ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం.

Realme 13 Pro 5G సిరీస్ టీజర్ విశేషాలు

Realme 13 Pro 5G డివైజ్ యొక్క టీజర్‌ను రియల్మీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. టీజర్‌ను గమనిస్తే, ప్రధానంగా కెమెరా మాడ్యూల్‌ను హైలైట్స్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. దీన్ని బట్టి, రాబోవు Realme 13 Pro 5G ఇండస్ట్రీ-ఫస్ట్ ఏఐ ఫీచర్లను తీసుకురానుందని తెలుస్తోంది.

Realme 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

Realme 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ జూమ్ కెమెరా, 32ఎంపి సెల్పీ కెమెరాతో వస్తోంది.

Realme 13 Pro+ 5G డివైజ్ ఇటీవలె ఎఫ్‌సీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. దీని ద్వారా 5050 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఈ ఫోన్ 190 గ్రాముల బరువు, 8.23 మి.మీ మందం ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్, రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

మరోవైపు Realme 13 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుందని ఇటీవలె 91mobiles రివీల్ చేసింది. అలాగే ఈ ఫోన్ మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ మరియు స్కై గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. రానున్న రోజుల్లో Realme 13 Pro సిరీస్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post Realme 13 Pro 5G: రియల్మీ 13 ప్రో 5జీ సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-series-india-launch-confirmed/feed/ 0