Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్?

    స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

    ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఈ ఆర్టికల్ లో Nothing Phone 2a Plus మరియు Realme 13 Pro స్మార్ట్‌ఫోన్లను పోల్చి, ఎందులో ఉత్తమమైన కెమెరా ఉందో తెలుసుకుందాం.

    డే లైట్

    రియల్మీ 13 ప్రో ఫోన్ డేలైట్ కండిషన్స్ లో బ్రైట్ మరియు పంచీ కలర్స్ ను ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. ఓవరాల్ గా రెండు ఫోన్లలో తీసిన ఫోటోల్లో ఒకే విధమైన డైనమిక్ రేంజ్, బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ ఉన్నాయి.

    అయితే రియల్మీ 13 ప్రో మాత్రం నాయిస్ ను తగ్గించేందుకు కొన్ని డీటెయిల్స్ ను సాఫ్ట్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో దీనికి విరుద్ధంగా, ఎక్కువ షార్ప్‌నెస్ గల డీటెయిల్స్ ఉన్నాయి. పొదలు కూడా ఎంతో నేచురల్ గా కనిపించాయి.

    2ఎక్స్ మోడ్ లో తీసిన ఫోటోలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. కలర్ ట్రీట్మెంట్ విషయంలో రియల్మీ 13 ప్రో తడబడినట్లు మా టెస్టులో స్పష్టమైంది.

    విజేత: Nothing Phone 2a Plus

    అల్ట్రావైడ్

    50ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్ తో.. మెగాపిక్సెల్స్ విషయంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, రియల్మీ 13 ప్రో కంటే ముందుంది. రియల్మీలో 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంది.

    ఈ రెండు ఫోన్లలో తీసిన ఫోటోలను పోల్చి చూస్తే, ప్రైమరీ కెమెరా మాదిరి కలర్ సైన్స్‌ను, ఏ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా కలిగి లేదు. రియల్మీ 13 ప్రో ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉన్నప్పటికీ, డీటెయిల్స్ స్పష్టంగా లేవు.

    మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచి డైనమిక్ రేంజ్ అందించింది. బ్యాగ్రౌండ్ లో కనిపించే డీటెయిల్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, రియల్ లైఫ్ కలర్స్‌ను క్యాప్చర్ చేసే విషయంలో రియల్మీ 13 ప్రో కంటే బెటర్ గా ఉంది.

    విజేత: Nothing Phone 2a Plus

    పొట్రెయిట్

    నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మరియు రియల్మీ 13 ప్రో ఫోన్లు రెండూ కూడా పొట్రెయిట్ షాట్స్ కోసం తమ మెయిన్ కెమెరా పైనే ఆధారపడ్డాయి. రెగ్యులర్ ఫోటో మోడ్ లో నేచురల్ గా కనిపించే కొద్దిపాటి డెప్త్ ఏరియా సాధ్యమవుతుంది. కానీ, పొట్రెయిట్ మోడ్.. సోషల్ మీడియా-రెడీ ఔట్‌పుట్ అందిస్తుంది.

    నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ద్వారా తీసిన పొట్రెయిట్ పిక్స్ లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది. మరోవైపు, రియల్మీ 13 ప్రో తో తీసిన ఫోటోల్లో స్కిన్ టోన్ సరిగ్గా ఉంది.

    ఎడ్జ్ డిటెక్షన్, బ్లర్ బ్యాగ్రౌండ్ విషయాల్లో రియల్మీ 13 ప్రో మెరుగ్గా ఉంది. అయితే రెండు ఫోన్లు కూడా ముఖంలోని డీటెయిల్స్ ను సాఫ్ట్ చేశాయి.

    విజేత: Realme 13 Pro

    సెల్ఫీ (పొట్రెయిట్ మోడ్)

    నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ తన బ్రైట్నెస్ లెవెల్స్ ను ముఖం పైన బాగానే బ్యాలన్స్ చేసింది. అంతేకాదు, ఫేస్ పైన డీటెయిల్స్ ను కూడా చక్కగా క్యాప్చర్ చేసింది.

    ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో రియల్మీ 13 ప్రో తడబడినట్లు సెల్ఫీస్ ను గమనిస్తే అర్థమైంది. సెల్ఫీస్ లో హై కాంట్రాస్ట్ ఉండటంతో, డీటెయిల్స్ కనిపించలేదు.

    విజేత: Nothing Phone 2a Plus

    లో-లైట్

    రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లో-లైట్ పరిస్థితుల్లో బ్రైట్నెస్ విషయంలో ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. అయితే లో-లైట్ పెర్ఫామెన్స్ కచ్చితంగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

    యాంబియెంట్ లైట్స్ ‌ను బ్యాలన్స్ చేయడంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మరియు రియల్మీ 13 ప్రో తడబడ్డాయి. ఓవరాల్ గా ఫోటోల యొక్క షార్ప్‌నెస్, స్టెబిలిటీ యావరేజీగా ఉన్నాయి.

    బ్రైట్ ఔట్‌పుట్, డీటెయిల్స్ విషయంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచిగా పెర్ఫామ్ చేసింది. ఎక్స్‌పోజర్ బ్యాలన్సింగ్ విషయంలో రియల్మీ 13 ప్రో ఇబ్బంది పడింది.

    విజేత: Nothing Phone 2a Plus

    లో-లైట్ (నైట్ మోడ్)

    నైట్ మోడ్ సాయంతో, కాస్త మెరుగైన ఫోటోలు వచ్చాయి. కానీ పెద్దగా మార్పు లేదు. హై కాంట్రాస్ట్ ఉన్నప్పటికీ, రియల్మీ 13 ప్రో ఇమేజెస్ చూసేందుకు బాగున్నాయి. కాకపోతే, బిల్డింగ్స్ పై ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ డీటెయిల్స్ స్పష్టంగా లేవు.

    మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో ఈ సమస్యలు ఏమీ లేవు. అయితే, రెండు ఫోన్లు కూడా యాంబియెంట్ లైట్‌ను మ్యానేజ్ చేయడంలో ఇబ్బంది పడ్డాయి. రూ.30,000 లోపు ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ సమస్య తరచూ కనిపించేదే.

    విజేత: Nothing Phone 2a Plus

    ఏది బెటర్?

    మేం జరిపిన కెమెరా టెస్టును బట్టి, Realme 13 Pro కంటే Nothing Phone 2a Plus ముందుంది. కొన్ని విషయాల్లో రెండూ కూడా సమానంగా ఉన్నాయి.

    అయితే, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 50ఎంపి కెమెరా సిస్టమ్ ఎక్కువ డీటెయిల్స్ ను క్యాప్చర్ చేస్తుంది. మీరు గనుక మీ సోషల్ మీడియా ప్రాజెక్ట్స్ కోసం ఇమేజెస్ ను క్రాప్ చేస్తే, ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేచురల్ కలర్స్ కి దగ్గరగా ఉన్న ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తున్న Nothing Phone 2a Plus సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది.