Realme C33 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 06 Sep 2022 12:51:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Realme C33: ధర, విక్రయ తేదీ, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-c33-india-launch-price-specs-availability/ Tue, 06 Sep 2022 12:51:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=2141 హైలైట్స్: రూ.8999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం భారత్ లో రియల్మీ సీ33 లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ నేడు భారత్ లో లాంచ్ […]

The post భారత్ లో లాంచ్ అయిన Realme C33: ధర, విక్రయ తేదీ, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.8999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్
  • 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం

భారత్ లో రియల్మీ సీ33 లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఫ్లిప్ కార్ట్ ద్వారా సీ33 ఫోన్ సేల్ కి వస్తోంది. రీయల్మీ సీ31 కి సక్సెసర్ గా ఈ ఫోన్ వచ్చింది. డిజైన్ పరంగా మార్పులను మనం గమనించవచ్చు. రియల్మీ సీ33 మెరిసే బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. అందుకు కారణమైన పీసీ, పీఎంఎంఏ 2డీ మెటీరియల్స్ కి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. దీని వల్లన ఫోన్ కి ప్రీమియమ్ లుక్ వచ్చింది. రెగ్యులర్ పాలికార్బొనెట్ బాడీ కంటే ఇది ఎంతో మెరుగైందని సమాచారం. ఇక ఫోన్ ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ లో కెమెరాను అమర్చారు. ఇక డ్యూయల్ కెమెరాల విషయానికి వస్తే, రెండు వేర్వేరు రింగ్స్ లో ఇవి ఉన్నాయి. ఇకపోతే ఫోన్ భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించబడింది.

ఇక రియల్మీ సీ33 యొక్క ముఖ్యమైన ఫీచర్లను చూస్తే, ఇందులో 6.5 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లో భారీ సెన్సర్ ని కలిగిన ఫోన్ రియల్మీ సీ33 కావడం విశేషం. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిసాక్ టీ612 చిప్సెట్ ను అమర్చారు.

భారత్ లో Realme C33 ధర, విక్రయ తేదీ

రియల్మీ సీ33 3జిబి + 32జిబి వేరియంట్ ధర రూ.8999 గా నిర్ణయించారు. ఇక 4జిబి + 64జిబి వర్షన్ ధర రూ.9999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ ఆక్వా బ్లూ, సాండీ గోల్డ్, నైట్ సీ కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్మీ అధికార వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.

Realme C33 స్పెసిఫికేషన్స్

రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ టీ612 చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ, 3జిబి + 32జిబి, 4జిబి + 64జిబి మోడల్స్, ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రియల్మీ యూఐ ఎస్ ఎడిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్మీ సీ33 లో డ్యూయల్ రియర్ కెమెరాలున్నాయి. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా కాగా, రెండోది 0.3ఎంపి సెకండరీ సెన్సర్. ఇంకా ఎల్ఈడీ ఫ్లాష్ ఇందులో ఉంది. రియర్ కెమెరాలు సీహెచ్డీఆర్ ఆల్గొరిథమ్, హెచ్డీఆర్ మోడ్, పనోరమిక్ వ్యూ, పొట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరాను అమర్చారు.

ఈ హ్యాండ్సెట్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డిరాక్ 3.0 టెక్నాలజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి. ఇక రియల్మీ సీ33 కనెక్టివిటీ ఫీచర్లను చూస్తే, ఇది 4జి కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇందులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

The post భారత్ లో లాంచ్ అయిన Realme C33: ధర, విక్రయ తేదీ, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme C33; డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-c33-launch-date-price-specs/ Mon, 05 Sep 2022 08:16:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2089 హైలైట్స్: సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న రియల్ మీ సీ33 స్మార్ట్ ఫోన్ సన్నగా, తక్కువ బరువులో బౌండ్లెస్ సీ డిజైన్ తో వస్తున్న హ్యాండ్సెట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సెప్టెంబర్ 6 న రియల్ మీ, రెడ్మీ కంపెనీల యొక్క లాంచ్ ఈవెంట్స్ జరగనున్నాయి. రెడ్మీ నుంచి రెడ్మీ 11 ప్రైమ్ సిరీస్ మరియు రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్స్ లాంచ్అ […]

The post సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme C33; డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న రియల్ మీ సీ33 స్మార్ట్ ఫోన్
  • సన్నగా, తక్కువ బరువులో బౌండ్లెస్ సీ డిజైన్ తో వస్తున్న హ్యాండ్సెట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

సెప్టెంబర్ 6 న రియల్ మీ, రెడ్మీ కంపెనీల యొక్క లాంచ్ ఈవెంట్స్ జరగనున్నాయి. రెడ్మీ నుంచి రెడ్మీ 11 ప్రైమ్ సిరీస్ మరియు రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్స్ లాంచ్అ వుతుండగా, రియల్ మీ నుంచి రియల్ మీ వాచ్ 3 ప్రో, రియల్ మీ సీ33 లాంచ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6 న మధ్యాహ్యం 12 గంటలకు సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని ఇటీవలె రియల్ మీ కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్ మీ అధికార వెబ్ సైట్ లో సీ33 కి సంబంధించిన ల్యాండింగ్ పేజీని మనం గమనించవచ్చు. రియల్మీ సీ33 యొక్క ముఖ్యమైన ఫీచర్లను, డిజైన్ ఆ పేజీ ద్వారా తెలుస్తున్నాయి.

Realme C33 డిజైన్

రియల్మీ వెబ్ సైట్ ప్రకారం, రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్ బౌండ్లెస్ సీ డిజైన్, మెరిసే బ్యాక్ ప్యాననెల్, డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తోంది. చూస్తుంటే, ఫోన్ అచ్చంగా రియల్మీ 9ఐ 5జీ మాదిరి కనిపిస్తోంది. హ్యాండ్సెట్ బరువు 187 గ్రాములు, మందం 8.3 మిల్లీమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. ఇక ఫోన్ భద్రత కొరకు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అమర్చారు. సీ33 లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉండటం విశేషం. అలాగే ఒక స్పీకర్ గ్రిల్ ఉంది. ఇంకా బాటమ్ లో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంది. రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్ సాండీ గోల్డ్, ఆక్వా బ్లూ, నైట్ సీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme C33 స్పెసిఫికేషన్స్

రియల్మీ సీ33 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, వెనకాల రెండు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా. సెగ్మెంట్ బెస్ట్ పిక్సెల్ పెర్ఫామెన్స్, మల్టీ ఫోటోగ్రఫీ మోడ్స్, సీహెచ్డీఆర్ ఆల్గొరిథమ్ (బ్లాక్ లిట్ ఫోటోల కోసం) వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉందని రియల్మీ సంస్థ చెబుతోంది. ఇక ఈ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉండి, 37 గంటల స్టాండ్ బై అందిస్తుంది. రియల్మీ సీ33 లో అల్ట్రా-సేవింగ్ మోడ్ ఉండటం చేత, శక్తి వినియోగం మరింత మెరుగుపడుతుందని కంపెనీ చెబుతోంది.

రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతుందని ప్రముఖ టిప్ స్టర్ సుదాన్శు అంభోరే తెలిపాడు. ఇక హ్యాండ్సెట్ ధర రూ.9,500 నుంచి రూ.10,500 మధ్య ఉంటుందని సమాచారం. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా, కెమెరా మోడ్స్ కావాలని అనుకునే వారు రియల్మీ సీ33 ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme C33; డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>