హైలైట్స్:
- రూ.8999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్
- 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం
భారత్ లో రియల్మీ సీ33 లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఫ్లిప్ కార్ట్ ద్వారా సీ33 ఫోన్ సేల్ కి వస్తోంది. రీయల్మీ సీ31 కి సక్సెసర్ గా ఈ ఫోన్ వచ్చింది. డిజైన్ పరంగా మార్పులను మనం గమనించవచ్చు. రియల్మీ సీ33 మెరిసే బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. అందుకు కారణమైన పీసీ, పీఎంఎంఏ 2డీ మెటీరియల్స్ కి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. దీని వల్లన ఫోన్ కి ప్రీమియమ్ లుక్ వచ్చింది. రెగ్యులర్ పాలికార్బొనెట్ బాడీ కంటే ఇది ఎంతో మెరుగైందని సమాచారం. ఇక ఫోన్ ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ లో కెమెరాను అమర్చారు. ఇక డ్యూయల్ కెమెరాల విషయానికి వస్తే, రెండు వేర్వేరు రింగ్స్ లో ఇవి ఉన్నాయి. ఇకపోతే ఫోన్ భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించబడింది.
ఇక రియల్మీ సీ33 యొక్క ముఖ్యమైన ఫీచర్లను చూస్తే, ఇందులో 6.5 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లో భారీ సెన్సర్ ని కలిగిన ఫోన్ రియల్మీ సీ33 కావడం విశేషం. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిసాక్ టీ612 చిప్సెట్ ను అమర్చారు.
భారత్ లో Realme C33 ధర, విక్రయ తేదీ
రియల్మీ సీ33 3జిబి + 32జిబి వేరియంట్ ధర రూ.8999 గా నిర్ణయించారు. ఇక 4జిబి + 64జిబి వర్షన్ ధర రూ.9999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ ఆక్వా బ్లూ, సాండీ గోల్డ్, నైట్ సీ కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్మీ అధికార వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.
Realme C33 స్పెసిఫికేషన్స్
రియల్మీ సీ33 స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, యూనిసాక్ టీ612 చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ, 3జిబి + 32జిబి, 4జిబి + 64జిబి మోడల్స్, ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రియల్మీ యూఐ ఎస్ ఎడిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్మీ సీ33 లో డ్యూయల్ రియర్ కెమెరాలున్నాయి. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా కాగా, రెండోది 0.3ఎంపి సెకండరీ సెన్సర్. ఇంకా ఎల్ఈడీ ఫ్లాష్ ఇందులో ఉంది. రియర్ కెమెరాలు సీహెచ్డీఆర్ ఆల్గొరిథమ్, హెచ్డీఆర్ మోడ్, పనోరమిక్ వ్యూ, పొట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరాను అమర్చారు.
ఈ హ్యాండ్సెట్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డిరాక్ 3.0 టెక్నాలజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి. ఇక రియల్మీ సీ33 కనెక్టివిటీ ఫీచర్లను చూస్తే, ఇది 4జి కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇందులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.













