Realme C67 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 14 Dec 2023 10:19:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme C67 5G https://www.91mobiles.com/telugu/realme-c67-5g-launched-india-price-specs-availability/ Thu, 14 Dec 2023 10:19:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=9272 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీ కలిగిన చవకైన సీ-సిరీస్ ఫోన్. ఈ ఫోన్ తో రియల్మీ తన సీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోని పటిష్టం చేసినట్లయింది. తక్కువ ధరలో 5జీ డివైజ్ కొనాలని భావించే వారికి Realme C67 5G ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే, ఓసారి Realme C67 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post MediaTek Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme C67 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Realme C67 5G
  • ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ తో వచ్చిన డివైజ్
  • Realme C67 5G ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీ కలిగిన చవకైన సీ-సిరీస్ ఫోన్. ఈ ఫోన్ తో రియల్మీ తన సీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోని పటిష్టం చేసినట్లయింది. తక్కువ ధరలో 5జీ డివైజ్ కొనాలని భావించే వారికి Realme C67 5G ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే, ఓసారి Realme C67 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C67 5G ధర, లభ్యత

  • Realme C67 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు.
  • Realme C67 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.
  • Realme C67 5G డివైజ్ డిసెంబర్ 16 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్ కి వస్తోంది. రియల్మీ ఇండియా వెబ్ సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • రియల్మీ మరియు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్ ద్వారా డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్‌సేల్ కూడా ఉంటుంది.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు 2,000 విలువజేసే ప్రయోజనాలను పొందవచ్చు.
  • Realme C67 5G డివైజ్ సన్నీ ఒయాసిస్ మరియు డార్క్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C67 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme C67 5G లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజల్యూషన్, 91.40 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 680 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Realme C67 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C67 5G డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Realme C67 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Realme C67 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme C67 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Realme C67 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.2, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post MediaTek Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme C67 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme C67 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-c67-5g-india-launch-date-announced/ Thu, 07 Dec 2023 12:35:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=9175 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Realme C67 5G యొక్క లాంచ్ తేదీని రియల్మీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 14 వ తేదీన Realme C67 5G డివైజ్ ఇండియాలో విడుదలవ్వనుంది. లాంచ్ తేదీ ప్రకటనతో పాటు డివైజ్ పిక్ ని కూడా కంపెనీ షేర్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Realme C67 […]

The post Realme C67 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme C67 5G లాంచ్ తేదీని ప్రకటించిన రియల్మీ
  • డివైజ్ ధర రూ.12,000 – రూ.15,000 ఉండే అవకాశం
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme C67 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Realme C67 5G యొక్క లాంచ్ తేదీని రియల్మీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 14 వ తేదీన Realme C67 5G డివైజ్ ఇండియాలో విడుదలవ్వనుంది. లాంచ్ తేదీ ప్రకటనతో పాటు డివైజ్ పిక్ ని కూడా కంపెనీ షేర్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme C67 5G లాంచ్ తేదీ, డిజైన్

భారతీయ మార్కెట్ లో Realme C67 5G స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ అవుతోంది. ఈమేరకు కంపెనీ ఒక పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్ ప్రకారం, డివైజ్ డిసెంబర్ 14 వ తేదీన మధ్యామ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. “అన్‌వీలింగ్ 5జీ టెక్నాలజీ ఇన్ ద ఛాంపియన్ సిరీస్” అని పోస్టర్ లో రియల్మీ పేర్కొంది.

  • పోస్టర్ లో Realme C67 5G డివైజ్ సన్నీ ఒయాసిస్ కలర్ లో కనిపిస్తోంది. ఇది గ్రేడియంట్ ఫినిషింగ్ గల బ్రైట్ గ్రీన్ కలర్ అని చెప్పవచ్చు.
  • ఇంకా ఈ ఫోన్ పర్పుల్ కలర్ ఆప్షన్ లో కూడా రానుంది.
  • డిజైన్ విషయానికి వస్తే, డివైజ్ ఫ్లాట్ ఎడ్జెస్, మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంది.
  • ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై ఒక భారీ సర్క్యులర్ మాడ్యూల్ లో కెమెరా సెటప్ ఉంది.
  • Realme C67 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు ఖరారైంది. ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలు రహస్యంగానే ఉన్నాయి.

Realme C67 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు

  • Realme C67 5G డివైజ్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని సమాచారం.
  • Realme C67 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • లాంచ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో Realme C67 5G కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది.
  • Realme సంస్థ ప్రస్తుతం అన్ని బడ్జెట్ సెగ్మెంట్లలో 5జీ డివైజెస్ ని ఆఫర్ చేస్తోంది. త్వరలో రాబోవు Realme C67 5G తో రియల్మీ సంస్థ దాదాపు అన్ని ధరల శ్రేణుల్లోనూ ఫోన్లను కలిగి ఉన్నట్లవుతోంది.

The post Realme C67 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/realme-c67-5g-ram-storage-color-options-revealed-might-launch-next-month/ Wed, 29 Nov 2023 13:54:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=9042 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ TDRA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI, BIS సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా Realme C67 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పైన పేర్కొన్న అన్ని సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C67 5G […]

The post వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme C67 5G
  • 4జిబి/6జిబి/8జిబి మోడల్స్‌లో వస్తోన్న డివైజ్
  • ధర రూ.12,000-రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ TDRA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI, BIS సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా Realme C67 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పైన పేర్కొన్న అన్ని సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C67 5G డివైజ్ RMX3890 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Realme C65 పేరుతో రానుందని ఇంతకు ముందు అనుకున్నారు.

Realme C67 5G ధర, కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ

  • Realme C67 5G డివైజ్ 3 మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. అవి: 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ.
  • Realme C67 5G డివైజ్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Realme C67 5G డివైజ్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • Realme C67 5G కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ వివరాలు తప్పా ఇతర స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Realme C51 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme C51 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme C51 లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ 12 నానోమీటర్ ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme C51 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. ఇంకా 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Realme C51 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ టీ ఎడిషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme C51 డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme C51 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: Realme C51 డివైజ్ 167.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంది.
  • కనెక్టివిటీ: Realme C51 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme C51 డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా అల్ట్రాబూమ్ స్పీకర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

The post వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>