
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Realme C67 5G యొక్క లాంచ్ తేదీని రియల్మీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 14 వ తేదీన Realme C67 5G డివైజ్ ఇండియాలో విడుదలవ్వనుంది. లాంచ్ తేదీ ప్రకటనతో పాటు డివైజ్ పిక్ ని కూడా కంపెనీ షేర్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme C67 5G లాంచ్ తేదీ, డిజైన్

భారతీయ మార్కెట్ లో Realme C67 5G స్మార్ట్ఫోన్ డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ అవుతోంది. ఈమేరకు కంపెనీ ఒక పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్ ప్రకారం, డివైజ్ డిసెంబర్ 14 వ తేదీన మధ్యామ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. “అన్వీలింగ్ 5జీ టెక్నాలజీ ఇన్ ద ఛాంపియన్ సిరీస్” అని పోస్టర్ లో రియల్మీ పేర్కొంది.
- పోస్టర్ లో Realme C67 5G డివైజ్ సన్నీ ఒయాసిస్ కలర్ లో కనిపిస్తోంది. ఇది గ్రేడియంట్ ఫినిషింగ్ గల బ్రైట్ గ్రీన్ కలర్ అని చెప్పవచ్చు.
- ఇంకా ఈ ఫోన్ పర్పుల్ కలర్ ఆప్షన్ లో కూడా రానుంది.
- డిజైన్ విషయానికి వస్తే, డివైజ్ ఫ్లాట్ ఎడ్జెస్, మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంది.
- ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై ఒక భారీ సర్క్యులర్ మాడ్యూల్ లో కెమెరా సెటప్ ఉంది.
- Realme C67 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు ఖరారైంది. ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలు రహస్యంగానే ఉన్నాయి.
Realme C67 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు
- Realme C67 5G డివైజ్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుందని సమాచారం.
- Realme C67 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
- లాంచ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో Realme C67 5G కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది.
- Realme సంస్థ ప్రస్తుతం అన్ని బడ్జెట్ సెగ్మెంట్లలో 5జీ డివైజెస్ ని ఆఫర్ చేస్తోంది. త్వరలో రాబోవు Realme C67 5G తో రియల్మీ సంస్థ దాదాపు అన్ని ధరల శ్రేణుల్లోనూ ఫోన్లను కలిగి ఉన్నట్లవుతోంది.











