Realme GT 3 240W - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 27 Mar 2023 08:18:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన Realme GT 3 https://www.91mobiles.com/telugu/realme-gt-3-240w-spotted-bis-database/ Mon, 27 Mar 2023 08:18:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=5590 Realme GT 3 స్మార్ట్ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఫిబ్రవరి లో జరిగిన ఎమ్‌డబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. స్టైలిష్ లుక్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Realme GT 3 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ తో త్వరలోనే రియల్మీ సంస్థ Realme GT 3 ని […]

The post బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన Realme GT 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్ సైట్ పై కనిపించిన Realme GT 3
  • 240 వాట్ సూపర్‌వూక్ చార్జ్ టెక్నాలజీతో వస్తోన్న Realme GT 3
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ పై పని చేయనున్న Realme GT 3

Realme GT 3 స్మార్ట్ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఫిబ్రవరి లో జరిగిన ఎమ్‌డబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. స్టైలిష్ లుక్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Realme GT 3 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ తో త్వరలోనే రియల్మీ సంస్థ Realme GT 3 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు Realme GT 3 ని బీఐఎస్ డేటాబేస్ పై గుర్తించాడు. ఆ విషయాన్ని సుదాన్శు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ ఫోన్ బీఐఎస్ పై RMX3709 మోడల్ నంబర్ తో లిస్ట్ అయి ఉంది. అయితే లిస్టింగ్ లో ఫోన్ లాంచ్ మరియు ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే త్వరలోనే భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీఐఎస్ లిస్టింగ్ తో స్పష్టమవుతోంది.

Realme GT 3 స్పెసిఫికేషన్స్

  • 240 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 6.74-ఇంచ్ 1.5కే 144 హెర్ట్జ్ డిస్ప్లే
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే పంచ్-హోల్ అమోలెడ్ డిస్ప్లే, 2772*1240 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో పూర్తిగా చార్జ్ అవుతుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

Realme GT 3 240W డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మైక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. ఇది 4-నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 3.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గేమింగ్ సమయంలో ఫోన్ ని కూల్ గా ఉంచేందుకు ఈ ఫోన్ లో స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ మ్యాక్స్ 2.0 ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన Realme GT 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై కనిపించిన Realme GT 3 240W, రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-3-240w-geekbench-listing-specifications-snapdragon-8-gen-1/ Fri, 24 Feb 2023 10:04:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=5089 చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో Realme GT 3 240W ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 28 న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ స్పెయిన్ లోని బార్సిలోనా లో జరుగుతుంది. తాజాగా Realme GT 3 240W గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, Realme GT 3 240W డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ […]

The post Geekbench పై కనిపించిన Realme GT 3 240W, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో లాంచ్ కానున్న Realme GT 3 240W స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వస్తోన్న Realme GT 3 240W
  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో లాంచ్ అవుతోన్న Realme GT 3 240W

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో Realme GT 3 240W ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 28 న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ స్పెయిన్ లోని బార్సిలోనా లో జరుగుతుంది.

తాజాగా Realme GT 3 240W గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, Realme GT 3 240W డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. అంతకుముందు Bluetooth Special Interest Group (SIG), National Broadcasting and Telecommunications Commission (NBTC), Tingkat Komponen Dalam Negeri (TKDN), Energy efficiency certificates (EEC) వెబ్‌సైట్స్ పై RMX3709 మోడల్ నంబర్ తో కనిపించింది.

ఈ ఫోన్ లో 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మేజర్ హైలైట్ గా నిలిస్తోంది. తొలుత ఈ చార్జింగ్ టెక్నాలజీ Realme GT Neo 5 లో కనిపించింది. 1 శాతం నుంచి 100 శాతానికి చేరుకోవడానికి 10 నిమిషాల సమయం పడుతుందని ఇటీవలె రియల్మీ కంపెనీ షోకేజ్ చేసింది. Realme GT 3 240W పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Geekbench పై కనిపించిన Realme GT 3 240W

RMX3709 మోడల్ నంబర్ తో Realme GT 3 240W డివైజ్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1265 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3885 పాయింట్లు సాధించింది. TARO అనే కోడ్ నేమ్ తో ఉన్న 8 కోర్స్ కలిగిన క్వాల్కమ్ ప్రాసెసర్ లిస్ట్ లో కనిపించింది.

రిపోర్ట్ ప్రకారం ఈ డివైజ్ లో గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPU వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 3.00 GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. చూస్తుంటే ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Realme GT 3 240W లో 16జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఉంటాయని అర్థమవుతోంది.

Realme GT 3 240W స్పెసిఫికేషన్స్

Realme GT 3 240W లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Snapdragon 8 Gen 1 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడినట్లు తెలుస్తోంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ రెండు బ్యాటరీ వేరియంట్స్ లో లభిస్తుంది.

Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వేరియంట్ తో పాటు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ లో లభిస్తుంది. Realme GT 3 240W ని ల్యాబ్ కండీషన్స్ లో పరీక్షించినప్పుడు 1 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 9 నిమిషాలు పట్టినట్లు కంపెనీ చెబుతోంది. కేవలం 80 సెకన్లలోనే 1 నుంచి 20 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.

Mobile World Congress లో Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అదే తేదీన లేదా తర్వాత ఏదొక తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Geekbench పై కనిపించిన Realme GT 3 240W, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>