బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన Realme GT 3

Highlights

  • బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్ సైట్ పై కనిపించిన Realme GT 3
  • 240 వాట్ సూపర్‌వూక్ చార్జ్ టెక్నాలజీతో వస్తోన్న Realme GT 3
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ పై పని చేయనున్న Realme GT 3

Realme GT 3 స్మార్ట్ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఫిబ్రవరి లో జరిగిన ఎమ్‌డబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. స్టైలిష్ లుక్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Realme GT 3 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ తో త్వరలోనే రియల్మీ సంస్థ Realme GT 3 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు Realme GT 3 ని బీఐఎస్ డేటాబేస్ పై గుర్తించాడు. ఆ విషయాన్ని సుదాన్శు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ ఫోన్ బీఐఎస్ పై RMX3709 మోడల్ నంబర్ తో లిస్ట్ అయి ఉంది. అయితే లిస్టింగ్ లో ఫోన్ లాంచ్ మరియు ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే త్వరలోనే భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీఐఎస్ లిస్టింగ్ తో స్పష్టమవుతోంది.

Realme GT 3 స్పెసిఫికేషన్స్

  • 240 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 6.74-ఇంచ్ 1.5కే 144 హెర్ట్జ్ డిస్ప్లే
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే పంచ్-హోల్ అమోలెడ్ డిస్ప్లే, 2772*1240 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో పూర్తిగా చార్జ్ అవుతుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

Realme GT 3 240W డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మైక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. ఇది 4-నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 3.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గేమింగ్ సమయంలో ఫోన్ ని కూల్ గా ఉంచేందుకు ఈ ఫోన్ లో స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ మ్యాక్స్ 2.0 ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.