Realme GT 7 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 22 Oct 2024 05:18:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/#respond Tue, 22 Oct 2024 05:18:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=14059 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం. Realme GT 7 […]

The post Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్
  • వై-ఫై 7, 8కే వీడియో రికార్డింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Realme GT 7 Pro ఇండియా లాంచ్

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో లాంచ్ కానున్నట్లు కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా వెల్లడించింది. అలాగే నవంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని కూడా తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్‌తో వస్తోన్న భారతదేశపు తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. అయితే డివైజ్ యొక్క లాంచ్ తేదీని రియల్మీ ఇంకా వెల్లడించలేదు.

ఇక స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంది. అడ్రెనో జీపీయూ, హెక్సాగన్ ఎన్‌పీయూ కలిగిన ఈ చిప్సెట్ ప్రపంచంలోనే వేగవంతమైన చిప్సెట్ అని రియల్మీ చెబుతోంది. ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్. ఫోన్ పెర్ఫామెన్స్‌ను ఇది 45 శాతం మేర పెంచుతుంది. అలాగే ఈ చిప్ లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్ కూడా ఉన్నాయి.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 320 మెగాపిక్సెల్స్ వరకు గల కెమెరాకు సపోర్ట్ చేస్తుంది. ఇది 8కే వీడియో రికార్డింగ్ చేయగలదు. ఈ చిప్సెట్ 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, వై-ఫై 7, స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300 వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Realme GT 7 Pro లో శాంసంగ్ క్వాడ్ మైక్రో కర్వ్డ్ ఎల్టీపీవో డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

మెమొరీ: Realme GT 7 Pro డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

సాఫ్ట్‌వేర్: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme GT 7 Pro: నవంబర్‌‌లో భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-november-2024-official/feed/ 0
Realme GT 7 Pro: లాంచ్‌కి ముందు రివీలైన రియల్మీ జీటీ7 ప్రో చార్జింగ్, కెమెరా వివరాలు https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-charging-and-camera-details-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-charging-and-camera-details-revealed-before-launch/#respond Mon, 07 Oct 2024 12:14:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13955 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీయూవీ ఎస్‌యూడీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ యొక్క చార్జింగ్ మరియు కెమెరా డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. Realme GT 7 Pro టీయూవీ […]

The post Realme GT 7 Pro: లాంచ్‌కి ముందు రివీలైన రియల్మీ జీటీ7 ప్రో చార్జింగ్, కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro విడుదల
  • 121 వాట్ చార్జింగ్ సపోర్ట్
  • ఓఐఎస్-ఈఐఎస్ 50ఎంపి కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీయూవీ ఎస్‌యూడీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ యొక్క చార్జింగ్ మరియు కెమెరా డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Realme GT 7 Pro టీయూవీ ఎస్‌యూడీ, కెమెరా ఎఫ్‌వీ-5 వివరాలు

Realme GT 7 Pro డివైజ్ టీయూవీ ఎస్‌యూడీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. వీటి ద్వారా ఫోన్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ మరియు కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

Realme GT 7 Pro డివైజ్ 10 వాట్, 55 వాట్ మరియు 121 వాట్ చార్జర్స్ తో టెస్ట్ చేయబడినట్లు లిస్టింగ్ లో ఉంది. 3సీ లిస్టింగ్ లో కూడా 121 వాట్ చార్జర్ పేర్కొనబడి ఉంది.

మరోవైపు, Camera FV-5 డేటాబేస్ లో 50ఎంపి ఓఐఎస్-ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 4096*3072 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో రియల్మీ జీటీ7 ప్రో లిస్ట్ అయ్యింది.

Realme GT 7 Pro డివైజ్ 16ఎంపి ఈఐఎస్ ఫ్రంట్ కెమెరా, 2304*1728 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 7 Pro లాంచ్ టైమ్‌లైన్

నవంబర్ ఆరంభంలో Realme GT 7 Pro చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే, Realme GT 7 Pro డివైజ్ గత మోడల్ Realme GT 5 Pro కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వస్తోంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా 8 ఎలీట్ చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme GT 7 Pro డివైజ్ ఐపీ68 లేదా ఐపీ69 రేటింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. చైనా లాంచ్ తర్వాత, భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుంది.

Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 7 Pro లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎక్స్2 స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme GT 7 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా 8 ఎలీట్ చిప్సెట్ ఉంటుంది.

రియర్ కెమెరా: Realme GT 7 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి.

సెల్ఫీ కెమెరా: Realme GT 7 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 121 వాట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ ఐపీ68 లేదా ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Realme GT 7 Pro: లాంచ్‌కి ముందు రివీలైన రియల్మీ జీటీ7 ప్రో చార్జింగ్, కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-charging-and-camera-details-revealed-before-launch/feed/ 0
Realme GT 7 Pro: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచ్ కానున్న రియల్మీ జీటీ 7 ప్రో, లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-to-launch-with-100w-fast-charging-specs-leaked/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-to-launch-with-100w-fast-charging-specs-leaked/#respond Sat, 24 Aug 2024 18:23:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13141 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ […]

The post Realme GT 7 Pro: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచ్ కానున్న రియల్మీ జీటీ 7 ప్రో, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై Realme GT 7 Pro యొక్క వివరాలను లీక్ చేశారు. అయితే టిప్‌స్టర్ డివైజ్ పేరు తెలపలేదు. కానీ, ఈ ఫోన్ Realme GT 7 Pro అని భావిస్తున్నారు.

డిస్ప్లే: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ లో బీఓఈ ఎక్స్2 స్క్రీన్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ నాలుగు వైపుల మైక్రో-కర్వ్డ్ ఎడ్జెస్ తో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. కానీ, 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుందని భావిస్తున్నారు.

ప్రాసెసర్: Realme GT 7 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్ అక్టోబర్ నెలలో లాంచ్ కానుంది.

స్టోరేజీ: Realme GT 7 Pro డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి.

కెమెరా: Realme GT 7 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సోని ఎల్‌వైటీ-600 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో 10ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్ ఉంటాయి.

బ్యాటరీ: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Realme GT 7 Pro లో ఐపీ68/ఐపీ69 రేటింగ్, సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటాయి.

The post Realme GT 7 Pro: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచ్ కానున్న రియల్మీ జీటీ 7 ప్రో, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-to-launch-with-100w-fast-charging-specs-leaked/feed/ 0
Realme GT 7 Pro: భారీ బ్యాటరీతో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-to-feature-a-big-battery-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-to-feature-a-big-battery-know-full-details/#respond Tue, 09 Jul 2024 05:45:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=12415 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme GT 7 Pro బ్యాటరీ వివరాలు […]

The post Realme GT 7 Pro: భారీ బ్యాటరీతో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • తాజాగా లీకైన బ్యాటరీ వివరాలు
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro బ్యాటరీ వివరాలు

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

టిప్‌స్టర్ ప్రకారం, Realme GT 7 Pro 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు అర్థమవుతోంది.

అయితే డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో డివైజ్ పేరు పేర్కొనబడి లేదు. అయితే, టిప్‌స్టర్ వాడిన ఎమోజీని గమనిస్తే, రియల్మీ నుంచి రాబోవు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్ గల ఫోన్ Realme GT 7 Pro అని అర్థమవుతోంది.

డీసీఎస్ లీక్ ద్వారా కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. జీటీ 7 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్, ఒక పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ69 రేటింగ్ తో వస్తోందని గతంలో బయటకు వచ్చిన కొన్ని లీక్స్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Realme GT 7 Pro: భారీ బ్యాటరీతో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-to-feature-a-big-battery-know-full-details/feed/ 0
Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-could-launch-with-ip69-rating/ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-could-launch-with-ip69-rating/#respond Fri, 28 Jun 2024 18:21:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=12287 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ చేయబోతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. రియల్మీ జీటీ 7 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో […]

The post Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 1.5కే మైక్రో-కర్వ్‌డ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ చేయబోతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. రియల్మీ జీటీ 7 ప్రో డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లే, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది. అయితే టిప్‌స్టర్ నేరుగా ఫోన్ పేరును కన్ఫర్మ్ చేయలేదు. కానీ, కామెంట్స్ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.

లీక్ ప్రకారం, Realme GT 7 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 1.5కే మైక్రో-కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Realme GT 7 Pro డివైజ్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుంది.

Realme GT 7 Pro డివైజ్ ఎక్స్‌ట్రా లార్జ్ సిలికాన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో సింగిల్-పాయింట్ అల్ట్రా‌సోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది.

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో రానున్నట్లు లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఇతర ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ లో కూడా డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన Realme GT 5 Pro డివైజ్‌కి సక్సెసర్‌గా Realme GT 7 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత్ లో రియల్మీ జీటీ 7 ప్రో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Realme GT 7 Pro: ఐపీ69 రేటింగ్‌తో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-could-launch-with-ip69-rating/feed/ 0
Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/realme-gt-7-pro-india-launch-timeline-revealed/ Wed, 29 May 2024 13:32:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=11789 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె GT 6T స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు జీటీ సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌ని అఫీషియల్ గా వెల్లడించారు. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. Realme GT 7 Pro ఇండియా […]

The post Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • ఇండియా టైమ్‌లైన్ ప్రకటన
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె GT 6T స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు జీటీ సిరీస్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌ని అఫీషియల్ గా వెల్లడించారు. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్

సోషల్ మీడియాలో ఒక యూజర్ Realme GT 7 Pro ఇండియా లాంచ్ ఎప్పుడని చేస్ జూ ని ప్రశ్నించగా, ఆయన ఈ ఏడాది భారత్ లో జీటీ 7 ప్రో లాంచ్ అవుతుందని బదులిచ్చారు. ఈ ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. అంటే అదే సమయంలో భారత్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.

త్వరలో Realme GT 6 గ్లోబల్ లాంచ్

మరోవైపు రియల్మీ సంస్థ, రియల్మీ జీటీ 6 డివైజ్‌ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ పై ఇంకా ప్రకటన రాలేదు.

రియల్మీ సంస్థ తన గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా Realme GT 6 గ్లోబల్ లాంచ్‌ని టీజ్ చేసింది. అయితే లాంచ్ తేదీని వెల్లడించలేదు. వచ్చే నెలలో లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టీజర్ పోస్ట్ లో కెమెరా స్పెసిఫికేషన్స్, డివైజ్ పేరుని కంపెనీ షేర్ చేసింది.

ఈ ఫోన్ 47ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఎఫ్/2.0 అపర్చర్, 1/100s షటర్ స్పీడ్, ఐఎస్ఓ 320 వంటి ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Realme GT 6 ఇదివరకు ఎఫ్‌సీసీ మరియు యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Realme GT 6 డివైజ్ గీక్‌బెంచ్ పై క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 735 జీపీయూ, 16జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.

Realme GT 6 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

రియల్మీ జీటీ 6 ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందింది. అంటే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో కూడా లాంచ్ అవ్వనుందని అర్థమవుతోంది.

The post Realme GT 7 Pro: రివీలైన రియల్మీ జీటీ 7 ప్రో ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>