
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై Realme GT 7 Pro యొక్క వివరాలను లీక్ చేశారు. అయితే టిప్‌స్టర్ డివైజ్ పేరు తెలపలేదు. కానీ, ఈ ఫోన్ Realme GT 7 Pro అని భావిస్తున్నారు.

డిస్ప్లే: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ లో బీఓఈ ఎక్స్2 స్క్రీన్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ నాలుగు వైపుల మైక్రో-కర్వ్డ్ ఎడ్జెస్ తో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. కానీ, 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుందని భావిస్తున్నారు.
ప్రాసెసర్: Realme GT 7 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్ అక్టోబర్ నెలలో లాంచ్ కానుంది.
స్టోరేజీ: Realme GT 7 Pro డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి.
కెమెరా: Realme GT 7 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సోని ఎల్‌వైటీ-600 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ లో 10ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్ ఉంటాయి.
బ్యాటరీ: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఇతర ఫీచర్లు: Realme GT 7 Pro లో ఐపీ68/ఐపీ69 రేటింగ్, సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటాయి.











