Realme Narzo 60 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 11 Mar 2024 10:15:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 100MP కెమెరా, 1TB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Realme Narzo 60, Narzo 60 Pro https://www.91mobiles.com/telugu/realme-narzo-60-5g-narzo-60-pro-5g-launched-india-price-specs-availability/ Thu, 06 Jul 2023 09:39:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=7094 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme Narzo 60 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme Narzo 60 మరియు Realme Narzo 60 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల లుక్స్ చూస్తుంటే అచ్చంగా Realme 10 Pro+ ని పోలి ఉన్నాయి. Realme Narzo 60 సిరీస్ 100ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, […]

The post 100MP కెమెరా, 1TB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Realme Narzo 60, Narzo 60 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Realme Narzo 60 సిరీస్
  • లైనప్ లో వచ్చిన రెండు ఫోన్లు – Narzo 60, Narzo 60 Pro
  • జులై 15 నుంచి అమెజాన్ ద్వారా మొదలుకానున్న సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme Narzo 60 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme Narzo 60 మరియు Realme Narzo 60 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల లుక్స్ చూస్తుంటే అచ్చంగా Realme 10 Pro+ ని పోలి ఉన్నాయి. Realme Narzo 60 సిరీస్ 100ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1టిబి వరకు మెమొరీ ఆప్షన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Realme Narzo 60 సిరీస్ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Realme Narzo 60 సిరీస్ ధర, సేల్ వివరాలు

Realme Narzo 60 సిరీస్ ప్రీ-బుకింగ్స్ నేడు మొదలవుతాయి. జులై 14 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా రియల్మీ సంస్థ ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు నెట్‌ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేసే ప్రీ-ఆర్డర్స్ పై రూ.1,500 డిస్కౌంట్ అందిస్తోంది. జులై 15 న అమెజాన్ ఇండియా, రియల్మీ వెబ్ సైట్ ద్వారా ఫస్ట్ సేల్ మొదలుకానుంది.

Realme Narzo 60 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి + 128జిబి, 12జిబి + 256జిబి, 12జిబి + 1టిబి వేరియంట్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ ద్వారా 12జిబి డైనమిక్ ర్యామ్ కూడా లభిస్తుంది.
  • కెమెరా: Realme Narzo 60 Pro 5G లో 100ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 60 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme Narzo 60 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Realme Narzo 60 Pro 5G మార్స్ ఆరెంజ్, కాస్మిక్ నైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme Narzo 60 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 180 హెర్ట్జ్ గేమింగ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 60 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: Realme Narzo 60 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 60 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme Narzo 60 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Realme Narzo 60 5G మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 100MP కెమెరా, 1TB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Realme Narzo 60, Narzo 60 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
‘మార్షియన్ హరైజన్’ డిజైన్‌తో వస్తోన్న Realme Narzo 60 సిరీస్; జులై 6న భారత్ లో లాంచ్! https://www.91mobiles.com/telugu/realme-narzo-60-5g-series-first-look-martian-horizon-design-other-details/ Tue, 27 Jun 2023 09:50:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=6944 రియల్మీ సంస్థ కొన్ని రోజుల నుంచి భారత్ లో కొత్త నార్జో సిరీస్ లాంచ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ Realme Narzo 60 5G సిరీస్ అని వార్తలు వినిపిస్తున్నాయి. Narzo 50 సిరీస్ కి సక్సెసర్ గా Narzo 60 సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. జులై 6 న నార్జో 60 5జీ, నార్జో 60 ప్రో డివైజెస్ భారత్ లో లాంచ్ కానున్నట్లు రియల్మీ సంస్థ […]

The post ‘మార్షియన్ హరైజన్’ డిజైన్‌తో వస్తోన్న Realme Narzo 60 సిరీస్; జులై 6న భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 6 న భారత్‌లో లాంచ్ కానున్న Narzo 60, Narzo 60 Pro
  • 100ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న డివైజ్
  • అమెజాన్ లో కనిపిస్తోన్న Realme Narzo 60 టీజర్

రియల్మీ సంస్థ కొన్ని రోజుల నుంచి భారత్ లో కొత్త నార్జో సిరీస్ లాంచ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ Realme Narzo 60 5G సిరీస్ అని వార్తలు వినిపిస్తున్నాయి. Narzo 50 సిరీస్ కి సక్సెసర్ గా Narzo 60 సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. జులై 6 న నార్జో 60 5జీ, నార్జో 60 ప్రో డివైజెస్ భారత్ లో లాంచ్ కానున్నట్లు రియల్మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Realme Narzo 60 5G సిరీస్ డిజైన్ వివరాలు

  • రియల్మీ నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ Realme Narzo 60 5G సిరీస్ అని తెలుస్తోంది. తాజాగా ఈ సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్ తో పాటు లాంచ్ తేదీ రివీల్ అయ్యింది.
  • చూడటంతోనే, ఈ ఫోన్ Realme 11 Pro మాదిరి కనిపించింది. ఈ సిరీస్ ఇటీవలె భారత్ లో లాంచ్ అయ్యింది.
  • Realme Narzo 60 5G డివైజ్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది. దీన్ని కంపెనీ Martian Horizon (మార్షియన్ హారిజన్) అని పిలుస్తోంది. మార్స్ గ్రహంపై నేలను స్పూర్తిగా తీసుకుని ఈ ఫోన్ కి రంగుని అందించారు. అమెజాన్ లో టీజర్ పేజీపై కూడా ఇదే విషయం స్పష్టమైంది.
  • అలాగే వెగాన్ లెదర్ ఫినిషింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా వాల్యూమ్ రాకర్, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ లుక్ ని కలిగి, గత మోడల్ కంటే మెరుగ్గా ఉంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు అమెజాన్ లో ఉన్న టీజర్ ద్వారా తెలుస్తోంది.

Realme Narzo 60 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

  • అమెజాన్ వెబ్ సైట్ లో ఉన్న టీజర్ పేజీ ప్రకారం, Realme Narzo 60 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే, 61-డిగ్రీ కర్వేచర్ ని కలిగి ఉంది.
  • ఈ స్మార్ట్ ఫోన్ లో పంచ్-హోల్ డిస్ప్లే ఉంది. టాప్ సెంటర్ లో సెల్ఫీ కెమెరా ఉంది.
  • Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ 1టిబి స్టోరేజీతో వస్తున్నట్లు సమాచారం. టాప్ స్టోరేజీ వేరియంట్ లో 250,000 ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని రియల్మీ కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది.

Realme Narzo 60 5G సిరీస్ లాంచ్ కి సంబంధించి రియల్మీ సంస్థ ప్రకటనతో నార్జో ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. బడ్జెట్ లో అన్ని ముఖ్యమైన ఫీచర్లను నార్జో సిరీస్ ఫోన్ల ద్వారా యూజర్లకు రియల్మీ అందిస్తూ వస్తోంది. దీంతో యూజర్లలో నార్జో సిరీస్ పట్ల ఆదరణ పెరిగింది. ఈ తరుణంలో Realme Narzo 60 5G సిరీస్ నుంచి వస్తోన్న రెండు ఫోన్లు ఏమేరకు యూజర్లను ఆకట్టుకుంటాయో చూడాలి.

The post ‘మార్షియన్ హరైజన్’ డిజైన్‌తో వస్తోన్న Realme Narzo 60 సిరీస్; జులై 6న భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
కన్ఫర్మ్ అయిన Realme Narzo 60 సిరీస్ లాంచ్; కొత్త టీజర్ విడుదల చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/realme-narzo-60-series-new-teaser-amazon-india-launch-timeline/ Tue, 20 Jun 2023 13:38:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=6857 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నార్జో సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తాజాగా ఓ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో Realme Narzo 60 సిరీస్ టీజర్ ని విడుదల చేసింది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ ఖరారు కాలేదు కానీ, జూన్ 22 న మరింత సమాచారం తెలియజేయనున్నట్లు టీజర్ ద్వారా రియల్మీ తెలిపింది. లీక్ ప్రకారం, Realme Narzo 60 లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ […]

The post కన్ఫర్మ్ అయిన Realme Narzo 60 సిరీస్ లాంచ్; కొత్త టీజర్ విడుదల చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme Narzo 60 సిరీస్
  • తాజాగా కొత్త టీజర్ ని వదిలిన రియల్మీ సంస్థ
  • డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో రానున్న Realme Narzo 60

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నార్జో సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తాజాగా ఓ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో Realme Narzo 60 సిరీస్ టీజర్ ని విడుదల చేసింది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ ఖరారు కాలేదు కానీ, జూన్ 22 న మరింత సమాచారం తెలియజేయనున్నట్లు టీజర్ ద్వారా రియల్మీ తెలిపింది.

లీక్ ప్రకారం, Realme Narzo 60 లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Realme Narzo 60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని సమాచారం. Realme Narzo 60 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Realme Narzo 60 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది.

Realme Narzo 60 సిరీస్

మిషన్ నార్జో అనే ట్యాగ్ లైన్ ని అమెజాన్ ద్వారా విడుదల చేసిన టీజర్ లో వాడటం జరిగింది. Realme Narzo 60 సిరీస్ ఫోన్లు అత్యధిక స్టోరేజీని కలిగి ఉంటాయని తెలిసింది. 2,50,000 లకు పైగా ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని టీజర్ లో పేర్కొన్నారు. Realme Narzo 60 సిరీస్ కి సంబంధించిన అదనపు సమాచారం జూన్ 22 న తెలియజేస్తామని రియల్మీ తెలిపింది. వచ్చే నెలలో Realme Narzo 60 సిరీస్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

Realme Narzo 60 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్ ప్రకారం, Realme Narzo 60 లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • స్టోరేజీ: Realme Narzo 60 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది.
  • కెమెరా: Realme Narzo 60 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme Narzo 60 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
  • సెక్యూరిటీ: Realme Narzo 60 స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉండనుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo 60 లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ ఉంటాయి.
  • ఓఎస్: Realme Narzo 60 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post కన్ఫర్మ్ అయిన Realme Narzo 60 సిరీస్ లాంచ్; కొత్త టీజర్ విడుదల చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన Realme Narzo 60 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-narzo-60-5g-geekbench-listing-key-specs/ Thu, 15 Jun 2023 06:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=6779 Narzo 50 సిరీస్ లాంచ్ చేసిన తర్వాత, ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ, Narzo 60 సిరీస్ పై పని చేస్తోంది. అయితే కంపెనీ ఈ విషయంపై ఇంకా ఏ ప్రకటన వెలువరించలేదు. అయితే తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Realme Narzo 60 5G డివైజ్ కనిపించింది. లిస్టింగ్ ద్వారా ర్యామ్, చిప్సెట్ తదితర వివరాలు తెలిసాయి. Realme Narzo 60 5G డివైజ్ 8జిబి ర్యామ్, మీడియాటెక్ […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Realme Narzo 60 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • RMX3750 మోడల్ నంబర్ తో కనిపించిన Realme Narzo 60 5G
  • 64జిబి/128జిబి స్టోరేజీతో రానున్న Realme Narzo 60 5G
  • Realme 11 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న Realme Narzo 60 5G

Narzo 50 సిరీస్ లాంచ్ చేసిన తర్వాత, ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ, Narzo 60 సిరీస్ పై పని చేస్తోంది. అయితే కంపెనీ ఈ విషయంపై ఇంకా ఏ ప్రకటన వెలువరించలేదు. అయితే తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Realme Narzo 60 5G డివైజ్ కనిపించింది. లిస్టింగ్ ద్వారా ర్యామ్, చిప్సెట్ తదితర వివరాలు తెలిసాయి. Realme Narzo 60 5G డివైజ్ 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్, గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Realme Narzo 60 5G గీక్ బెంచ్ లిస్టింగ్

  • డివైజెస్ యొక్క ప్రాసెసర్ పెర్ఫామెన్స్, జీపీయూ బెంచ్ మార్క్ టెస్ట్ లను నిర్వహించే వేదిక గీక్ బెంచ్. ఈ వెబ్ సైట్ రాబోవు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ప్రాసెసర్, ర్యామ్, ఓఎస్ వివరాలను తెలియజేస్తుంది. దీని వల్లన మొబైల్ ఫోన్ రిలీజ్ కి ముందే ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసే అవకాశం ఉంది.
  • Realme Narzo 60 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 714 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1868 పాయింట్లు సాధించింది.
  • Realme Narzo 60 5G యొక్క గీక్ బెంచ్ లిస్టింగ్ ని తొలుత MySmartPrice గుర్తించింది.
  • Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ 4జిబి లేదా 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • ఈ ఫోన్ 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా.
  • Realme Narzo 60 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • అయితే Realme Narzo 60 5G డివైజ్ Realme 11 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటి వరకు రియల్మీ 11 ప్రో 5జీ, రియల్మీ 11 ప్రో+ డివైజెస్ మాత్రమే భారత్ లో లాంచ్ అయ్యింది. ఇంకా రియల్మీ 11 5జీ లాంచ్ కాలేదు.

Realme Narzo 60 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Narzo 60 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Realme Narzo 60 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా 2ఎంపి సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది.
  • సెల్ఫీ కెమెరా: Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా.
  • చిప్సెట్: Realme Narzo 60 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంటుందని భావిస్తున్నారు.
  • స్టోరేజీ: Realme Narzo 60 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం.
  • ఓఎస్: Realme Narzo 60 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Realme Narzo 60 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Realme Narzo 60 5G; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>