
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నార్జో సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తాజాగా ఓ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో Realme Narzo 60 సిరీస్ టీజర్ ని విడుదల చేసింది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ ఖరారు కాలేదు కానీ, జూన్ 22 న మరింత సమాచారం తెలియజేయనున్నట్లు టీజర్ ద్వారా రియల్మీ తెలిపింది.
లీక్ ప్రకారం, Realme Narzo 60 లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Realme Narzo 60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని సమాచారం. Realme Narzo 60 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Realme Narzo 60 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది.
Realme Narzo 60 సిరీస్
మిషన్ నార్జో అనే ట్యాగ్ లైన్ ని అమెజాన్ ద్వారా విడుదల చేసిన టీజర్ లో వాడటం జరిగింది. Realme Narzo 60 సిరీస్ ఫోన్లు అత్యధిక స్టోరేజీని కలిగి ఉంటాయని తెలిసింది. 2,50,000 లకు పైగా ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని టీజర్ లో పేర్కొన్నారు. Realme Narzo 60 సిరీస్ కి సంబంధించిన అదనపు సమాచారం జూన్ 22 న తెలియజేస్తామని రియల్మీ తెలిపింది. వచ్చే నెలలో Realme Narzo 60 సిరీస్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
Realme Narzo 60 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: లీక్ ప్రకారం, Realme Narzo 60 లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme Narzo 60 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- స్టోరేజీ: Realme Narzo 60 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది.
- కెమెరా: Realme Narzo 60 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Realme Narzo 60 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
- సెక్యూరిటీ: Realme Narzo 60 స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉండనుంది.
- కనెక్టివిటీ: Realme Narzo 60 లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ ఉంటాయి.
- ఓఎస్: Realme Narzo 60 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












