Realme Narzo N55 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 23 May 2024 09:28:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N55 https://www.91mobiles.com/telugu/realme-narzo-n55-launched-india-price-specs-availability/ Wed, 12 Apr 2023 08:20:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=5845 రియల్మీ సంస్థ తన నెక్ట్స్ జనరేషన్ నార్జో ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ కంపెనీ కొత్త ఫోన్ ని Realme Narzo N55 అనే పేరుతో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ఒక 4జీ డివైజ్. కానీ, ఈ ఫోన్ లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆపిల్ పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ వంటి మినీ క్యాప్సూల్ ఫీచర్ ని ఈ ఫోన్ ద్వారా రియల్మీ తీసుకొచ్చింది. ఈ క్యాప్సూల్ లో నోటిఫికేషన్స్, […]

The post 64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Realme Narzo N55
  • మినీ-క్యాప్సూల్ డిస్ప్లే తో మార్కెట్ లోకి వచ్చిన డివైజ్
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Realme Narzo N55

రియల్మీ సంస్థ తన నెక్ట్స్ జనరేషన్ నార్జో ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ కంపెనీ కొత్త ఫోన్ ని Realme Narzo N55 అనే పేరుతో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ఒక 4జీ డివైజ్. కానీ, ఈ ఫోన్ లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆపిల్ పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ వంటి మినీ క్యాప్సూల్ ఫీచర్ ని ఈ ఫోన్ ద్వారా రియల్మీ తీసుకొచ్చింది. ఈ క్యాప్సూల్ లో నోటిఫికేషన్స్, బ్యాటరీ స్టేటస్ తదితర ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు. సరే, ఓసారి Realme Narzo N55 ధర, స్పెసిఫకేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Narzo N55 సేల్ వివరాలు

  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ = రూ.9,999
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.11,999

రియల్మీ సంస్థ Realme Narzo N55 ని రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ప్రైమ్ బ్లూ మరియు ప్రైమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 18 నుంచి Realme Narzo N55 ఫస్ట్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ కార్డ్స్ ద్వారా బేస్ మోడల్ పై రూ.500, టాప్ మోడల్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

దీంతో పాటు, రియల్మీ కంపెనీ రేపు Realme Narzo N55 స్పెషల్ ఫ్లాష్ సేల్ ని తీసుకొస్తోంది. ఏప్రిల్ 13 న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ మరియు రియల్మీ వెబ్ సైట్స్ ద్వారా రూ.1000 వరకు డిస్కౌంట్ తో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

Realme Narzo N55 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Realme Narzo N55 లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఈ హ్యాండ్సెట్ మినీ క్యాప్సూల్ ఫీచర్ తో వచ్చింది. ఆపిల్ తీసుకొచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ స్పూర్తితో ఈ మినీ క్యాప్సూల్ ఫీచర్ వచ్చింది. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, నోటిఫికేషన్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. అయితే, ఇదివరకు ఇదే ఫీచర్ కంపెనీ రియల్మీ సీ55 డివైజ్ లో ఇచ్చింది.

Realme Narzo N55 లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ ఎడ్జ్, 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్ మరియు 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ

Realme Narzo N55 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

డైనమిక్ ర్యామ్ ద్వారా 12జిబి వరకు ర్యామ్ ని పొందవచ్చు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్-వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

కెమెరా

Realme Narzo N55 లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ మరియు ఓఎస్

Realme Narzo N55 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 29 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతం చార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N55 first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 12 న లాంచ్ అవుతోన్న Realme Narzo N55; లాంచ్‌కి ముందు ఫోన్ విశేషాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-narzo-n55-launch-date-april-12-expected-specs-other-details/ Mon, 10 Apr 2023 15:36:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=5816 రియల్మీ సంస్థ నార్జో సిరీస్ లో భారత్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 12 న Realme Narzo N55 డివైజ్ భారత్ లో లాంచ్ అవుతున్నట్లు సమాచారం. అధికార ప్రకటనకు ముందే ఈ ఫోన్ డిజైన్ ని కంపెనీ టీజ్ చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుందని కూడా స్పష్టమైంది. ఇప్పటి వరకు కంపెనీ అందించిన మరియు లీక్స్ ద్వారా […]

The post ఏప్రిల్ 12 న లాంచ్ అవుతోన్న Realme Narzo N55; లాంచ్‌కి ముందు ఫోన్ విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి రానున్న Realme Narzo N55
  • కంఫర్టబుల్ గ్రిప్ కోసం సీ-డిజైన్ తో వస్తోన్న డివైజ్
  • సెగ్మెంట్ లోనే సన్నని ఫోన్ ఇదేనని చెబుతోన్న కంపెనీ

రియల్మీ సంస్థ నార్జో సిరీస్ లో భారత్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 12 న Realme Narzo N55 డివైజ్ భారత్ లో లాంచ్ అవుతున్నట్లు సమాచారం. అధికార ప్రకటనకు ముందే ఈ ఫోన్ డిజైన్ ని కంపెనీ టీజ్ చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుందని కూడా స్పష్టమైంది. ఇప్పటి వరకు కంపెనీ అందించిన మరియు లీక్స్ ద్వారా బయటకు వచ్చిన Realme Narzo N55 యొక్క సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme Narzo N55 ధర (అంచనా)

ఇప్పటి వరకు Realme Narzo N55 కి సంబంధించిన ధర రివీల్ కాలేదు. లీక్స్ ద్వారా కూడా ఏ సమాచారం తెలియలేదు. కానీ, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ తో వస్తోందని, ధర రూ.12,000 గా ఉండనుందని అంచనా వేస్తున్నారు.

Realme Narzo N55 డిజైన్

  • డైనమిక్ ఐల్యాండ్-లైక్ మినీ క్యాప్సూల్
  • పంచ్ హోల్ కెమెరా

డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ స్క్రీన్ పంచ్ హోల్ స్టైల్ తో వచ్చింది. Realme Narzo N55 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి. ఫోన్ రియర్ లుక్ గురించి మాట్లాడితే, రెండు భారీ సర్కిల్ కెమెరా రింగ్స్ ఉన్నాయి. బాటమ్ లో ఫోన్ బ్రాండింగ్ కనిపిస్తోంది.

అంతేకాదండోయ్, Realme Narzo N55 డివైజ్ ఆపిల్ పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ వంటి మినీ క్యాప్సూల్ తో వస్తోంది. ఇందులో నోటిఫికేషన్స్, బ్యాటరీ స్టేటస్ మరియు మరెన్నో వివరాలు చూడవచ్చు. అయితే, ఇదే ఫీచర్ ని మనం గత నెలలో లాంచైన Realme C55 ఫోన్లో చూసాం.

33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్

  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 29 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్

ప్రస్తుతానికి రియల్మీ సంస్థ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేయలేదు. కానీ, Realme Narzo N55 డివైజ్ 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ చార్జర్ తో డివైజ్ బ్యాటరీని 29 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. అయితే, బ్యాటరీ కెపాసిటీని ఇంకా రివీల్ చేయలేదు. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని తెలుస్తోంది.

ర్యామ్ మరియు స్టోరేజీ

  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్
  • 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ

Realme Narzo N55 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ మరియు 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ తో ఈ ఫోన్ రానుందని చెప్పవచ్చు. స్టోరేజీని 512జిబి లేదా 1టిబి వరకు పెంచుకునేందుకు అవకాశం ఉండవచ్చు. ఇకపోతే లీక్స్ ని బట్టి ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో రానుందని అర్థమవుతోంది.

డ్యూయల్ కెమెరాతో వస్తోన్న Realme Narzo N55

  • ఒమ్నివిజన్ ఓవీ64బి సెన్సర్
  • నైట్ ఫోటోగ్రఫీ

Realme Narzo N55 లో మ్యాట్రిక్స్ డ్యూయల్ రియర్ కెమెరా ఉండనుంది. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ ఫోన్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ నైట్ ఫోటోగ్రఫీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, సెకండరీ సెన్సర్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 12 న లాంచ్ అవుతోన్న Realme Narzo N55; లాంచ్‌కి ముందు ఫోన్ విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 12 న భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55 https://www.91mobiles.com/telugu/realme-narzo-n55-india-launch-date-revealed/ Thu, 06 Apr 2023 05:50:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5773 రియల్మీ అతిత్వరలో తన కొత్త నార్జో-బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Realme Narzo N55 అనే పేరుతో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బ్రాండ్ ఇంకా అఫీషియల్ గా పేరుని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. త్వరలో రిలీజ్ అయ్యే ఈ ఫోన్ లుక్స్ ని బ్రాండ్ కొన్ని రోజుల నుంచి టీజ్ చేస్తోంది. రివీలైన Realme Narzo […]

The post ఏప్రిల్ 12 న భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన Realme Narzo N55 ఇండియా లాంచ్ తేదీ
  • లాంచ్ కి ముందు అఫీషియల్ డిజైన్ ని రివీల్ చేసిన బ్రాండ్
  • డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్, డ్యూయల్ కెమెరా మాడ్యూల్ తో వస్తోన్న Realme Narzo N55

రియల్మీ అతిత్వరలో తన కొత్త నార్జో-బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Realme Narzo N55 అనే పేరుతో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బ్రాండ్ ఇంకా అఫీషియల్ గా పేరుని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. త్వరలో రిలీజ్ అయ్యే ఈ ఫోన్ లుక్స్ ని బ్రాండ్ కొన్ని రోజుల నుంచి టీజ్ చేస్తోంది.

రివీలైన Realme Narzo N55 డిజైన్

Realme Narzo N55 వెనకవైపు నుంచి ఎలా ఉంటుందో తెలిసింది. బ్యాక్ సైడ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కనిపిస్తోంది. టాప్ లెఫ్ట్ లో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. దీనికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు కనిపించడం లేదు. Realme Narzo N55 డివైజ్ అమోలెడ్ ప్యానెల్ లేదా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో రావొచ్చు.

Realme Narzo N55 లాంచ్ తేదీ మరియు విక్రయం

Realme Narzo N55 భారత మార్కెట్ లో ఏప్రిల్ 12 న లాంచ్ అవుతోంది. ఇదే రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. Realme Narzo N55 స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్ అని రియల్మీ తెలిపింది. దీంతో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తుందని స్పష్టమైంది. రియల్మీ అఫీషియల్ వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు అమెజాన్ లో లాంచ్ ఈవెంట్ టెలీకాస్ట్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 12 న భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55 first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Realme Narzo N55 ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/realme-narzo-n55-launch-date-leaked-before-launch/ Thu, 30 Mar 2023 13:25:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=5675 రియల్మీ ఇండియా కొత్త నార్జో-ఎన్ సిరీస్ ఫోన్ లాంచ్ ని టీజ్ చేస్తోంది. రీసెంట్ గా 91మొబైల్స్ ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని ఇచ్చింది. దాని ప్రకారం, ఈ ఫోన్ వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానుంది. ఇప్పుడు ఫోన్ యొక్క లాంచ్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్ అందింది. ఏప్రిల్ 12 న Realme Narzo N55 సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కంపెనీ […]

The post రివీలైన Realme Narzo N55 ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55
  • 4జిబి/64జిబి, 4జిబి/128జిబి, 6జిబి+64జిబి/128జిబి, 8జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్
  • ఇంకా Realme Narzo N55 గురించి రావాల్సిన అధికార ప్రకటన

రియల్మీ ఇండియా కొత్త నార్జో-ఎన్ సిరీస్ ఫోన్ లాంచ్ ని టీజ్ చేస్తోంది. రీసెంట్ గా 91మొబైల్స్ ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని ఇచ్చింది. దాని ప్రకారం, ఈ ఫోన్ వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానుంది. ఇప్పుడు ఫోన్ యొక్క లాంచ్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్ అందింది. ఏప్రిల్ 12 న Realme Narzo N55 సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కంపెనీ నుంచి అధికార సమాచారం ఏదీ లేదు. కానీ, త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు.

కలర్, ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్స్

ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం, Realme Narzo N55 డివైజ్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ వివిధ మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి + 128జిబి, 6జిబి + 64జిబి/128జిబి, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది.

అయితే, కంపెనీ నుంచి Realme Narzo N55 ఫోన్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, Realme Narzo N55 డివైజ్ మిడ్ రేంజ్ ఫోన్ అని తెలుస్తోంది. ఇదొక గేమింగ్ ప్రధాన ఫోన్ అని కూడా చెబుతున్నారు. Realme Narzo N55 హ్యాండ్సెట్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ మరియు రియల్మీ వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానుంది.

ఇప్పటికి Realme Narzo N55 గురించి తెలిసిన విషయాలు ఇవే. ఇవి తప్ప ఇంకా కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీలైన Realme Narzo N55 ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55; రివీలైన మెమొరీ, కలర్ వేరియంట్స్ https://www.91mobiles.com/telugu/realme-narzo-n55-memory-variants-color-options-revealed-before-launch/ Wed, 29 Mar 2023 06:09:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=5628 రియల్మీ సంస్థ రీసెంట్ గా ఎన్-సిరీస్ ప్రొడక్ట్ వస్తోందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై టీజ్ చేసింది. అయితే సదరు బ్రాండ్ ఏ డివైజ్ రానుందని వెల్లడించలేదు. ఈలోపు 91మొబైల్స్ రియల్మీ నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ల గురించి ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని రాబట్టింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, రియల్మీ టీజ్ చేసిన ఫోన్ మోడల్ Realme Narzo N55 అని తెలుస్తోంది. నార్జో బ్రాండింగ్ లో కంపెనీ నుంచి వస్తోన్న కొత్త […]

The post వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55; రివీలైన మెమొరీ, కలర్ వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నార్జో బ్రాండింగ్ పై భారత్ లో ఎన్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న రియల్మీ
  • లైనప్ లో రానున్న మొదటి డివైజ్ Realme Narzo N55
  • రివీలైన Realme Narzo N55 యొక్క మెమొరీ మరియు కలర్ వేరియంట్స్

రియల్మీ సంస్థ రీసెంట్ గా ఎన్-సిరీస్ ప్రొడక్ట్ వస్తోందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై టీజ్ చేసింది. అయితే సదరు బ్రాండ్ ఏ డివైజ్ రానుందని వెల్లడించలేదు. ఈలోపు 91మొబైల్స్ రియల్మీ నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ల గురించి ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని రాబట్టింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, రియల్మీ టీజ్ చేసిన ఫోన్ మోడల్ Realme Narzo N55 అని తెలుస్తోంది. నార్జో బ్రాండింగ్ లో కంపెనీ నుంచి వస్తోన్న కొత్త ఫోన్ ఇదే కానుంది. ఇకపోతే ఈ ఫోన్ కి సంబంధించిన మెమొరీ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ వివరాలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

Realme Narzo N55 మెమొరీ, కలర్ వేరియంట్స్

సోర్స్ ప్రకారం, రియల్మీ సంస్థ త్వరలోనే నార్జో బ్రాండింగ్ పై కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. 2023 ఏప్రిల్ ద్వితీయార్థంలో Realme Narzo N55 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రైమ్ బ్లాక్ మరియు ప్రైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని సమాచారం. ఈ డివైజ్ వివిధ మెమొరీ ఆప్షన్స్ లో లభించనుంది. మొత్తం 4 స్టోరేజీ వేరియంట్స్ లో రియల్మీ నార్జో ఎన్55 డివైజ్ లభిస్తుంది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో దొరుకుతుంది.

Realme Narzo N55 డివైజ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లభించనుంది. మిడ్ రేంజ్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 64/128జిబి స్టోరేజీ తో లభిస్తుందని అంచనా. చివరగా, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

Realme Narzo N55 ఇతర స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియదు. అయితే Realme Narzo N55 డివైజ్ మిడ్ రేంజ్ ఫోన్ అని అంచనా వేయవచ్చు. Realme Narzo N55 కి సంబంధించిన మరింత సమాచారం రానున్న కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అప్పుడు మీకు మరింత సమాచారం అందజేస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55; రివీలైన మెమొరీ, కలర్ వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>