
రియల్మీ ఇండియా కొత్త నార్జో-ఎన్ సిరీస్ ఫోన్ లాంచ్ ని టీజ్ చేస్తోంది. రీసెంట్ గా 91మొబైల్స్ ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని ఇచ్చింది. దాని ప్రకారం, ఈ ఫోన్ వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానుంది. ఇప్పుడు ఫోన్ యొక్క లాంచ్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్ అందింది. ఏప్రిల్ 12 న Realme Narzo N55 సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కంపెనీ నుంచి అధికార సమాచారం ఏదీ లేదు. కానీ, త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు.
Passion that drives you to greatNess, leads you to #realmeProjectN. pic.twitter.com/bWBbw6XFlK
— realme (@realmeIndia) March 29, 2023
కలర్, ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్స్
ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం, Realme Narzo N55 డివైజ్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ వివిధ మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి + 128జిబి, 6జిబి + 64జిబి/128జిబి, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది.
అయితే, కంపెనీ నుంచి Realme Narzo N55 ఫోన్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, Realme Narzo N55 డివైజ్ మిడ్ రేంజ్ ఫోన్ అని తెలుస్తోంది. ఇదొక గేమింగ్ ప్రధాన ఫోన్ అని కూడా చెబుతున్నారు. Realme Narzo N55 హ్యాండ్సెట్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ మరియు రియల్మీ వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానుంది.
ఇప్పటికి Realme Narzo N55 గురించి తెలిసిన విషయాలు ఇవే. ఇవి తప్ప ఇంకా కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











