Realme Note 60 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 31 Aug 2024 17:32:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme Note 60: 32MP కెమెరాతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ నోట్ 60 https://www.91mobiles.com/telugu/realme-note-60-launched-indonesia-32mp-camera/ https://www.91mobiles.com/telugu/realme-note-60-launched-indonesia-32mp-camera/#respond Sat, 31 Aug 2024 17:32:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13282 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా నోట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Note 60 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 32ఎంపి ప్రైమరీ కెమెరా, 24జిబి ర్యామ్ (8+16), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 10 వాట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం. Realme Note 60 ధర […]

The post Realme Note 60: 32MP కెమెరాతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండోనేషియాలో Realme Note 60 విడుదల
  • 24జిబి ర్యామ్ (8జిబి+16జిబి)
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా నోట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Note 60 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 32ఎంపి ప్రైమరీ కెమెరా, 24జిబి ర్యామ్ (8+16), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 10 వాట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Realme Note 60 ధర

Realme Note 60 స్మార్ట్‌పఓన్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను Rp.13,99,000 (సుమారు రూ.7,580) గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను Rp.15,99,000 (సుమారు రూ.8,660) గా పెట్టారు. టాప్ వేరియంట్ 8జిబి + 256జిబి మోడల్ ధరను Rp.19,99,000 (సుమారు రూ.10,830) గా పెట్టారు. ఇండోనేషియాలో ఈ ఫోన్ మార్బుల్ బ్లాక్ మరియు వొయేజర్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

Realme Note 60 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Note 60 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Note 60 స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: Realme Note 60 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Realme Note 60 డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 16జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: Realme Note 60 స్మార్ట్‌ఫోన్ లో 32ఎంపి మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme Note 60 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme Note 60 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ64 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Source

The post Realme Note 60: 32MP కెమెరాతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-note-60-launched-indonesia-32mp-camera/feed/ 0
Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/ https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/#respond Sun, 30 Jun 2024 17:31:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=12297 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నోట్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Note 60 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme Note 60 గీక్‌బెంచ్ డేటాబేస్ Realme Note 60 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై […]

The post Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme Note 60 లాంచ్
  • UniSoc T612 ప్రాసెసర్
  • మోడల్ నంబర్ RMX3933

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నోట్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Note 60 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Note 60 గీక్‌బెంచ్ డేటాబేస్

Realme Note 60 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై RMX3933 మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 432 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1341 పాయింట్లు స్కోర్ చేసింది.

Realme Note 60 డివైజ్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్సెట్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.82 గిగాహెర్ట్జ్. ఇక ఈ ఫోన్ మాలి-జీ57 జీపీయూ గ్రాఫిక్స్ తో వస్తోంది.

ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో గీక్‌‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Realme Note 60 ఇతర సర్టిఫికేషన్స్ వివరాలు

Realme Note 60 స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ మరియు టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

టీయూవీ సర్టిఫికేషన్ ప్రకారం, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. అయితే బీఐఎస్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే, నోట్ సిరీస్‌ను భారత్ లో లాంచ్ చేయమని రియల్మీ గతంలో తెలిపింది. దీన్ని బట్టి, Realme Note 60 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు తక్కువేనని అనుకోవచ్చు.

The post Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/feed/ 0