Realme Note 60: 32MP కెమెరాతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ నోట్ 60

Highlights

  • ఇండోనేషియాలో Realme Note 60 విడుదల
  • 24జిబి ర్యామ్ (8జిబి+16జిబి)
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా నోట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Note 60 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 32ఎంపి ప్రైమరీ కెమెరా, 24జిబి ర్యామ్ (8+16), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 10 వాట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Realme Note 60 ధర

Realme Note 60 స్మార్ట్‌పఓన్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను Rp.13,99,000 (సుమారు రూ.7,580) గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను Rp.15,99,000 (సుమారు రూ.8,660) గా పెట్టారు. టాప్ వేరియంట్ 8జిబి + 256జిబి మోడల్ ధరను Rp.19,99,000 (సుమారు రూ.10,830) గా పెట్టారు. ఇండోనేషియాలో ఈ ఫోన్ మార్బుల్ బ్లాక్ మరియు వొయేజర్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

Realme Note 60 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Note 60 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Note 60 స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: Realme Note 60 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Realme Note 60 డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 16జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇక మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: Realme Note 60 స్మార్ట్‌ఫోన్ లో 32ఎంపి మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme Note 60 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme Note 60 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ64 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Source

Previous articleVivo T3 Pro vs iQOO Z9s Pro: రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్?
Next articleVivo T3 Ultra: లాంచ్‌కి ముందు లీకైన వివో టీ3 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.