Realme P2 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 14:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/#respond Mon, 30 Sep 2024 14:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13845 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.25,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

ఫోన్ చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్
రియల్మీ 13+ 80 వాట్ 31 నిమిషాలు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 100 వాట్ 35 నిమిషాలు
రియల్మీ పీ2 ప్రో 80 వాట్ 31 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ 36 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68 వాట్ 37 నిమిషాలు

 

Realme 13+

Realme 13+ రూ.25,000 లోపు ధరలో లభిస్తోన్న ఒక బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జర్ తో పాటు వస్తోన్న ఈ ఫోన్ 20 శాతం నుంచి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం 31 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ 10 గంటల స్కోరు చేసింది.

Realme 13+ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.22,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

OnePlus Nord CE4

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాలు సమయం పట్టింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల స్కోర్ చేసింది.

OnePlus Nord CE4 లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

Realme P2 Pro

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.25,000 లోపు ధర శ్రేణిలో ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 10 గంటల స్కోర్ చేసింది.

Realme P2 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme P2 Pro 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ఉపయోగిస్తే, 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 9 గంటల 53 నిమిషాలు స్కోర్ చేసింది.

Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 మరియు 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉన్నాయి.

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo లో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 37 నిమిషాలు సమయం పట్టింది.

Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.2కే 120 హెర్ట్జ్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999, 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/feed/ 0
Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: రూ.25,000 లోపు బడ్జెట్‌లో రెండింట్లో ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/#respond Mon, 23 Sep 2024 12:58:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=13686 Realme P2 Pro మరియు Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా రూ.25,000 లోపు లభించే ఫోన్లు. ఇవి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్ తో వచ్చాయి. మరి, సాధారణ మరియు విపరీతమైన వాడకానికి ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షన్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం, మేం రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లపై […]

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: రూ.25,000 లోపు బడ్జెట్‌లో రెండింట్లో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme P2 Pro మరియు Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా రూ.25,000 లోపు లభించే ఫోన్లు. ఇవి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్ తో వచ్చాయి. మరి, సాధారణ మరియు విపరీతమైన వాడకానికి ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షన్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం, మేం రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లపై కొన్ని టెస్టులు చేశాం. ఆ వివరాలను చూద్దాం.

అంటుటు

ఓవరాల్‌గా అంటుటు టెస్టులో, రియల్మీ పీ2 ప్రో డివైజ్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే బెటర్ గా ఉంది. అయితే రెండింటి మధ్య తేడా స్వల్పమే. అంటుటు బ్రేక్‌డౌన్‌ని గమనిస్తే, సీపీయూ మరియు యూఎక్స్ పెర్ఫామెన్స్ విషయాల్లో రియల్మీ పీ2 ప్రో కంటే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బెటర్ గా ఉంది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో గ్రాఫిక్స్, మెమొరీ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంది. ఇది గేమింగ్ వంటి టాస్కులకు బాగా సరిపోతుంది.

విజేత: Realme P2 Pro 5G

గీక్‌బెంచ్

గీక్‌బెంచ్ టెస్టులో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉత్తమమైన ప్రదర్శన కనబరిచింది. సింగిల్-కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 2945 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో సింగిల్-కోర్ టెస్టులో 866 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 2930 పాయింట్లు స్కోర్ చేసింది. చిన్నపాటి టాస్కులను మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎంతో చురగ్గా హ్యాండిల్ చేస్తుందని తెలుస్తోంది. ఇక హెవీ టాస్కుల విషయంలో రెండు ఫోన్లు కూడా సమానంగా పని చేస్తాయి.

విజేత: Motorola Edge 50 Fusion

సీపీయూ థ్రాటిల్

సీపీయూ థ్రాటిల్ టెస్టు కోసం మేం బర్నవుట్ యాప్ వాడాం. ఈ టెస్టులో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, రియల్మీ పీ2 ప్రో ఫోన్లు రెండు కూడా సమానమైన ప్రదర్శనను కనబరిచాయి. టెస్టులో ఈ ఫోన్లు రఫ్ గా 76 శాతం స్కోరు నమోదు చేశాయి. అంటే ఈ ఫోన్లు, గ్రాఫిక్స్ తో కూడుకున్న గేమ్స్‌ను బాగా హ్యాండిల్ చేయగలవని రుజువైంది.

విజేత: సమానం

గేమింగ్

గేమింగ్ టెస్టులో రెండు స్మార్ట్‌ఫోన్ల యొక్క బెంచ్‌మార్క్ స్కోర్లు ఏ విధంగా ఉన్నాయో తెలిసింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదాన్ని 30 నిమిషాల చొప్పున రెండు ఫోన్లలో ఆడటం జరిగింది. ఆడే ముందు రెండు ఫోన్లలో ఒకే విధమైన గ్రాఫిక్స్ మరియు ఫ్రేమ్ రేట్ సెట్టింగ్స్ పెట్టాం.

              గేమింగ్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
బీజీఎంఐ యావరేజ్ ఎఫ్‌పీఎస్ 35.7
కాల్ ఆఫ్ డ్యూటీ యావరేజ్ ఎఫ్‌పీఎస్ 53.32
రియల్ రేసింగ్ యావరేజ్ ఎఫ్‌పీఎస్ 107.08

 

దురదృష్టవశాత్తు, మేం మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌ని మా ఫ్రేమ్ రేట్ యాప్ లో రన్ చేయలేక పోయాం. అయితే, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఫ్రేమ్ డ్రాప్ సమస్యలైతే లేవు. మూడు గేమ్స్‌ని స్మూథ్ గా హ్యాండిల్ చేసింది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో.. కాల్ ఆఫ్ డ్యూటీపై 53.32 యావరేజీ ఎఫ్‌పీఎస్, బీజీఎంఐ పై 35.74 యావరేజీ ఎఫ్‌పీఎస్ నమోదయ్యాయి. హై మరియు హెచ్డీఆర్ సెట్టింగ్స్ తో రెండు ఫోన్లలో ఆడగా, 60ఎఫ్‌పీఎస్ మార్క్ నుంచి డౌన్ అయ్యాయి.

            గేమింగ్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
బీజీఎంఐ టెంపరేచర్ పెరుగుదల 7.9 7.5
కాల్ ఆఫ్ డ్యూటీ టెంపరేచర్ పెరుగుదల 5.3 7.2
రియల్ రేసింగ్ టెంపరేచర్ పెరుగుదల 5.7 4.4

 

మొత్తం మీద, రియల్మీ పీ2 ప్రో, ఎడ్జ్ 50 ప్యూజన్ కంటే మంచి థర్మల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఈ హ్యాండ్సెట్ టెంపరేచర్ 18.9 డిగ్రీలకు పెరగగా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌ని 19.1 డిగ్రీలకు పెరిగింది. రియల్మీ పీ2 ప్రో లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ఉండటం ప్లస్ అయ్యింది. దీని ద్వారా పెర్ఫామెన్స్ బాగుండటంతో పాటు, థర్మల్ థ్రాట్లింగ్ అనేది కంట్రోల్ లో ఉంది.

విజేత: Realme P2 Pro

ఏది బెటర్?

ఫలితాలను గమనిస్తే, రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య పెర్ఫామెన్స్ విషయంలో పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించడం లేదు. అయితే, రెండు ఫోన్లు కూడా వివిధ విభాగాల్లో మేటిగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మరియు మెమొరీ విషయంలో Realme P2 Pro బాగుంది. దీని ద్వారా గేమింగ్ మరియు ఇతర హెవీ టాస్కులు వేగంగా చేయబడతాయి. అలాగే రియల్మీ పీ2 ప్రోలో ఉన్న థర్మల్ ఎఫిషియన్సీ కూడా ఫోన్ స్థిరంగా పెర్ఫామ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

మరోవైపు, Motorola Edge 50 Fusion రోజువారీ టాస్కులను చకచకా చేసేస్తుంది. దీనికి గీక్‌బెంచ్ స్కోరే రుజువు.

చివరగా, మీ ప్రాధామ్యాలపై ఎంపిక ఆధారపడి ఉంటుంది. మీకు గేమింగ్, మల్టీ-టాస్కింగ్ ముఖ్యమైతే Realme P2 ను ఎంచుకోండి. రోజువారీ టాస్కులను వేగంగా చేసుకోవాలనుకుంటే Motorola Edge 50 Fusion ను ఎంపిక చేసుకోండి.

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: రూ.25,000 లోపు బడ్జెట్‌లో రెండింట్లో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/feed/ 0
Realme P2 Pro 5G సేల్ ప్రారంభం, రూ.3,000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-first-sale-discount-offers/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-first-sale-discount-offers/#respond Tue, 17 Sep 2024 06:22:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13533 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P2 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు (సెప్టెంబర్ 17) ఈ ఫోన్ మొదటిసారిగా సేల్‌కి వచ్చింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా కంపెనీ రూ.3,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme P2 Pro 5G ధర, ఆఫర్లు […]

The post Realme P2 Pro 5G సేల్ ప్రారంభం, రూ.3,000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడే Realme P2 Pro 5G ఫస్ట్ సేల్
  • రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్
  • 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P2 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు (సెప్టెంబర్ 17) ఈ ఫోన్ మొదటిసారిగా సేల్‌కి వచ్చింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా కంపెనీ రూ.3,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme P2 Pro 5G ధర, ఆఫర్లు

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ నేడు సాయంత్రం 6 గంటల నుంచి కంపెనీ వెబ్‌సైట్ మరియు షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు రూ.2,000 కూపన్ డిస్కౌంట్ తో నేడు 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో కొనుగోలు చేయవచ్చు. అన్ని వేరియంట్స్ కి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఈ డిస్కౌంట్ తో పాటు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 12జిబి ర్యామ్ మోడల్‌కి ఇది వర్తిస్తుంది. అలాగే, 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. Realme P2 Pro 5G డివైజ్‌ పారట్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme P2 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P2 Pro 5G లో 6.7-ఇంచ్ శాంసంగ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 93.2% స్క్రీన్-టు-బాడీ రేషియో, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, 1.07 బిలియన్ కలర్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% పీ3 కలర్ గ్యామట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

చిప్సెట్: Realme P2 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం 710 జీపీయూ వినియోగించారు. 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించారు. అంటుటు స్కోరు 6,70,441 పాయింట్లు.

ర్యామ్, స్టోరేజీ: Realme P2 Pro 5G డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Realme P2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme P2 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P2 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P2 Pro 5G లో రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, జీటీ మోడ్, ఎయిర్ జెశ్చర్, డ్యూయల్ స్టూడియో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హైపర్‌రా ఆల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro 5G సేల్ ప్రారంభం, రూ.3,000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-first-sale-discount-offers/feed/ 0
Realme P2 Pro 5G: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-launched-india-80w-fast-charging/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-launched-india-80w-fast-charging/#respond Fri, 13 Sep 2024 09:04:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=13474 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme P2 Pro 5G అనే స్మార్ట్‌‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ65 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి. సరే, ఓసారి రియల్మీ పీ2 ప్రో డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా? Realme P2 Pro 5G ధర, సేల్ […]

The post Realme P2 Pro 5G: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme P2 Pro 5G విడుదల
  • 5200 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme P2 Pro 5G అనే స్మార్ట్‌‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ65 రేటింగ్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి. సరే, ఓసారి రియల్మీ పీ2 ప్రో డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Realme P2 Pro 5G ధర, సేల్ వివరాలు

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధరను రూ.24,999 గా పెట్టారు. 12జిబి + 512జిబి మోడల్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, బేస్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్, ఇతర రెండు వేరియంట్స్ పై రూ.3,000 డిస్కౌంట్‌ను రియల్మీ అందిస్తోంది. దీంతో ఫోన్ల ధరలు వరుసగా రూ.19,999, రూ.21,999 మరియు రూ.24,999 చేరుతాయి.

ఎర్లీ బర్డ్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. సేల్ టైమ్ సాయంత్రం 6 గంటల నుంచి 8.00 గంటలు.

Realme P2 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P2 Pro 5G లో 6.7-ఇంచ్ శాంసంగ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 93.2% స్క్రీన్-టు-బాడీ రేషియో, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, 1.07 బిలియన్ కలర్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% పీ3 కలర్ గ్యామట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

చిప్సెట్: Realme P2 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం 710 జీపీయూ వినియోగించారు. 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించారు. అంటుటు స్కోరు 6,70,441 పాయింట్లు.

ర్యామ్, స్టోరేజీ: Realme P2 Pro 5G డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Realme P2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme P2 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P2 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P2 Pro 5G లో రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, జీటీ మోడ్, ఎయిర్ జెశ్చర్, డ్యూయల్ స్టూడియో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హైపర్‌రా ఆల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro 5G: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-launched-india-80w-fast-charging/feed/ 0
Realme P2 Pro 5G: ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-launch-date-confirmed/#respond Wed, 04 Sep 2024 08:04:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13338 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P2 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత్ లాంచ్ తేదీ ఖరారైంది. కొత్త టీజర్ ద్వారా రియల్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme P2 Pro 5G ఇండియా లాంచ్ తేదీ Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 13వ […]

The post Realme P2 Pro 5G: ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P2 Pro 5G విడుదల
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P2 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత్ లాంచ్ తేదీ ఖరారైంది. కొత్త టీజర్ ద్వారా రియల్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme P2 Pro 5G ఇండియా లాంచ్ తేదీ

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.

తాజాగా రియల్మీ విడుదల చేసిన టీజర్ లో ఈ ఫోన్ 80 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Realme P2 Pro 5G డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు స్పష్టమైంది.

Realme P2 Pro 5G డిజైన్

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ టీజర్ లో గ్రీన్ కలర్ లో కనిపించింది. దీంతో ఒక కలర్ వేరియంట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే కర్వ్డ్ డిజైన్, గోల్డెన్ ఫ్రేమ్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.

ఫోన్‌కి ముందువైపు, పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఇక బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ స్క్వేర్ షేప్ లో ఉంది. ఇందులో రెండు కెమెరాలు, ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Realme P2 Pro 5G వివరాలు (అంచనా)

91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.

రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro 5G: ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-launch-date-confirmed/feed/ 0
Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/#respond Thu, 29 Aug 2024 08:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13234 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా? Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్ త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ […]

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P2 Pro లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ RMX3987

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్

త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై RMX3987 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Realme P2 Pro అని అంచనా వేస్తున్నారు.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది.

Realme P2 Pro వివరాలు (అంచనా)

91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.

రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/feed/ 0