
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?
Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్
త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్ పై RMX3987 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Realme P2 Pro అని అంచనా వేస్తున్నారు.
బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.
అయితే బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది.

Realme P2 Pro వివరాలు (అంచనా)
91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.
Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.
రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.
భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Realme P1 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.
రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.











