Redmi K60 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 03 May 2024 06:06:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 24GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Redmi K60 Ultra https://www.91mobiles.com/telugu/redmi-k60-ultra-launched-china-price-specs-availability/ Mon, 14 Aug 2023 17:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=7601 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ చైనా మార్కెట్ లో Redmi K60 Ultra (రెడ్మీ కే60 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్) స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఈ డివైజ్ తో పాటు ఇంకా Xiaomi MIX Fold 3, Pad 6 Max, Band 8 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. Redmi K60 Ultra విషయానికి వస్తే, ఈ ఫోన్ మెరుగైన […]

The post 24GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Redmi K60 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 5 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచైన Redmi K60 Ultra
  • 24జిబి ర్యామ్ తో వచ్చిన టాప్ మోడల్
  • ప్రారంభ ధర CNY 2599 (సుమారు రూ.30,000)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ చైనా మార్కెట్ లో Redmi K60 Ultra (రెడ్మీ కే60 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్) స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఈ డివైజ్ తో పాటు ఇంకా Xiaomi MIX Fold 3, Pad 6 Max, Band 8 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. Redmi K60 Ultra విషయానికి వస్తే, ఈ ఫోన్ మెరుగైన ఫీచర్లు, స్పెక్స్ తో వచ్చింది. సరే, ఓసారి Redmi K60 Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi K60 Ultra ధర

Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ చైనాలో 5 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2599 (సుమారు రూ.30,000) గా ఉంది.
  • 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను CNY 2799 (సుమారు రూ.32,000) గా నిర్ణయించారు.
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ.34,500) గా ఉంది.
  • 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను CNY 3599 (సుమారు రూ.41,200) గా నిర్ణయించారు.
  • Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ గ్రీన్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 16 నుంచి ఈ డివైజ్ సేల్ మొదలవుతుంది.

Redmi K60 Ultra స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Redmi K60 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు. దీంతో పాటు x7 డిస్ప్లే చిప్ ని కూడా అందించారు.
  • మెమొరీ: Redmi K60 Ultra లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi K60 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 సెన్సర్ ని అందించారు.
  • బ్యాటరీ: Redmi K60 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్, వెయిట్: Redmi K60 Ultra డివైజ్ 162.15 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.49 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi K60 Ultra లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

The post 24GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Redmi K60 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, MIX Fold 3 లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-fold-3-pad-6-redmi-k60-ultra-to-launch-in-august/ Wed, 19 Jul 2023 05:59:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=7236 షావోమి ప్రెసిడెంట్ లు వీబింగ్ షావోమి తదుపరి ఫోల్డబుల్ ఫోన్ గురించి బిగ్ హింట్ ఇచ్చారు. కంపెనీ Xiaomi Pad 6 కి మ్యాక్స్ వర్షన్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇది ఐప్యాడ్ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా లైనప్ కి గట్టి పోటీ ఇచ్చేందుకేనని అర్థమవుతోంది. Xiaomi Pad 6 Max రీసెంట్ గా బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్, చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై […]

The post రివీలైన Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, MIX Fold 3 లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో ఆగస్టులో లాంచ్ కానున్న డివైజెస్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న ప్యాడ్ 6 మ్యాక్స్
  • కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీలో తయారు కానున్న Xiaomi MIX Fold 3

షావోమి ప్రెసిడెంట్ లు వీబింగ్ షావోమి తదుపరి ఫోల్డబుల్ ఫోన్ గురించి బిగ్ హింట్ ఇచ్చారు. కంపెనీ Xiaomi Pad 6 కి మ్యాక్స్ వర్షన్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇది ఐప్యాడ్ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా లైనప్ కి గట్టి పోటీ ఇచ్చేందుకేనని అర్థమవుతోంది. Xiaomi Pad 6 Max రీసెంట్ గా బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్, చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. రెండు లిస్టింగ్స్ కూడా దాదాపుగా ఒకే విధమైన వివరాలను అందించాయి. Mix Fold 3 లాంచ్ ఈవెంట్ పలు ఉత్పత్తులను షావోమి లాంచ్ చేయనుందని Xiaomiui ఒక కథనాన్ని వెలువరించింది.

Xiaomi MIX Fold 3 లాంచ్ టైమ్ లైన్ గురించి అడిగినప్పుడు, చైనాలో ఆగస్టులో లాంచ్ ఉంటుందని వీబింగ్ తెలిపారు. ఈ డివైజ్ రీసెంట్ గా చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. మరోవైపు Xiaomiui తన కథనంలో Redmi K60 Ultra లాంచ్ కూడా ఆగస్టులో ఉంటుందని తెలిపింది.

Xiaomi MIX Fold 3 స్పెసిఫికేషన్స్

  • చార్జింగ్: Xiaomi MIX Fold 3 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. ఇంకా ఫ్లాగ్షిప్ షావోమి డివైజెస్ మాదిరి Xiaomi MIX Fold 3 డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని సమాచారం.
  • తయారీ: Xiaomi MIX Fold 3 డివైజ్ చైనాలోని సరికొత్త స్మార్ట్ ఫ్యాక్టరీలో తయారు కానుందని షావోమి ప్రెసిడెంట్ వెల్లడించారు. కొత్త ప్యాక్టరీ ద్వారా డివైజెస్ బిల్డ్-క్వాలిటీ కూడా మెరుగు కానుందని ఆయన అన్నారు.
  • చిప్సెట్: గత లీక్ తో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, Xiaomi MIX Fold 3 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానున్నట్లు తెలిపింది.
  • కెమెరా: Xiaomi MIX Fold 3 డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్858 ప్రైమరీ సెన్సర్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఈ డివైజ్ అల్ట్రావైడ్ లెన్స్, టెలీఫోటో లెన్స్, పెరిస్కోప్ లెన్స్ తో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • సెక్యూరిటీ: భద్రత కోసం Xiaomi MIX Fold 3 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండనుంది.

The post రివీలైన Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, MIX Fold 3 లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>