
షావోమి ప్రెసిడెంట్ లు వీబింగ్ షావోమి తదుపరి ఫోల్డబుల్ ఫోన్ గురించి బిగ్ హింట్ ఇచ్చారు. కంపెనీ Xiaomi Pad 6 కి మ్యాక్స్ వర్షన్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇది ఐప్యాడ్ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా లైనప్ కి గట్టి పోటీ ఇచ్చేందుకేనని అర్థమవుతోంది. Xiaomi Pad 6 Max రీసెంట్ గా బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్, చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. రెండు లిస్టింగ్స్ కూడా దాదాపుగా ఒకే విధమైన వివరాలను అందించాయి. Mix Fold 3 లాంచ్ ఈవెంట్ పలు ఉత్పత్తులను షావోమి లాంచ్ చేయనుందని Xiaomiui ఒక కథనాన్ని వెలువరించింది.
Xiaomi MIX Fold 3 లాంచ్ టైమ్ లైన్ గురించి అడిగినప్పుడు, చైనాలో ఆగస్టులో లాంచ్ ఉంటుందని వీబింగ్ తెలిపారు. ఈ డివైజ్ రీసెంట్ గా చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. మరోవైపు Xiaomiui తన కథనంలో Redmi K60 Ultra లాంచ్ కూడా ఆగస్టులో ఉంటుందని తెలిపింది.
Xiaomi MIX Fold 3 స్పెసిఫికేషన్స్
- చార్జింగ్: Xiaomi MIX Fold 3 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. ఇంకా ఫ్లాగ్షిప్ షావోమి డివైజెస్ మాదిరి Xiaomi MIX Fold 3 డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని సమాచారం.
- తయారీ: Xiaomi MIX Fold 3 డివైజ్ చైనాలోని సరికొత్త స్మార్ట్ ఫ్యాక్టరీలో తయారు కానుందని షావోమి ప్రెసిడెంట్ వెల్లడించారు. కొత్త ప్యాక్టరీ ద్వారా డివైజెస్ బిల్డ్-క్వాలిటీ కూడా మెరుగు కానుందని ఆయన అన్నారు.
- చిప్సెట్: గత లీక్ తో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, Xiaomi MIX Fold 3 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానున్నట్లు తెలిపింది.
- కెమెరా: Xiaomi MIX Fold 3 డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్858 ప్రైమరీ సెన్సర్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఈ డివైజ్ అల్ట్రావైడ్ లెన్స్, టెలీఫోటో లెన్స్, పెరిస్కోప్ లెన్స్ తో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
- సెక్యూరిటీ: భద్రత కోసం Xiaomi MIX Fold 3 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండనుంది.











