Redmi Note 11R - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 30 Sep 2022 13:19:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 700 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Redmi Note 11R https://www.91mobiles.com/telugu/redmi-note-11r-launched-china-specs-price/ Fri, 30 Sep 2022 13:19:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=2683 హైలైట్స్: చైనాలో లాంచ్ అయిన Redmi Note 11R మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ తో వస్తున్న హ్యాండ్సెట్ Poco M4 5G ని రీబ్రాండ్ చేసి Redmi Note 11R పేరుతో చైనాలో వదిలిన షావోమీ Xiaomi కంపెనీ రెడ్మీ నోట్ 11 సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేసింది. చైనాలో Redmi Note 11R ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది భారత్ లో లాంచ్ అయిన పోకో ఎమ్4 5జీ ఫోన్ […]

The post MediaTek Dimensity 700 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Redmi Note 11R first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనాలో లాంచ్ అయిన Redmi Note 11R
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ తో వస్తున్న హ్యాండ్సెట్
  • Poco M4 5G ని రీబ్రాండ్ చేసి Redmi Note 11R పేరుతో చైనాలో వదిలిన షావోమీ

Xiaomi కంపెనీ రెడ్మీ నోట్ 11 సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేసింది. చైనాలో Redmi Note 11R ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది భారత్ లో లాంచ్ అయిన పోకో ఎమ్4 5జీ ఫోన్ కి రీబ్రాండ్ వర్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi Note 11R స్పెసిఫికేషన్స్ దాదాపు పోకో ఎమ్4 5జీ మాదిరే ఉన్నాయి.

Redmi Note 11R ధర, లభ్యత

Redmi Note 11R 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ CNY 1,299 (దాదాపు రూ.14,800) ధరతో చైనాలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర CNY 1,499 (దాదాపు రూ.17,200) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,699 (రూ.19,500) గా నిర్ణయించారు.

బ్లాక్, గ్రేట్, బ్లూ కలర్ వేరియంట్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతానికి Redmi Note 11R ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. మిగతా దేశాల్లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు. ఇక భారత్ లో ఇప్పటికే పోకో ఎమ్4 5జీ ఫోన్ ఉండటం వల్లన, Redmi Note 11R లాంచ్ అయ్యే అవకాశం లేదు.

Redmi Note 11R స్పెసిఫికేషన్స్

Redmi Note 11R లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.

Redmi Note 11R డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Redmi Note 11R లో 5ఎంపి కెమెరా ఉంది. Redmi Note 11R లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Redmi Note 11R లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. Redmi Note 11R 163.99 మిల్లీ మీటర్ల పొడవు, 76.09 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ బరువు 201 గ్రాములు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Dimensity 700 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Redmi Note 11R first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 30 న లాంచ్ అవుతోన్న Redmi Note 11R https://www.91mobiles.com/telugu/redmi-note-11r-launch-date-revealed-officially/ Thu, 29 Sep 2022 17:40:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=2664 హైలైట్స్: చైనా మార్కెట్ లో సెప్టెంబర్ 30, ఉదయం 10 గంటలకు లాంచ్ కానున్న Redmi Note 11R స్మార్ట్ ఫోన్ కంపెనీ షేర్ చేసిన పోస్టర్ ని బట్టి, POCO M4 5G లాగా కనిపిస్తోన్న Redmi Note 11R డిజైన్ 90 హెర్ట్జ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్న Redmi Note 11R డిజైన్ Redmi Note 11R త్వరలోనే నోట్ 11 లైనప్ లో చేరబోతోంది. ఇప్పటికే ఈ లైనప్ […]

The post సెప్టెంబర్ 30 న లాంచ్ అవుతోన్న Redmi Note 11R first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనా మార్కెట్ లో సెప్టెంబర్ 30, ఉదయం 10 గంటలకు లాంచ్ కానున్న Redmi Note 11R స్మార్ట్ ఫోన్
  • కంపెనీ షేర్ చేసిన పోస్టర్ ని బట్టి, POCO M4 5G లాగా కనిపిస్తోన్న Redmi Note 11R డిజైన్
  • 90 హెర్ట్జ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్న Redmi Note 11R డిజైన్

Redmi Note 11R త్వరలోనే నోట్ 11 లైనప్ లో చేరబోతోంది. ఇప్పటికే ఈ లైనప్ లో రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11 ప్రో+, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11ఎస్, రెడ్మీ నోట్ 11ఎస్ఈ ఫోన్లు ఉన్నాయి. షావోమీ కంపెనీ చైనాలో Redmi Note 11R లాంచ్ తేదీని ప్రకటించింది. Redmi Note 11R సెప్టెంబర్ 30 తేదీన, శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు లాంచ్ అవుతోంది. రెడ్మీ షేర్ చేసిన పోస్టర్ లో Redmi Note 11R యొక్క డిజైన్ POCO M4 5G ఫోన్ ని పోలి ఉంది. Redmi Note 11R 90 హెర్ట్జ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీతో వస్తోందని కంపెనీ వెల్లడించింది.

Redmi Note 11R స్మార్ట్ ఫోన్ POCO M4 5G యొక్క రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే, POCO M4 5G కూడా Redmi Note 11E ని పోలి ఉంది. మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన Redmi Note 11E ని గ్లోబల్ గా POCO M4 5G అనే పేరుతో లాంచ్ చేయనున్నారని సమాచారం.

చూశారు కదా, ఒకే ఫోన్ ని అటు తిప్పి ఇటు తిప్పి వేరే పేరుతో జనాల ముందుకు వదులుతోంది షావోమీ/రెడ్మీ. ఏదేమైతేనేం, షావోమీ, రెడ్మీ ఫోన్లకు ఇటు భారత్ లో అటు ప్రపంచ వ్యాప్తంగా మాంచి గిరాకీ ఉన్న మాట నిజం. కస్టమర్ కి వాల్యూ ఫర్ మనీ ఫోన్ దొరికితే చాలు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సరే, ఇప్పుడు Redmi Note 11R విషయానికి వస్తే, ఇంకా ఈ ఫోన్ ధరని కంపెనీ వెల్లడించలేదు.

 

Redmi Note 11R స్పెసిఫికేషన్స్

Redmi Note 11R స్మార్ట్ ఫోన్ POCO M4 5G కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, ఫీచర్లు కూడా అలాగే ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు. Redmi Note 11R లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్, 18 వాట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ ఉండనున్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi Note 11R లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post సెప్టెంబర్ 30 న లాంచ్ అవుతోన్న Redmi Note 11R first appeared on 91Mobiles Telugu.

]]>
చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయిన Redmi Note 11R ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-11r-specs-design-spotted-china-telecom-website/ Tue, 27 Sep 2022 05:46:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=2586 హైలైట్స్: త్వరలో లాంచ్ కానున్న Redmi Note 11R 22095RA98C మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్, తొలుత చైనాలో లాంచ్ అయ్యే అవకాశం 6.58-ఇంచ్ డిస్ప్లే, 13ఎంపి డ్యూయల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Redmi Note 11R Redmi Note 11 సిరీస్ లో ఇప్పటికే పలు మోడళ్ళు మార్కెట్ లో ఉన్నాయి. అవి: రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11 ప్రో+, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11ఎస్, […]

The post చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయిన Redmi Note 11R ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 11R
  • 22095RA98C మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్, తొలుత చైనాలో లాంచ్ అయ్యే అవకాశం
  • 6.58-ఇంచ్ డిస్ప్లే, 13ఎంపి డ్యూయల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Redmi Note 11R

Redmi Note 11 సిరీస్ లో ఇప్పటికే పలు మోడళ్ళు మార్కెట్ లో ఉన్నాయి. అవి: రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11 ప్రో+, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11ఎస్, రెడ్మీ నోట్ 11 ఎస్ఈ. అయితే, త్వరలో ఈ బ్రాండ్ నుంచి Redmi Note 11R అనే ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈ విషయం చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇకపోతే ఈ ఫోన్ 22095RA98C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. మోడల్ నంబర్ లో కనిపిస్తోన్న C అనే అక్షరం చైనా వర్షన్ ని సూచిస్తుంది.

చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో కనిపించిన మోడల్, Redmi Note 11R అని అంచనా వేస్తున్నారు. ఇదివరకు ఈ ఫోన్ Redmi 11A అనే పేరుతో లాంచ్ అవుతుందని అనుకున్నారు. ఇక Redmi Note 11R భారత ఎంట్రీ పై అప్పుడే ఏ విషయం కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ లాంచ్ అయితే కనుక, రీబ్రాండ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi Note 11R ధర (లీక్డ్)

Redmi Note 11R చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో 22095RA98C అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ మొత్తం 3 వర్షన్స్ లో లభించనుందని అర్థమవుతోంది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. ఫోన్ ధర RMB 1299 (దాదాపు రూ.14,800) గా లిస్ట్ కాబడింది. అయితే అఫీషియల్ ప్రైస్ వేరేగా ఉండవచ్చు.

Redmi Note 11R స్పెసిఫికేషన్స్

Redmi Note 11R 6.58-ఇంచ్ డిస్ప్లే తో వస్తున్నట్లు సమాచారం. రెండర్ ఇమేజ్ ని బట్టి, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. భారీ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇటువంటి కెమెరా ఐల్యాండ్ ని మనం పోకో ఫోన్లలో చూశాం. ఇకపోతే రియర్ కెమెరాల్లో 13ఎంపి మెయిన్ సెన్సర్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ లో 5ఎంపి కెమెరా ఉండనుంది.

Redmi Note 11R ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ని చూస్తే, ఇదొక బడ్జెట్ 4జీ ఫోన్ అని తెలుస్తోంది. ఫోన్ ఏ చిప్ తో వస్తుందో ఇంకా తెలియలేదు. తొలుత చైనాలో లాంచ్ అయి తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి Redmi Note 11R ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

The post చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయిన Redmi Note 11R ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>