హైలైట్స్:
- చైనా మార్కెట్ లో సెప్టెంబర్ 30, ఉదయం 10 గంటలకు లాంచ్ కానున్న Redmi Note 11R స్మార్ట్ ఫోన్
- కంపెనీ షేర్ చేసిన పోస్టర్ ని బట్టి, POCO M4 5G లాగా కనిపిస్తోన్న Redmi Note 11R డిజైన్
- 90 హెర్ట్జ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్న Redmi Note 11R డిజైన్

Redmi Note 11R త్వరలోనే నోట్ 11 లైనప్ లో చేరబోతోంది. ఇప్పటికే ఈ లైనప్ లో రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11 ప్రో+, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11ఎస్, రెడ్మీ నోట్ 11ఎస్ఈ ఫోన్లు ఉన్నాయి. షావోమీ కంపెనీ చైనాలో Redmi Note 11R లాంచ్ తేదీని ప్రకటించింది. Redmi Note 11R సెప్టెంబర్ 30 తేదీన, శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు లాంచ్ అవుతోంది. రెడ్మీ షేర్ చేసిన పోస్టర్ లో Redmi Note 11R యొక్క డిజైన్ POCO M4 5G ఫోన్ ని పోలి ఉంది. Redmi Note 11R 90 హెర్ట్జ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీతో వస్తోందని కంపెనీ వెల్లడించింది.
Redmi Note 11R స్మార్ట్ ఫోన్ POCO M4 5G యొక్క రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే, POCO M4 5G కూడా Redmi Note 11E ని పోలి ఉంది. మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన Redmi Note 11E ని గ్లోబల్ గా POCO M4 5G అనే పేరుతో లాంచ్ చేయనున్నారని సమాచారం.
చూశారు కదా, ఒకే ఫోన్ ని అటు తిప్పి ఇటు తిప్పి వేరే పేరుతో జనాల ముందుకు వదులుతోంది షావోమీ/రెడ్మీ. ఏదేమైతేనేం, షావోమీ, రెడ్మీ ఫోన్లకు ఇటు భారత్ లో అటు ప్రపంచ వ్యాప్తంగా మాంచి గిరాకీ ఉన్న మాట నిజం. కస్టమర్ కి వాల్యూ ఫర్ మనీ ఫోన్ దొరికితే చాలు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సరే, ఇప్పుడు Redmi Note 11R విషయానికి వస్తే, ఇంకా ఈ ఫోన్ ధరని కంపెనీ వెల్లడించలేదు.

Redmi Note 11R స్పెసిఫికేషన్స్
Redmi Note 11R స్మార్ట్ ఫోన్ POCO M4 5G కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, ఫీచర్లు కూడా అలాగే ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు. Redmi Note 11R లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్, 18 వాట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ ఉండనున్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi Note 11R లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











