Redmi Note 13R Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 Nov 2023 10:29:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 108MP కెమెరాతో చైనాలో లాంచైన Redmi Note 13R Pro https://www.91mobiles.com/telugu/redmi-note-13r-pro-launched-china-price-specs-availability/ Mon, 20 Nov 2023 10:29:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8900 షావోమి సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi Note 13R Pro ని లాంచ్ చేసింది. ఇప్పటికే సెప్టెంబర్ లో Redmi Note 13 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro, Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. నేడు, కంపెనీ Redmi Note 13R Pro అనే మరొక మోడల్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి Redmi Note 13R Pro […]

The post 108MP కెమెరాతో చైనాలో లాంచైన Redmi Note 13R Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Redmi Note 13R Pro
  • 12జిబి ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Redmi Note 13R Pro ధర 1,999 యువాన్లు

షావోమి సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi Note 13R Pro ని లాంచ్ చేసింది. ఇప్పటికే సెప్టెంబర్ లో Redmi Note 13 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro, Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. నేడు, కంపెనీ Redmi Note 13R Pro అనే మరొక మోడల్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి Redmi Note 13R Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13R Pro ధర, కలర్ ఆప్షన్స్

  • చైనాలో Redmi Note 13R Pro డివైజ్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ లో లాంచ్ అయ్యింది. అది 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. దీని ధరను 1,999 యువాన్లుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.23,000 గా ఉండవచ్చు.
  • Redmi Note 13R Pro డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైమ్ బ్లూ మరియు మార్నింగ్ లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Redmi Note 13R Pro డివైజ్ POCO X6 Neo పేరుతో లాంచ్ కానుంది. ఇంకా పోకో ఎక్స్6 నియో ఫోన్ లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13R Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13R Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13R Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి 3-ఎక్స్ జూమ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi Note 13R Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13R Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3 ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. Redmi Note 13R Pro లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.

The post 108MP కెమెరాతో చైనాలో లాంచైన Redmi Note 13R Pro first appeared on 91Mobiles Telugu.

]]>
చైనా టెలీకామ్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన Redmi Note 13R Pro డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-13r-pro-china-telecom-listing-specs-price-design/ Wed, 15 Nov 2023 16:44:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=8847 షావోమి సబ్-బ్రాండ్ Redmi ఈ ఏడాది మే నెలలో Redmi 12R Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ తో వచ్చింది. ఇప్పుడు రెడ్మీ సంస్థ, దీని సక్సెసర్ Redmi Note 13R Pro ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. 91మొబైల్స్ Redmi Note 13R Pro డివైజ్ ని చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై గుర్తించింది. […]

The post చైనా టెలీకామ్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన Redmi Note 13R Pro డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13R Pro
  • చైనా టెలీకామ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi ఈ ఏడాది మే నెలలో Redmi 12R Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ తో వచ్చింది. ఇప్పుడు రెడ్మీ సంస్థ, దీని సక్సెసర్ Redmi Note 13R Pro ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. 91మొబైల్స్ Redmi Note 13R Pro డివైజ్ ని చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై గుర్తించింది. ఇది మార్కెటింగ్ పేరుని ఖరారు చేయడమే గాక, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13R Pro డిజైన్

  • Redmi Note 13R Pro డివైజ్ ప్రీమియమ్ డిజైన్, గోల్డ్ కలర్ కలిగి ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. మిడ్నైట్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Redmi Note 13R Pro హ్యాండ్సెట్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, సన్నని బెజెల్స్ ఉన్నాయి.
  • వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంది.
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ మైక్రోఫోన్, స్పీకర్ వెంట్ బాటమ్ లో ఉన్నాయి.
  • Redmi Note 13R Pro బ్యాక్ ప్యానెల్ పై టాప్ లో భారీ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇందులో డ్యూయల్-కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే రెడ్మీ లోగో కూడా కనిపిస్తోంది.
  • ఫోన్ కి పై భాగంలో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్ కటౌట్ ఉన్నాయి.
  • ఫోన్ బాడీ బాక్సీ డిజైన్, రౌండెడ్ కార్నర్స్ తో ఉంది.

Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్

చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Redmi Note 13R Pro కి సంబంధించిన కొన్ని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

  • డిస్ప్లే: Redmi Note 13R Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13R Pro లో మీడియాటెక్ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇంకా ప్రాసెసర్ వివరాలు తెలియలేదు.
  • మెమొరీ: Redmi Note 13R Pro లో 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Redmi Note 13R Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: లిస్టింగ్ ప్రకారం, Redmi Note 13R Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డైమెన్షన్స్: Redmi Note 13R Pro డివైజ్ 161.1 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 7.73 మి.మీ మందం, 174 గ్రాముల బరువు ఉంటుంది.

Redmi Note 13R Pro ధర

Redmi Note 13R Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 1,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ 20 న ఈ ఫోన్ లాంచ్ మరియు సేల్ ఉండే అవకాశం ఉంది.

The post చైనా టెలీకామ్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన Redmi Note 13R Pro డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>