చైనా టెలీకామ్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన Redmi Note 13R Pro డిజైన్, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13R Pro
  • చైనా టెలీకామ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi ఈ ఏడాది మే నెలలో Redmi 12R Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ తో వచ్చింది. ఇప్పుడు రెడ్మీ సంస్థ, దీని సక్సెసర్ Redmi Note 13R Pro ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. 91మొబైల్స్ Redmi Note 13R Pro డివైజ్ ని చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై గుర్తించింది. ఇది మార్కెటింగ్ పేరుని ఖరారు చేయడమే గాక, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13R Pro డిజైన్

  • Redmi Note 13R Pro డివైజ్ ప్రీమియమ్ డిజైన్, గోల్డ్ కలర్ కలిగి ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. మిడ్నైట్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Redmi Note 13R Pro హ్యాండ్సెట్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, సన్నని బెజెల్స్ ఉన్నాయి.
  • వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంది.
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ మైక్రోఫోన్, స్పీకర్ వెంట్ బాటమ్ లో ఉన్నాయి.
  • Redmi Note 13R Pro బ్యాక్ ప్యానెల్ పై టాప్ లో భారీ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇందులో డ్యూయల్-కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే రెడ్మీ లోగో కూడా కనిపిస్తోంది.
  • ఫోన్ కి పై భాగంలో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్ కటౌట్ ఉన్నాయి.
  • ఫోన్ బాడీ బాక్సీ డిజైన్, రౌండెడ్ కార్నర్స్ తో ఉంది.

Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్

చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Redmi Note 13R Pro కి సంబంధించిన కొన్ని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

  • డిస్ప్లే: Redmi Note 13R Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13R Pro లో మీడియాటెక్ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇంకా ప్రాసెసర్ వివరాలు తెలియలేదు.
  • మెమొరీ: Redmi Note 13R Pro లో 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Redmi Note 13R Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: లిస్టింగ్ ప్రకారం, Redmi Note 13R Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డైమెన్షన్స్: Redmi Note 13R Pro డివైజ్ 161.1 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 7.73 మి.మీ మందం, 174 గ్రాముల బరువు ఉంటుంది.

Redmi Note 13R Pro ధర

Redmi Note 13R Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 1,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ 20 న ఈ ఫోన్ లాంచ్ మరియు సేల్ ఉండే అవకాశం ఉంది.

Previous articleDimensity 6100 Plus చిప్‌తో Geekbench పై లిస్టైన Samsung Galaxy A15 5G
Next articleGeekbench పై లిస్టైన Realme GT 5 Pro; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.