Render - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Sep 2024 05:59:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/ https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/#respond Wed, 18 Sep 2024 05:59:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. OnePlus 13 డిజైన్ (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 […]

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

OnePlus 13 డిజైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

టిప్‌స్టర్ ప్రకారం, OnePlus 13 ఫోన్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.

టిప్‌స్టర్ తన పోస్ట్ లో వన్‌ప్లస్ 13 యొక్క రెండర్ కూడా షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.

యూనిక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది.

OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్

కొన్ని రోజుల క్రితం, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయీస్ లీ OnePlus 13 యొక్క లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. వచ్చే నెలలో వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని అర్థమవుతోంది. ఎందుకంటే, ఈ చిప్సెట్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు

కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

The post OnePlus 13: లాంచ్‌కి ముందు లీకైన వన్‌ప్లస్ 13 ఇమేజ్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-image-and-key-specs-leaked/feed/ 0
Moto G Stylus (2025): లాంచ్‌కి ముందు రివీలైన మోటో జీ స్టైలస్ (2025) రెండర్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/moto-g-stylus-2025-render-image-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/moto-g-stylus-2025-render-image-revealed-before-launch/#respond Fri, 23 Aug 2024 08:04:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=13129 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో జీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G Stylus (2025) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది మే నెలలో Moto G Stylus (2024) ని మోటోరోలా లాంచ్ చేసింది. అయితే ఇది గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. కానీ, భారత్ కి రాలేదు. ఇప్పుడు Moto G Stylus (2025) కూడా గ్లోబల్ మార్కెట్స్ […]

The post Moto G Stylus (2025): లాంచ్‌కి ముందు రివీలైన మోటో జీ స్టైలస్ (2025) రెండర్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G Stylus (2025) లాంచ్
  • తాజాగా రివీలైన డివైజ్ యొక్క డిజైన్
  • మోడల్ నంబర్ Kanas XT251V

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో జీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G Stylus (2025) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది మే నెలలో Moto G Stylus (2024) ని మోటోరోలా లాంచ్ చేసింది. అయితే ఇది గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. కానీ, భారత్ కి రాలేదు. ఇప్పుడు Moto G Stylus (2025) కూడా గ్లోబల్ మార్కెట్స్ కి పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఓసారి రివీలైన డిజైన్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Moto G Stylus (2025) డిజైన్ (లీక్)

My Smart Price తాజాగా Moto G Stylus (2025) యొక్క ఎక్స్‌క్లూజివ్ రెండర్ ఇమేజ్ ను తన కథనం ద్వారా పంచుకుంది.

Moto G Stylus (2025) డివైజ్ Kanas XT251V అనే మోడల్ నంబర్ తో నెట్టింట్లో ప్రత్యక్షమైంది.

డివైజ్ మోడల్ నంబర్ లోని 25 అనే నంబర్ వచ్చే ఏడాదిని సూచిస్తోందని అనుకోవచ్చు. ఇక డిజైన్ విషయానికి వస్తే, Moto G Stylus (2025) వీగన్ లెదర్ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.

ఫోన్ కి ముందువైపున పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఉన్నాయి.

గత మోడల్ మాదిరి, ఈ ఫోన్ లో కూడా బాటమ్ లో స్టైలస్ హోల్డర్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్ లో ఫోన్ కి టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై సెంటర్ లో మోటో లోగో ఉంటుంది.

రెండర్ ను గమనిస్తే, Moto G Stylus (2025) డివైజ్ బ్లూ కలర్ లో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Moto G Stylus (2024) స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Moto G Stylus (2024) లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Moto G Stylus (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

కెమెరా: Moto G Stylus (2024) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G Stylus (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Moto G Stylus (2025): లాంచ్‌కి ముందు రివీలైన మోటో జీ స్టైలస్ (2025) రెండర్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g-stylus-2025-render-image-revealed-before-launch/feed/ 0