
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్‌కి ముందు వన్‌ప్లస్ 13 యొక్క కలర్ ఆప్షన్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.
OnePlus 13 డిజైన్ (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి OnePlus 13 స్మార్ట్‌ఫోన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై షేర్ చేశారు.
టిప్‌స్టర్ ప్రకారం, OnePlus 13 ఫోన్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.
టిప్‌స్టర్ తన పోస్ట్ లో వన్‌ప్లస్ 13 యొక్క రెండర్ కూడా షేర్ చేశారు. దీన్ని గమనిస్తే, ఫోన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.
యూనిక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది.
OnePlus 13 more or less will look like this 😀
Green Color will most likely to come with Vegan leather back!Expected Specs :-
~6.82″ 2K OLED 10 bit 120 Hz LTPO BOE X2 micro quad curved display
~ Snapdragon 8 Gen 4
~50 MP LYT 808 1/1.4″ Main + 50 MP LYT 600 1/1.95″ Periscope… pic.twitter.com/kXKwUjw3Nf— Sanju Choudhary (@saaaanjjjuuu) September 17, 2024
OnePlus 13 లాంచ్ టైమ్‌లైన్
కొన్ని రోజుల క్రితం, వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయీస్ లీ OnePlus 13 యొక్క లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. వచ్చే నెలలో వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని అర్థమవుతోంది. ఎందుకంటే, ఈ చిప్సెట్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.
OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: OnePlus 13 లో 6.8-ఇంచ్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే క్వాడ్ కర్వ్డ్ బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1440*3168 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
చిప్సెట్: OnePlus 13 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. ఒ916టి హాప్టిక్ మోటర్ ను ఇందులో అందించనున్నారు
కెమెరా: OnePlus 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ-808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
సాఫ్ట్వేర్: OnePlus 13 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
ఇతర ఫీచర్లు: OnePlus 13 డివైజ్ ఐపీ68/ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం.











