Rs 199 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 12 Jul 2023 14:36:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? https://www.91mobiles.com/telugu/best-rs-199-prepaid-plan-available-india/ Wed, 12 Jul 2023 14:36:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=7175 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు. ఇలా నెలవారీ రీచార్జ్ […]

The post Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.200 లోపు ధరలో రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోన్న టెలీకామ్ సంస్థలు
  • ప్లాన్ తో లభించనున్న నెల రోజుల వ్యాలిడిటీ, కాలింగ్ ప్రయోజనాలు
  • టెలీకామ్ సంస్థలు అందిస్తోన్న రూ.199 ప్లాన్స్ లో ఉత్తమమైనది మీకోసం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు.

ఇలా నెలవారీ రీచార్జ్ చేసుకునేందుకు కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే, వినియోగదారులు నెలవారీ బడ్జెట్ ప్లాన్ ని కలిగి ఉంటారు. తమ ఫైనాన్షియల్ ప్లాన్ ప్రకారం, ప్రతీ నెలా తమకు సరిపడే రీచార్జ్ ని ఎంచుకుంటారు. ఇది సాధారణమైన విషయం. అయితే టెలీకామ్ సంస్థల వద్ద ఉన్న రూ.200 లోపు ప్లాన్స్ కి మాంచి గిరాకీ ఉంటుంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు అందించే ఏ ప్లాన్ బెటర్ గా ఉంటుందో తెలుసుకోండి.

బెస్ట్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్

Airtel రూ.199 ప్లాన్

ఎయిర్టెల్ సంస్థ రూ.199 విలువజేసే ప్లాన్ ని తన కస్టమర్ల కోసం అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, 3జిబి డేటా లభిస్తాయి. అంతే కాదు, ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి రూ.5 టాక్ టైమ్ కూడా లభిస్తుంది.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ రీచార్జ్ చేసే వారికి ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ యాప్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా సంగీతం, హలోట్యూన్స్, లైవ్ కన్సర్ట్స్, పాడ్‌కాస్ట్స్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్

జియో సంస్థ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా యూజర్ కి వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసే వారికి 23 రోజుల వ్యాలిడిటీ, 34.5జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా డెయిలీ 1.5జిబి వంతున 23 రోజుల వరకు ఇవ్వబడుతుంది. ఇంకా అపరిమితంగా ఏ నెట్వర్క్ కి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి.

Vodafone Idea రూ.199 ప్లాన్

వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు రూ.199 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతి రోజూ 1జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

వీఐ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్ కి వీఐ మూవీస్ అండ్ టీవీ కి ఉచిత బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ప్లాన్ రీచార్జ్ చేశాక 2జిబి ఎక్స్‌ట్రా డేటా లభిస్తుంది. అయితే దీని వ్యాలిడిటీ 3 రోజులు మాత్రమే. ఈ ఎక్స్‌ట్రా 2జిబి డేటా బెనిఫిట్ పొందాలంటే వీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BSNL రూ.199 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.199 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 2జిబి డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. డేటా పరిమితి దాటాక ప్రతి ఎంబి కి 25 పైసా ఖర్చవుతుంది.

The post Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? first appeared on 91Mobiles Telugu.

]]>
బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-brought-rs-199-rs-399-broadband-standby-plans/ Wed, 03 May 2023 11:29:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=6148 ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్ ని తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ధరలు రూ.199 మరియు రూ.399 గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం ఈ ప్లాన్స్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో ఈ ప్లాన్స్ వచ్చాయి. ఈ ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం పదండి. ఎయిర్టెల్ రూ.199 బ్రాడ్ బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.199 బ్రాడ్‌బ్యాండ్ […]

The post బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం కొత్త ప్లాన్లను తెచ్చిన ఎయిర్టెల్
  • బ్రాండ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో వచ్చిన కొత్త ప్లాన్స్
  • కొత్త ప్లాన్ల ధరలు రూ.199 మరియు రూ.399

ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్ ని తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ధరలు రూ.199 మరియు రూ.399 గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం ఈ ప్లాన్స్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో ఈ ప్లాన్స్ వచ్చాయి. ఈ ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ రూ.199 బ్రాడ్ బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.199 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటాతో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అంతేకాదు, ఉచిత రూటర్ ని కూడా కంపెనీ అందిస్తోంది. మరి ఈ ప్లాన్ తీరుతెన్నులు, ఇతర చార్జీలు, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో క్రింద వివరంగా ఇచ్చాం. ఓసారి చదివేయండి.

  • రూ.199 ప్లాన్ ద్వారా అపరిమిత డేటా లభిస్తుంది. ఇంకా 10ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.
  • కస్టమర్లు ఈ ఎంట్రీ లెవెల్ ప్లాన్ ని 5 నెలల కాలపరిమితితో తీసుకోవాల్సి ఉంటుంది. దానికి యూజర్లు జీఎస్టీ తో కలుపుకుని మొత్తం రూ.1174 చెల్లించాల్సి ఉంటుంది.
  • దీంతో పాటు కస్టమర్లు ఈ ప్లాన్ కోసం రూ.500 ఇన్‌స్టలేషన్ చార్జ్ మరియు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.
  • ఈ ప్లాన్ ని కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ ఉచితంగా రూటర్ ని అందించనుంది.

ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా తో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలేంటో క్రింద అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

  • ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ 10ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తుంది.
  • ఎక్స్‌ట్రిమ్ బాక్స్, ఉచిత వై-ఫై రూటర్ మరియు 350 కి పైగా టీవీ చానల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
  • ఈ ప్లాన్ ని కూడా కస్టమర్లు కనీసం 5 నెలల కాలపరిమితితో తీసుకోవాల్సి ఉంటుంది.
  • వన్‌ టైమ్ ఇన్‌స్టలేషన్ చార్జ్ మరియు జీఎస్టీ కలుపుకుని ఈ ప్లాన్ ధర రూ.3,000 అవుతుంది.

రెండు ప్లాన్లలో కాలింగ్ ఉచితం

కంపెనీ అందించే డేటాతో పాటు, ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్లు బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంతేకాదు, ప్లాన్ లో అందుబాటులో ఉన్న ఇతర స్పీడ్స్ కి ఎప్పుడైనా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. అంటే మీ ప్లాన్ ని మీకు నచ్చినప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఎయిర్టెల్ తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? మరొకసారి ప్లాన్ల ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపోయే ప్లాన్ ఏదో దానిని ప్రయత్నించండి.

The post బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>