Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది?

Highlights

  • రూ.200 లోపు ధరలో రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోన్న టెలీకామ్ సంస్థలు
  • ప్లాన్ తో లభించనున్న నెల రోజుల వ్యాలిడిటీ, కాలింగ్ ప్రయోజనాలు
  • టెలీకామ్ సంస్థలు అందిస్తోన్న రూ.199 ప్లాన్స్ లో ఉత్తమమైనది మీకోసం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు.

ఇలా నెలవారీ రీచార్జ్ చేసుకునేందుకు కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే, వినియోగదారులు నెలవారీ బడ్జెట్ ప్లాన్ ని కలిగి ఉంటారు. తమ ఫైనాన్షియల్ ప్లాన్ ప్రకారం, ప్రతీ నెలా తమకు సరిపడే రీచార్జ్ ని ఎంచుకుంటారు. ఇది సాధారణమైన విషయం. అయితే టెలీకామ్ సంస్థల వద్ద ఉన్న రూ.200 లోపు ప్లాన్స్ కి మాంచి గిరాకీ ఉంటుంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు అందించే ఏ ప్లాన్ బెటర్ గా ఉంటుందో తెలుసుకోండి.

బెస్ట్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్

Airtel రూ.199 ప్లాన్

ఎయిర్టెల్ సంస్థ రూ.199 విలువజేసే ప్లాన్ ని తన కస్టమర్ల కోసం అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, 3జిబి డేటా లభిస్తాయి. అంతే కాదు, ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి రూ.5 టాక్ టైమ్ కూడా లభిస్తుంది.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ రీచార్జ్ చేసే వారికి ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ యాప్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా సంగీతం, హలోట్యూన్స్, లైవ్ కన్సర్ట్స్, పాడ్‌కాస్ట్స్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్

జియో సంస్థ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా యూజర్ కి వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసే వారికి 23 రోజుల వ్యాలిడిటీ, 34.5జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా డెయిలీ 1.5జిబి వంతున 23 రోజుల వరకు ఇవ్వబడుతుంది. ఇంకా అపరిమితంగా ఏ నెట్వర్క్ కి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి.

Vodafone Idea రూ.199 ప్లాన్

వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు రూ.199 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతి రోజూ 1జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

వీఐ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్ కి వీఐ మూవీస్ అండ్ టీవీ కి ఉచిత బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ప్లాన్ రీచార్జ్ చేశాక 2జిబి ఎక్స్‌ట్రా డేటా లభిస్తుంది. అయితే దీని వ్యాలిడిటీ 3 రోజులు మాత్రమే. ఈ ఎక్స్‌ట్రా 2జిబి డేటా బెనిఫిట్ పొందాలంటే వీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BSNL రూ.199 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.199 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 2జిబి డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. డేటా పరిమితి దాటాక ప్రతి ఎంబి కి 25 పైసా ఖర్చవుతుంది.