Rs 199 Prepaid Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 18 Nov 2022 13:00:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్? https://www.91mobiles.com/telugu/airtel-jio-rs-199-prepaid-plan-comparison/ Fri, 18 Nov 2022 13:00:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=3532 హైలైట్స్ పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేస్తోన్న జియో, ఎయిర్టెల్ రెండు నెట్వర్క్స్ లోనూ అందుబాటులో ఉన్న రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ జియో రూ.199 ప్లాన్ తో 23 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ భారతదేశంలో ఉన్న ప్రధాన టెలీకామ్ సంస్థల్లో తరచూ ఎయిర్టెల్ మరియు జియోల మధ్య పోటీ ఉంటుంది. ఇది సహజమే. ప్రస్తుతం యూజర్ల పరంగా జియో నెం.1 స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ […]

The post Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేస్తోన్న జియో, ఎయిర్టెల్
  • రెండు నెట్వర్క్స్ లోనూ అందుబాటులో ఉన్న రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్
  • జియో రూ.199 ప్లాన్ తో 23 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ

భారతదేశంలో ఉన్న ప్రధాన టెలీకామ్ సంస్థల్లో తరచూ ఎయిర్టెల్ మరియు జియోల మధ్య పోటీ ఉంటుంది. ఇది సహజమే. ప్రస్తుతం యూజర్ల పరంగా జియో నెం.1 స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రీసెంట్ గా ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇదివరకు కూడా ఇదే ధరలో ప్లాన్ ఉండేది. కానీ, ఈసారి తెచ్చిన ప్లాన్ విభిన్నమైనది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది 24 లేదా 28 రోజుల వ్యాలిడిటీతో రాలేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. దీంతో ఈ ప్లాన్ పై అందరి దృష్టి పడింది.

ఇక్కడ విషయమేంటంటే, రూ.199 ధరలో జియో లో కూడా ఓ ప్లాన్ ఉంది. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 24 రోజులు మాత్రమే. అయితే బెనిఫిట్స్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం ఎయిర్టెల్ రూ.199 మరియు జియో రూ.199 ప్లాన్స్ మధ్య ఏది ఉత్తమమైనదో తేల్చేద్దాం. పదండి మరి.

Airtel రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

డేటా: Airtel యొక్క కొత్త రూ. 199 ప్లాన్ గురించి మాట్లాడితే, ఇది ఇంటర్నెట్ వినియోగం కోసం మీకు మొత్తం 3GB డేటాను అందజేస్తుంది. అలాగే, డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోదగిన విషయమేంటంటే, ఇది రోజువారీ డేటా ప్లాన్ కాదు.

వ్యాలిడిటీ మరియు ఎస్ఎంఎస్ లు: వినియోగదారులు ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా మొత్తం 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు, ఇది ఈ ప్లాన్ యొక్క హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే ప్లాన్‌లో మీరు మొత్తం 300 ఉచిత SMSలను పొందుతారు.

ఉచిత కాలింగ్: అంతే కాదండోయ్.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో మీరు అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా పొందుతారు. ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలో ట్యూన్స్ మరియు ఉచితంగా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

డేటా: Jio రూ. 199 ప్లాన్‌ ద్వారా కంపెనీ ప్రతిరోజూ 1.5 GB డేటాను అందిస్తోంది. అంటే కాలపరిమితి పూర్తయ్యే నాటికి మీరు ఈ ప్లాన్ ద్వారా మొత్తం 34.5 GB 4G డేటాను పొందుతారు.

వ్యాలిడిటీ మరియు SMS: ఈ ప్లాన్ ద్వారా 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే, కంపెనీ మీకు రోజుకు 100 SMSలను కూడా ఇస్తుంది.

ఉచిత కాలింగ్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా కస్టమర్‌లు అన్ని నెట్‌వర్క్‌ లకు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.199 ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-launches-rs-199-plan-with-30-days-validity/ Thu, 10 Nov 2022 09:14:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=3363 హైలైట్స్ కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Airtel గతంలో కూడా రూ.199 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్ తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.199 ప్లాన్ ని పరిచయం చేస్తోన్న దిగ్గజ టెలీకామ్ కంపెనీ భారత దేశంలో దిగ్గజ టెలీకామ్ కంపెనీ అయిన Airtel తాజాగా రూ.199 విలువజేసే ప్రీపెయిడ్ ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఎటువంటి హడావుడి లేకుండా మెల్లగా ఈ ప్లాన్ ని ప్రవేశపెట్టింది […]

The post 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.199 ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Airtel
  • గతంలో కూడా రూ.199 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్
  • తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.199 ప్లాన్ ని పరిచయం చేస్తోన్న దిగ్గజ టెలీకామ్ కంపెనీ

భారత దేశంలో దిగ్గజ టెలీకామ్ కంపెనీ అయిన Airtel తాజాగా రూ.199 విలువజేసే ప్రీపెయిడ్ ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఎటువంటి హడావుడి లేకుండా మెల్లగా ఈ ప్లాన్ ని ప్రవేశపెట్టింది ఎయిర్టెల్. 2021 లో టారిఫ్ పెరగక ముందు ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ పై 24 రోజుల వ్యాలిడిటీ మరియు 1జిబి డెయిలీ డేటాను అందించింది. తర్వాత జియో 1.5జిబి ఆఫర్ చేస్తుండటంతో, ఎయిర్టెల్ కూడా 1.5జిబి డెయిలీ డేటా ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ కి మార్పులు చేసింది. రూ.199 ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది.

Airtel రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా Airtel రూ.199 ప్లాన్ ని వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. యూజర్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ఏకమొత్తంగా 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం ఈ ప్లాన్ ద్వారా లభించనుంది. అంతేకాదండోయ్ ఈ ప్లాన్ తో 300 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. ఇంకా ఎయిర్టెల్ థాంక్స్, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు యూజర్లు పొందవచ్చు.

ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉపయోగించుకున్న తర్వాత ఒక లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఒక ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 ఖర్చవుతుంది. ఇక డేటా విషయానికి వస్తే, 1 ఎంబి కి 50 పైసలు ఖర్చవుతుంది. వాడుకోని డేటా, ఎస్ఎంఎస్ లు ప్లాన్ ముగియు రోజున ఎక్స్‌పైర్ అవుతాయి. అదే ప్లాన్ ని మళ్ళీ రీచార్జ్ చేసినప్పటికీ వాడబడని డేటా, ఎస్ఎంఎస్ లు క్యారీ ఫార్వార్డ్ చేయబడవు. కాబట్టి ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

ఇటీవలి కాలంలో Airtel నుంచి కొత్త ప్లాన్స్ ఏమీ రాలేదు. తాజాగా వచ్చిన రూ.199 ప్లాన్ ఓ వర్గం యూజర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా ఈ రీచార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తుండటం విశేషం. వ్యాలిడిటీతో పాటు నామమాత్రపు డేటా, ఎస్ఎంఎస్ లు కావాలని కోరుకునే వారికి ఈ ఆఫర్ సరైందని చెప్పవచ్చు. మీరు గనుక రూ.200 లోపు ఒక చక్కటి రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ని ప్రయత్నించండి.

Airtel రూ.199 ప్లాన్ బెనిఫిట్స్

  • 30 రోజుల వ్యాలిడిటీ
  • 3జిబి ఏకమొత్తం డేటా
  • 300 ఏకమొత్తం ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్
  • థాంక్స్ యాప్, వింక్ మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్స్ ప్రయోజనాలు

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.199 ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>