Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్?

హైలైట్స్

  • పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేస్తోన్న జియో, ఎయిర్టెల్
  • రెండు నెట్వర్క్స్ లోనూ అందుబాటులో ఉన్న రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్
  • జియో రూ.199 ప్లాన్ తో 23 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ

భారతదేశంలో ఉన్న ప్రధాన టెలీకామ్ సంస్థల్లో తరచూ ఎయిర్టెల్ మరియు జియోల మధ్య పోటీ ఉంటుంది. ఇది సహజమే. ప్రస్తుతం యూజర్ల పరంగా జియో నెం.1 స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రీసెంట్ గా ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇదివరకు కూడా ఇదే ధరలో ప్లాన్ ఉండేది. కానీ, ఈసారి తెచ్చిన ప్లాన్ విభిన్నమైనది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది 24 లేదా 28 రోజుల వ్యాలిడిటీతో రాలేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. దీంతో ఈ ప్లాన్ పై అందరి దృష్టి పడింది.

ఇక్కడ విషయమేంటంటే, రూ.199 ధరలో జియో లో కూడా ఓ ప్లాన్ ఉంది. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 24 రోజులు మాత్రమే. అయితే బెనిఫిట్స్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం ఎయిర్టెల్ రూ.199 మరియు జియో రూ.199 ప్లాన్స్ మధ్య ఏది ఉత్తమమైనదో తేల్చేద్దాం. పదండి మరి.

Airtel రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

డేటా: Airtel యొక్క కొత్త రూ. 199 ప్లాన్ గురించి మాట్లాడితే, ఇది ఇంటర్నెట్ వినియోగం కోసం మీకు మొత్తం 3GB డేటాను అందజేస్తుంది. అలాగే, డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోదగిన విషయమేంటంటే, ఇది రోజువారీ డేటా ప్లాన్ కాదు.

వ్యాలిడిటీ మరియు ఎస్ఎంఎస్ లు: వినియోగదారులు ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా మొత్తం 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు, ఇది ఈ ప్లాన్ యొక్క హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే ప్లాన్‌లో మీరు మొత్తం 300 ఉచిత SMSలను పొందుతారు.

ఉచిత కాలింగ్: అంతే కాదండోయ్.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో మీరు అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా పొందుతారు. ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలో ట్యూన్స్ మరియు ఉచితంగా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

డేటా: Jio రూ. 199 ప్లాన్‌ ద్వారా కంపెనీ ప్రతిరోజూ 1.5 GB డేటాను అందిస్తోంది. అంటే కాలపరిమితి పూర్తయ్యే నాటికి మీరు ఈ ప్లాన్ ద్వారా మొత్తం 34.5 GB 4G డేటాను పొందుతారు.

వ్యాలిడిటీ మరియు SMS: ఈ ప్లాన్ ద్వారా 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే, కంపెనీ మీకు రోజుకు 100 SMSలను కూడా ఇస్తుంది.

ఉచిత కాలింగ్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా కస్టమర్‌లు అన్ని నెట్‌వర్క్‌ లకు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleసిరామిక్ బాడీతో వస్తోన్న OnePlus 11 5G స్మార్ట్ ఫోన్
Next articlePrice cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.