Rs 296 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 02 Mar 2023 08:57:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.296 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; 30 రోజుల వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/vodafone-idea-launched-rs-296-prepaid-plan-25gb-data-30-days-validity-sms-free-calling/ Thu, 02 Mar 2023 08:57:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5182 భారతదేశంలో ఉన్న ప్రయివేటు టెలీకామ్ సంస్థల్లో మూడోస్థానంలో కొనసాగుతోంది వొడాఫోన్ ఐడియా. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో సంస్థలు టాప్ 2 ప్లేసెస్ ని ఆక్రమించాయి. వీటితో పోటీపడేందుకు వొడాఫోన్ ఐడియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఎయిర్టెల్, జియో సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను లాంచ్ చేసాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు దేశ వ్యాప్తంగా 5జీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో సేవలు ప్రజలకు అందుతున్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ […]

The post రూ.296 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; 30 రోజుల వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Vodafone Idea
  • ప్లాన్ ద్వారా లభించనున్న 30 రోజుల వ్యాలిడిటీ, డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు
  • రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ తో ఓటీటీ, అడిషనల్ డేటా, వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ వంటివి లభించవు

భారతదేశంలో ఉన్న ప్రయివేటు టెలీకామ్ సంస్థల్లో మూడోస్థానంలో కొనసాగుతోంది వొడాఫోన్ ఐడియా. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో సంస్థలు టాప్ 2 ప్లేసెస్ ని ఆక్రమించాయి. వీటితో పోటీపడేందుకు వొడాఫోన్ ఐడియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఎయిర్టెల్, జియో సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను లాంచ్ చేసాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు దేశ వ్యాప్తంగా 5జీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో సేవలు ప్రజలకు అందుతున్నాయి.

మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్, టీసీఎస్ సహకారంతో 4జీ అటు తర్వాత 5జీ సేవలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా ఇప్పటికే 4జీ సేవలను ఆఫర్ చేస్తోంది. 5జీ సేవలను ఎప్పుడు లాంచ్ చేయనుందో ఇంకా తెలియదు. అయితే రానున్న కొన్నేళ్ళలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. కచ్చితమైన సమాచారం ఇంకా కంపెనీ నుంచి రాలేదు. సరే, ఇప్పుడు మనం వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన లేటెస్ట్ ప్లాన్ రూ.296 గురించి తెలుసుకుందాం.

Vodafone Idea రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

Vodafone Idea తీసుకొచ్చిన రూ.296 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 25జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ హీరో అన్‌లిమిటెడ్ సెక్షన్ క్రిందకు రాదు. దీంతో బింజ్ ఆల్ నైట్, ఓటీటీ బెనిఫిట్స్, అడిషనల్ డేటా, వీకెండ్ డేటా రోలోవర్ ఫెసిలీటీస్ ఉండవు. అయితే కస్టమర్లకు Vi music, TV App కి యాక్సెస్ లభిస్తుంది.

రూ.296 ప్యాక్ తో పాటు, Vodafone Idea రూ.195 మరియు రూ.319 ప్లాన్స్ ని అందిస్తోంది. ఇవి కూడా 1 నెల వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి. అంటే 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్స్ ద్వారా లభిస్తుంది. రూ.195 ప్లాన్ ద్వారా 3జిబి డేటా, అపరిమిత కాలింగ్, ఒక నెలకు 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

రూ.319 ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా డేటా డిలైట్స్, వీకెండ్ డేటా రోలౌట్ ఫెసిలిటీ, బింజ్ ఆల్ నైట్, వీఐ మూవీస్, టీవీ యాప్ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ అదనపు బెనిఫిట్స్ అనేవి ఒక నెల పాటు చెల్లుబాటు అవుతాయి. ప్లాన్స్ వివరాలు తెలుసుకున్నారు కదా? మరొకసారి చదివి, మీకు సరిపోయే ప్లాన్ ని ఎంచుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.296 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; 30 రోజుల వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel రూ.296 ప్లాన్: 25జిబి డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/airtel-rs-296-prepaid-plan-30-days-validity-25-gb-data-unlimited-calling-daily-sms-wynk-music-hello-tunes/ Tue, 21 Feb 2023 14:15:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5040 భారత్ లోని టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రధానంగా ఈ సంస్థకి జియో నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జియో ని ఎదుర్కునేందుకై ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్ల కోసం సమయానుసారం తీసుకొస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ వద్ద ఎన్నో బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. డేటా ప్రధానమైనవి, వ్యాలిడిటీ ప్రధానమైనవి ప్లాన్స్ ఎయిర్టెల్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి […]

The post Airtel రూ.296 ప్లాన్: 25జిబి డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా లభించనున్న డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు
  • ఎయిర్టెల్ రూ.296 ప్లాన్ బెనిఫిట్స్: 25జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 30 రోజుల వ్యాలిడిటీ
  • రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ తో లభించనున్న అదనపు ప్రయోజనాలు

భారత్ లోని టాప్ టెలీకామ్ సంస్థల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రధానంగా ఈ సంస్థకి జియో నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జియో ని ఎదుర్కునేందుకై ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్ల కోసం సమయానుసారం తీసుకొస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ వద్ద ఎన్నో బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. డేటా ప్రధానమైనవి, వ్యాలిడిటీ ప్రధానమైనవి ప్లాన్స్ ఎయిర్టెల్ దగ్గర ఉన్నాయి.

ఇప్పుడు మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ, డేటా, ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాదండోయ్ ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సరే, ఓసారి ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి లభించే పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 30 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • 25జిబి డేటా
  • ఉచిత కాలింగ్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ద్వారా 25జిబి డేటా యూజర్ కి లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ని ఉచితంగా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. వంద ఎస్ఎంఎస్ ల పరిధి దాటాక సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి. డేటా వినియోగం కూడా పరిధి దాటాక ఒక ఎంబికి 50 పైసలు చార్జ్ ఖర్చవుతాయి. ఇప్పుడు ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

Airtel రూ.296 అదనపు ప్రయోజనాలు

  • అపోలో 24/7 సర్కిల్
  • ఫాస్టాగ్ రూ.100 క్యాష్ బ్యాక్
  • ఉచిత హలో ట్యూన్స్
  • ఉచిత వింక్ మ్యూజిక్

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ, డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. రూ.296 ప్లాన్ ద్వారా యూజర్ కి అపోలో 24/7 సర్కిల్ సేవలు 3 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఉచిత హలో ట్యూన్స్ తో పాటు వింక్ మ్యూజిక్ ఉచితంగా లభిస్తుంది.

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను గురించి తెలుసుకున్నారు కదా? మరొకసారి ఈ ప్లాన్ వివరాలను చదివి, మీకు సరిపోయేదైతే రీచార్జ్ చేసుకుని ప్రయోజనాలను ఎంజాయ్ చేయండి. ఒక నెల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది. డేటా కూడా 25జిబి లభిస్తుంది. ఓ మోస్తరుగా డేటాను వాడే వారికి ఇది ఉపయోగపడుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel రూ.296 ప్లాన్: 25జిబి డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>