
భారతదేశంలో ఉన్న ప్రయివేటు టెలీకామ్ సంస్థల్లో మూడోస్థానంలో కొనసాగుతోంది వొడాఫోన్ ఐడియా. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో సంస్థలు టాప్ 2 ప్లేసెస్ ని ఆక్రమించాయి. వీటితో పోటీపడేందుకు వొడాఫోన్ ఐడియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఎయిర్టెల్, జియో సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను లాంచ్ చేసాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు దేశ వ్యాప్తంగా 5జీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో సేవలు ప్రజలకు అందుతున్నాయి.
మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్, టీసీఎస్ సహకారంతో 4జీ అటు తర్వాత 5జీ సేవలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా ఇప్పటికే 4జీ సేవలను ఆఫర్ చేస్తోంది. 5జీ సేవలను ఎప్పుడు లాంచ్ చేయనుందో ఇంకా తెలియదు. అయితే రానున్న కొన్నేళ్ళలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. కచ్చితమైన సమాచారం ఇంకా కంపెనీ నుంచి రాలేదు. సరే, ఇప్పుడు మనం వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన లేటెస్ట్ ప్లాన్ రూ.296 గురించి తెలుసుకుందాం.
Vodafone Idea రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
Vodafone Idea తీసుకొచ్చిన రూ.296 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 25జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇంకా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ హీరో అన్‌లిమిటెడ్ సెక్షన్ క్రిందకు రాదు. దీంతో బింజ్ ఆల్ నైట్, ఓటీటీ బెనిఫిట్స్, అడిషనల్ డేటా, వీకెండ్ డేటా రోలోవర్ ఫెసిలీటీస్ ఉండవు. అయితే కస్టమర్లకు Vi music, TV App కి యాక్సెస్ లభిస్తుంది.
రూ.296 ప్యాక్ తో పాటు, Vodafone Idea రూ.195 మరియు రూ.319 ప్లాన్స్ ని అందిస్తోంది. ఇవి కూడా 1 నెల వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి. అంటే 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్స్ ద్వారా లభిస్తుంది. రూ.195 ప్లాన్ ద్వారా 3జిబి డేటా, అపరిమిత కాలింగ్, ఒక నెలకు 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
రూ.319 ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా డేటా డిలైట్స్, వీకెండ్ డేటా రోలౌట్ ఫెసిలిటీ, బింజ్ ఆల్ నైట్, వీఐ మూవీస్, టీవీ యాప్ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ అదనపు బెనిఫిట్స్ అనేవి ఒక నెల పాటు చెల్లుబాటు అవుతాయి. ప్లాన్స్ వివరాలు తెలుసుకున్నారు కదా? మరొకసారి చదివి, మీకు సరిపోయే ప్లాన్ ని ఎంచుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











