Sale In India - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Jul 2022 10:17:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో మొదలైన Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3-thor-love-and-thunder-edition-sale-begins-in-india/ Wed, 13 Jul 2022 10:17:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=937 హైలైట్స్: * Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ ప్రారంభం. * ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. * ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ థీమ్ తో వస్తోంది. అలాగే రిటైల్ బాక్స్ లో కస్టమ్ గుడీస్ వస్తాయి. రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్ గత నెలలో భారత్ లో […]

The post భారత్ లో మొదలైన Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ ప్రారంభం.

* ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

* ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ థీమ్ తో వస్తోంది. అలాగే రిటైల్ బాక్స్ లో కస్టమ్ గుడీస్ వస్తాయి.

రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్ గత నెలలో భారత్ లో అడుగుపెట్టింది. ఇదొక స్పెషల్ ఎడిషన్, కస్టమ్ థీమ్ తో పాటు రిటైల్ బాక్స్ పర్సనలైజ్డ్ గూడీస్ తో వస్తుంది. అయితే రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్, స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది. ఇది 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లున్నాయి.

సెల్ఫీ షూటర్ కోసం రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్లో పంచ్ హోల్ కటౌట్ ఉంది. వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. నైట్రో బ్లూ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ ధర, అమ్మకాలు

రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ 12జిబి+256జిబి మోడల్ ధర రూ.42,999. రియల్ మీ అధికార వెబ్ సైట్ తో పాటు, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు రూ.3,000 డిస్కౌంట్ పొందనున్నారు. దీంతో వారికి రూ.39,999 కే ఫోన్ సొంతం కానుంది.

ఈ స్పెషల్ ఎడిషన్ థోర్ లవ్ అండ్ థండర్ థీమ్ తో పాటు, Realme X Marvel Thor Love and Thunder లోగో తో వస్తుంది. ఇకపోతే, బాక్స్ లో కస్టమైజ్డ్ గూడీస్ ఉంటాయి. వీటితో పాటు ఇంకా స్టికర్స్, కార్డ్స్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఒక మెడల్ ఉంటాయి.

Realme GT Neo 3 Thor Love and Thunder edition స్పెసిఫికేషన్స్

  • 6.7-అంగుళాల 10-బిట్ అమోలెడ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100
  • 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ
  • 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరాలు
  • 16MP ఫ్రంట్ కెమెరా
  • 4,500mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ ప్యానెల్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే, రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటి ఒకటి ఓఐఎస్ తో కూడిన 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, మూడోది 2ఎంపి మ్యాక్రో సెన్సర్. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, జీటీ మోడ్ 3.0, 39606ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఈ ఫోన్లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post భారత్ లో మొదలైన Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో నేటి నుంచి మొదలైన Moto G42 సేల్స్ https://www.91mobiles.com/telugu/moto-g42-sale-in-india-from-today-on-flipkart/ Mon, 11 Jul 2022 09:45:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=872 హైలైట్స్: * నేటి నుంచి భారత్ లో Moto G42 సేల్ ప్రారంభం. * ఫ్లిప్ కార్ట్ తో పాటు కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. * భారత్ లో మోటో జీ42 ధర రూ.13,999. గత నెలలో గ్లోబల్ గా విడుదలయ్యాక మోటో జీ42 వారం క్రితం భారత గడ్డపై కూడా అడుగు పెట్టింది. ఇక ఈ ఫోన్ నేటి నుంచి భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి […]

The post భారత్ లో నేటి నుంచి మొదలైన Moto G42 సేల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* నేటి నుంచి భారత్ లో Moto G42 సేల్ ప్రారంభం.

* ఫ్లిప్ కార్ట్ తో పాటు కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

* భారత్ లో మోటో జీ42 ధర రూ.13,999.

గత నెలలో గ్లోబల్ గా విడుదలయ్యాక మోటో జీ42 వారం క్రితం భారత గడ్డపై కూడా అడుగు పెట్టింది. ఇక ఈ ఫోన్ నేటి నుంచి భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమైంది. మోటో జీ42 (రివ్యూ) ఫోన్ బ్యాక్ ప్యానెల్ పీఎంఎంఏ ఆక్రిలిక్ గ్లాస్ ఫినిష్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ముందు భాగాన ఓఎల్ఈడీ ప్యానెల్ తో కూడిన పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉన్నాయి. మోటో జీ42 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా కీలకమైన ఫీచర్లు. భారత్ లో ఈ ఫోన్ ధర, ఇతర ఆఫర్లను గురించి తెలుసుకుందాం.

భారత్ లో Moto G42 ధర, లాంచ్ ఆఫర్లు

4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో కూడిన సింగిల్ వేరియంట్ తో వస్తున్న మోటో జీ42 ఫోన్ ధర రూ.13,999. ఫ్లిప్ కార్ట్ తో పాటు మోటోరోలా కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతుంది.

ఎస్బీఐ కార్డు తో మోటో జీ42 ని కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, జీ5 యాన్యువల్ మెంబర్షిప్ పై రూ.549 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే రూ.999 విలువ గల బైజుస్ మెంబర్షిప్, రూ.4,999 కి గూగుల్ నెస్ట్ హబ్, రూ.1,999 కి గూగుల్ నెస్ట్ మినీ లభిస్తాయి.

Moto G42 స్పెసిఫికేషన్స్

మోటో జీ42 లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, డీసీఐ-పీ3 కలర్ గేముత్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 1టీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ వంటి ఫీచర్లున్నాయి.

                 Moto G42 స్పెక్స్

  • 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 12-ఆధారిత మైయూఎక్స్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఛార్జింగ్
  • 16ఎంపి సెల్పీ షూటర్
  • 59ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాస్
  • ఐపీ52 రేటింగ్

మోటో జీ42 సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16ఎంపి కెమెరా ఉంది. అలాగే వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలున్నాయి. వీటిలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్/డెప్త్ హైబ్రిడ్ కెమెరా, 2ఎంపి మైక్రో కెమెరాలున్నాయి. అలాగే ఈ ఫోన్ ఐపీ52 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది.

The post భారత్ లో నేటి నుంచి మొదలైన Moto G42 సేల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>