Samsung Galaxy A04e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:53:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మీడియాటెక్ హీలియో పీ35 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A04, Galaxy A04e https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04-galaxy-a04e-launched-india-price-specs/ Mon, 19 Dec 2022 09:35:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4057 హైలైట్స్ భారత్ లో లాంచైన Samsung Galaxy A04, Galaxy A04e మీడియాటెక్ హీలియో పీ35, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్ తో లాంచైన ఫోన్లు Samsung Galaxy A04 ప్రారంభ ధర రూ.9,299, Galaxy A04e ప్రారంభ ధర రూ.11,999 భారత్ లో Samsung Galaxy A04, Galaxy A04e డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇవి ఏ-సిరీస్ లో ప్రవేశపెట్టబడిన చవకైన ఫోన్లు. Samsung Galaxy A04, […]

The post మీడియాటెక్ హీలియో పీ35 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A04, Galaxy A04e first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Samsung Galaxy A04, Galaxy A04e
  • మీడియాటెక్ హీలియో పీ35, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్ తో లాంచైన ఫోన్లు
  • Samsung Galaxy A04 ప్రారంభ ధర రూ.9,299, Galaxy A04e ప్రారంభ ధర రూ.11,999

భారత్ లో Samsung Galaxy A04, Galaxy A04e డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇవి ఏ-సిరీస్ లో ప్రవేశపెట్టబడిన చవకైన ఫోన్లు. Samsung Galaxy A04, Galaxy A04e స్మార్ట్ ఫోన్స్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వచ్చాయి. బ్యాక్ ప్యానెల్ పైన సర్క్యులర్ రింగ్స్ లో రెండు కెమెరాలు ఉంటాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది. రెండు ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు. అంటే యూజర్లు ప్యాటెర్న్ లేదా పిన్ లాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

Samsung Galaxy A04, Galaxy A04e ఫోన్లు మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy A04, Galaxy A04e ధర, విక్రయం

Samsung Galaxy A04e ఫోన్ 3జిబి + 32జిబి వేరియంట్ ధర రూ.9,299 గా ఉంది. 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999, 4జిబి + 128జిబి యూనిట్ ధర రూ.11,499 గా ఉంది. ఈ ఫోన్ లైట్ బ్లూ మరియు కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A04 ఫోన్ 4జిబి + 64జిబి యూనిట్ ధర రూ.11,999 గా ఉంది. ఇక 4జిబి + 128జిబి మోడల్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లైట్ బ్లూ మరియు కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఈ రెండు ఫోన్లు శాంసంగ్ వెబ్ సైట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా డిసెంబర్ 20 నుంచి అందుబాటులోకి వస్తాయి.

Samsung Galaxy A04e, Galaxy A04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04e మరియు Galaxy A04 ఫోన్లలో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1560*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్, ఐఎంజీ పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ ఉంటాయి.

Samsung Galaxy A04e 3జిబి ర్యామ్ + 32జిబి/64జిబి స్టోరేజీ,4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

Samsung Galaxy A04 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. Samsung Galaxy A04e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 4జి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్+గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

మరోవైపు Samsung Galaxy A04 డివైజ్ 164.4 మిల్లీ మీటర్ల పొడవు, 76.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A04e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి.

Samsung Galaxy A04 లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ హీలియో పీ35 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A04, Galaxy A04e first appeared on 91Mobiles Telugu.

]]>
ఈవారం భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A04, Galaxy A04e? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04-galaxy-a04e-india-launch-this-week/ Fri, 16 Dec 2022 10:49:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=4031 హైలైట్స్ దిగువ బడ్జెట్ శ్రేణి కొనుగోలుదారుల కోసం వస్తోన్న Samsung Galaxy A04, Galaxy A04e ఈవారంలోనే భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న Samsung Galaxy A04, Galaxy A04e ఈ రెండు శాంసంగ్ ఫోన్ల ధర రూ.10 వేల లోపే ఉండే అవకాశం శాంసంగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేస్తుంది. త్వరలోనే కంపెనీ నుంచి రెండు చవకైన ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. అవి: Samsung Galaxy A04, Galaxy A04e. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ […]

The post ఈవారం భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A04, Galaxy A04e? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • దిగువ బడ్జెట్ శ్రేణి కొనుగోలుదారుల కోసం వస్తోన్న Samsung Galaxy A04, Galaxy A04e
  • ఈవారంలోనే భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న Samsung Galaxy A04, Galaxy A04e
  • ఈ రెండు శాంసంగ్ ఫోన్ల ధర రూ.10 వేల లోపే ఉండే అవకాశం

శాంసంగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేస్తుంది. త్వరలోనే కంపెనీ నుంచి రెండు చవకైన ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. అవి: Samsung Galaxy A04, Galaxy A04e. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ భారత మార్కెట్ లో ఈ వారంలోనే విడుదలవ్వనున్నాయిని తెలుస్తోంది. వీటి ధర రూ.10,000 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈలోపు ఓసారి Samsung Galaxy A04, Galaxy A04e డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Samsung Galaxy A04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A04 ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. మరి భారత మార్కెట్ లో ఏయే వేరియంట్స్ వస్తాయో చూడాలి.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే 4జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ ర్యామ్ ప్లస్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో వర్చువల్ ర్యామ్ ద్వారా 8జిబి వరకు పెంచుకోవచ్చు.

Samsung Galaxy A04e డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్‌యూఐ కోర్ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A04e కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy A04e 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఈవారం భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A04, Galaxy A04e? first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A04e ఇండియా వేరియంట్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04e-indian-variant-colors-ram-storage-revealed/ Thu, 01 Dec 2022 11:58:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=3806 హైలైట్స్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ లైట్ బ్లూ, కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్ 3జిబి + 32జిబి, 3జిబి + 64జిబి, 4జిబి + 128జిబి వేరియంట్లలో లభించనున్న Samsung Galaxy A04e కొన్ని రోజుల క్రితం శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ లో Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ కనిపించింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అంతా భావించారు. […]

The post లీకైన Samsung Galaxy A04e ఇండియా వేరియంట్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్
  • లైట్ బ్లూ, కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్
  • 3జిబి + 32జిబి, 3జిబి + 64జిబి, 4జిబి + 128జిబి వేరియంట్లలో లభించనున్న Samsung Galaxy A04e

కొన్ని రోజుల క్రితం శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ లో Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ కనిపించింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అంతా భావించారు. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ Samsung Galaxy A04e యొక్క ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ వివరాలను 91మొబైల్స్ తో పంచుకున్నాడు. ఇక ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04e ధర దాదాపు రూ.10,000 గా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A04e అక్టోబర్ లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. సాధారణమైన స్పెసిఫికేషన్స్ తో ఇది లాంచ్ అయ్యింది. వాటర్ డ్రాప్ నాచ్, డ్యూయల్ కెమెరాస్, పాలికార్బొనేట్ బాడీతో ఈ ఫోన్ తయారైంది.

Samsung Galaxy A04e కలర్ ఆప్షన్స్

ఇషాన్ చెబుతున్న దాని ప్రకారం, Samsung Galaxy A04e లైట్ బ్లూ, కాపర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A04e ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్

Samsung Galaxy A04e 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ, 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభించనున్నట్లు అగర్వాల్ చెబుతున్నాడు.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే 4జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.

Samsung Galaxy A04e డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్‌యూఐ కోర్ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A04e కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy A04e 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Samsung Galaxy A04e ఇండియా వేరియంట్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి సిద్ధమవుతోన్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m23-a04-a04e-to-launch-soon-india/ Thu, 27 Oct 2022 11:32:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=3100 హైలైట్స్ మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న Samsung త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e స్మార్ట్ ఫోన్స్ Snapdragon 750G తో వస్తున్న Galaxy M23 5G, Exynos 850 చిప్సెట్ తో రానున్న Galaxy A04 Samsung కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లపై ఫోకస్ పెట్టింది. ఏ-సిరీస్ లో రెండు, ఎమ్-సిరీస్ లో ఒక ఫోన్ ని త్వరలో లాంచ్ […]

The post లాంచ్ కి సిద్ధమవుతోన్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న Samsung
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e స్మార్ట్ ఫోన్స్
  • Snapdragon 750G తో వస్తున్న Galaxy M23 5G, Exynos 850 చిప్సెట్ తో రానున్న Galaxy A04

Samsung కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లపై ఫోకస్ పెట్టింది. ఏ-సిరీస్ లో రెండు, ఎమ్-సిరీస్ లో ఒక ఫోన్ ని త్వరలో లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లోనివే. Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e స్మార్ట్ ఫోన్స్ త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ డివైజెస్ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి వివరాలను ఇప్పటి వరకు శాంసంగ్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ లో ఈ మూడు డివైజెస్ కనిపించడంతో త్వరలోనే వీటి లాంచ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. త్వరలో రాబోవు ఈ ఫోన్లకు సంబంధించిన సపోర్ట్ పేజెస్ శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ లో కనిపించాయి.

Samsung Galaxy M23 5G ఈ ఏడాది ఆరంభంలో యూరోప్ లోని కొన్ని ప్రాంతాల్లో అన్‌వీల్ అయ్యింది. దీని తర్వాత Galaxy A04 మరియు Galaxy A04e డివైజెస్ కూడా లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ డివైజెస్ భారత్ లో లాంచ్ కాబోతున్నాయి. ఇకపోతే సపోర్ట్ పేజెస్ ని ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే తొలుత గమనించి మోడల్ నంబర్స్ ని రివీల్ చేశాడు. Galaxy M23 5G స్మార్ట్ ఫోన్ SM-M236B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇక Galaxy A04 SM-A045F/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. చివరగా Galaxy A04e SM-A042F/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

Samsung Galaxy M23 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M23 5G స్నాప్ డ్రాగన్ 750జి 5జీ చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. గెలాక్సీ ఎం23 5జీ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత, వన్ యూఐ 4.1 పై పని చేస్తుంది.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్

Galaxy A04e స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇందులో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04 ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి సిద్ధమవుతోన్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ తో వస్తున్న Samsung Galaxy A04e https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04e-announced-specs-revealed/ Fri, 21 Oct 2022 08:20:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=3014 హైలైట్స్ ఏ-సిరీస్ లో మరో ఫోన్ ని ప్రకటించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04e మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13ఎంపి రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ ఏ-సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే Samsung Galaxy A04e. ఇదొక ఎంట్రీ లెవెల్ […]

The post MediaTek Helio G35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ తో వస్తున్న Samsung Galaxy A04e first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఏ-సిరీస్ లో మరో ఫోన్ ని ప్రకటించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్
  • త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04e
  • మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13ఎంపి రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ ఏ-సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే Samsung Galaxy A04e. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇటీవలె లాంచ్ అయిన Samsung Galaxy A04, Samsung Galaxy A04S లతో ఈ ఫోన్ జత చేరనుంది. Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ తో వస్తోంది. అలాగే భారీ డిస్ప్లే, 13ఎంపి కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04e లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, ఇన్ఫినిటీ-వీ నాచ్, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. అయితే శాంసంగ్ ప్రాసెసర్ కి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. గతంలో వచ్చిన బెంచ్‌మార్క్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు. ఒప్పో ఏ17కే, టెక్నో స్పార్క్ 9టీ, రెడ్మీ 9 యాక్టివ్, పోకో సీ31, గెలాక్సీ ఏ03ఎస్ ఫోన్లలో కూడా హీలియో జీ35 ప్రాసెసర్ నే వాడారు.

లేటెస్ట్ Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి కెమెరా అమర్చారు. Samsung Galaxy A04e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. చార్జింగ్ సామర్థ్యం మరియు చార్జింగ్ పోర్ట్ టైప్ వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఆరెంజ్ కాపర్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. డెడికేటెడ్ మైకోఎస్డీ కార్డ్ స్లాట్ ఇందులో ఉంది. ఇంకా 3.5ఎంఎం ఆడియో జాక్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో లేదు.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ రానున్న వారాల్లో భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లభ్యత, ధర వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ తో వస్తున్న Samsung Galaxy A04e first appeared on 91Mobiles Telugu.

]]>