MediaTek Helio G35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ తో వస్తున్న Samsung Galaxy A04e

హైలైట్స్

  • ఏ-సిరీస్ లో మరో ఫోన్ ని ప్రకటించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్
  • త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04e
  • మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13ఎంపి రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ ఏ-సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే Samsung Galaxy A04e. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇటీవలె లాంచ్ అయిన Samsung Galaxy A04, Samsung Galaxy A04S లతో ఈ ఫోన్ జత చేరనుంది. Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ తో వస్తోంది. అలాగే భారీ డిస్ప్లే, 13ఎంపి కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04e లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, ఇన్ఫినిటీ-వీ నాచ్, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. అయితే శాంసంగ్ ప్రాసెసర్ కి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. గతంలో వచ్చిన బెంచ్‌మార్క్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు. ఒప్పో ఏ17కే, టెక్నో స్పార్క్ 9టీ, రెడ్మీ 9 యాక్టివ్, పోకో సీ31, గెలాక్సీ ఏ03ఎస్ ఫోన్లలో కూడా హీలియో జీ35 ప్రాసెసర్ నే వాడారు.

లేటెస్ట్ Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి కెమెరా అమర్చారు. Samsung Galaxy A04e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. చార్జింగ్ సామర్థ్యం మరియు చార్జింగ్ పోర్ట్ టైప్ వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఆరెంజ్ కాపర్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. డెడికేటెడ్ మైకోఎస్డీ కార్డ్ స్లాట్ ఇందులో ఉంది. ఇంకా 3.5ఎంఎం ఆడియో జాక్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో లేదు.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ రానున్న వారాల్లో భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లభ్యత, ధర వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.