Samsung Galaxy A14 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 08 Jan 2024 09:53:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A14 5G: మరొక స్టోరేజీ ఆప్షన్‌తో లాంచైన గెలాక్సీ ఏ14 5జీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-5g-launched-with-new-storage-option/ Mon, 08 Jan 2024 09:53:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=9608 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా Galaxy A14 5G డివైజ్ ని మరొక స్టోరేజీ ఆప్షన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అమ్ముడవుతోంది. ఇప్పుడు వీటికి జతగా 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ కూడా చేరింది. అయితే, తొలుత ఈ డివైజ్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ పై లభిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A14 […]

The post Samsung Galaxy A14 5G: మరొక స్టోరేజీ ఆప్షన్‌తో లాంచైన గెలాక్సీ ఏ14 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచైన Samsung Galaxy A14 5G 4జిబి+128జిబి వేరియంట్
  • Exynos 1330 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • కెమెరా: 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా Galaxy A14 5G డివైజ్ ని మరొక స్టోరేజీ ఆప్షన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అమ్ముడవుతోంది. ఇప్పుడు వీటికి జతగా 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ కూడా చేరింది. అయితే, తొలుత ఈ డివైజ్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ పై లభిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A14 5G 4జిబి+128జిబి వేరియంట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A14 5G ధర

  • Samsung Galaxy A14 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ జనవరి 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
  • Samsung Galaxy A14 5G డివైజ్ లిస్టింగ్ ధర రూ.15,499 గా ఉంటుందని సమాచారం.
  • Samsung Galaxy A14 5G కొత్త స్టోరేజీ మోడల్ మొదట ఆఫ్‌లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. తర్వాత ఆన్‌లైన్ లోకి వస్తుంది.
  • Samsung Galaxy A14 5G డివైజ్ 4జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ కాకుండా ఇంకా 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
  • Samsung Galaxy A14 5G డివైజ్ బ్లాక్, డార్క్ రెడ్ మరియు లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: ఎగ్జినోస్ 1330 చిప్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A14 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ వస్తాయి..
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post Samsung Galaxy A14 5G: మరొక స్టోరేజీ ఆప్షన్‌తో లాంచైన గెలాక్సీ ఏ14 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-galaxy-a23-5g-india-first-sale/ Thu, 19 Jan 2023 08:17:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4557 శాంసంగ్ రీసెంట్ గా రెండు కొత్త మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అవే Samsung Galaxy A23 5G, Galaxy A14 5G. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పలు కీలకమైన అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. లాంచ్ అయిన కొన్ని రోజులకే, ఈ ఫోన్లు భారత్ లో సేల్ కి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో […]

The post ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Samsung Galaxy A14 5G
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చిన Galaxy A23 5G
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న Galaxy A14, Galaxy A23

శాంసంగ్ రీసెంట్ గా రెండు కొత్త మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అవే Samsung Galaxy A23 5G, Galaxy A14 5G. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పలు కీలకమైన అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. లాంచ్ అయిన కొన్ని రోజులకే, ఈ ఫోన్లు భారత్ లో సేల్ కి వచ్చాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజెస్ ని శాంసంగ్.కామ్ ద్వారా మరియు ఇతర ఆన్‌లైన్ సైట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయి.

Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్ల కొనుగోలు పై లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ కార్డ్స్ లేదా జెస్ట్ మనీ ట్రాన్స్‌సాక్షన్స్ పై రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ల ధరలు

Galaxy A14 ఫోన్ భారత్ లో మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ14 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999. కార్డ్ ఆఫర్స్ ద్వారా రూ.1500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Samsung Galaxy A23 5G ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా నిర్ణయించారు. ఇది 8జిబి + 128జిబి వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. Samsung Galaxy A23 5G లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A23 5G లో స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇందులో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A23 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Exynos 1330 చిప్, 50MP కెమెరాతో లాంచైన Samsung Galaxy A14 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-5g-launched-india-price-specs-availability/ Mon, 16 Jan 2023 13:32:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4473 హైలైట్స్ భారత్ లో లాంచైన Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ తో వచ్చిన Samsung Galaxy A14 డివైజ్ భారత్ లో Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.16,499 Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తో పాటు Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయ్యింది. Samsung Galaxy A14 విషయానికి వస్తే, ఈ […]

The post Exynos 1330 చిప్, 50MP కెమెరాతో లాంచైన Samsung Galaxy A14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్
  • ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ తో వచ్చిన Samsung Galaxy A14 డివైజ్
  • భారత్ లో Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.16,499

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తో పాటు Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయ్యింది. Samsung Galaxy A14 విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెక్టాంగ్యులర్ మాడ్యూల్, క్వాడ్-కెమెరా సెన్సర్స్ ఉంటాయి.

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

భారత్ లో Samsung Galaxy A14 ధర

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. ఇకపోతే 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా నిర్ణయించారు. అలాగే 8జిబి ర్యామ్ + 128జిబి యూనిట్ ధర రూ.20,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ, జెస్ట్‌మనీ ద్వారా ఫోన్ కొనుగోలుపై శాంసంగ్ కంపెనీ రూ.1,500 క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్, శాంసంగ్.కామ్ ఇతర ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా జనవరి 20 నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. శాంసంగ్.కామ్ పై లైవ్ కామర్స్ ద్వారా Samsung Galaxy A14 ఫోన్ ని జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
  • ఎగ్జినోస్ 1330 చిప్సెట్
  • 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, ఎగ్జినోస్ 1330 చిప్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి. Samsung Galaxy A14 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ ని శాంసంగ్ హామీనిస్తోంది.

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Exynos 1330 చిప్, 50MP కెమెరాతో లాంచైన Samsung Galaxy A14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 18 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A14 5G; లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-5g-india-launch-timeline-specs/ Mon, 09 Jan 2023 06:20:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4383 హైలైట్స్ జనవరి 18 న భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A14 5G నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్ ఎగ్జినోస్ లేదా డైమెన్సిటీ చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి కెమెరాతో వస్తోన్న Samsung Galaxy A14 5G గతవారం గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్, ఇప్పుడు భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ జనవరి 18 […]

The post జనవరి 18 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A14 5G; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 18 న భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A14 5G
  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్
  • ఎగ్జినోస్ లేదా డైమెన్సిటీ చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి కెమెరాతో వస్తోన్న Samsung Galaxy A14 5G

గతవారం గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్, ఇప్పుడు భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ జనవరి 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. త్వరలో జరగబోయే ఈవెంట్ లో Samsung Galaxy A14 5G మరియు Galaxy A23 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి. ప్రముఖ టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేసిన మార్కెటింగ్ పోస్టర్ ద్వారా Samsung Galaxy A14 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ యూఎస్ మరియు యూరోప్ లోని ఎన్నో మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. యూఎస్ వేరియంట్ లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ వాడగా, యూరోప్ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. అయితే భారత్ లో ఏ చిప్ వేరియంట్ ని శాంసంగ్ లాంచ్ చేయనుందో ఇంకా తెలియదు.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లైట్ గ్రీన్, డార్క్ రెడ్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A14 5G యొక్క పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పదండి.

Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. అయితే ఇండియన్ వేరియంట్ యొక్క ప్రాసెసర్ యొక్క వివరాలు ఇంకా తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి మరియు 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 64జిబి మరియు 128జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో అందించారు. Samsung Galaxy A14 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. దీంతో ర్యామ్ ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 202 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 18 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A14 5G; లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
6GB ర్యామ్, Dimensity 700 చిప్ తో లాంచైన Samsung Galaxy A14 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-5g-launched-us-europe-price-specs/ Thu, 05 Jan 2023 05:09:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4341 హైలైట్స్ యూఎస్ మరియు యురోపియన్ మార్కెట్స్ లో లాంచైన Samsung Galaxy A14 5G గెలాక్సీ ఏ13 5జీ కి సక్సెసర్ గా వచ్చిన Samsung Galaxy A14 5G, త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చిన Samsung Galaxy A14 5G పెద్దగా హడావుడి లేకుండా ప్రముఖ సంస్థ శాంసంగ్ Samsung Galaxy A14 5G డివైజ్ ని […]

The post 6GB ర్యామ్, Dimensity 700 చిప్ తో లాంచైన Samsung Galaxy A14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • యూఎస్ మరియు యురోపియన్ మార్కెట్స్ లో లాంచైన Samsung Galaxy A14 5G
  • గెలాక్సీ ఏ13 5జీ కి సక్సెసర్ గా వచ్చిన Samsung Galaxy A14 5G, త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న డివైజ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చిన Samsung Galaxy A14 5G

పెద్దగా హడావుడి లేకుండా ప్రముఖ సంస్థ శాంసంగ్ Samsung Galaxy A14 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్. గెలాక్సీ ఏ13 5జీ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. ఏ13 తో పోల్చితే Samsung Galaxy A14 5G లో పలు అప్‌గ్రేడ్స్ చేశారు. త్వరలోనే ఈ డివైజ్ ని శాంసంగ్ భారత్ లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫోనన్ యూఎస్ మరియు కొన్ని యూరోపియన్ మార్కెట్స్ లో అందుబాటులో ఉంది.

Samsung Galaxy A14 5G ఫోన్ ప్లాస్టిక్ పాలికార్బొనేట్ బ్యాక్ మరియు ప్రేమ్ తో వస్తోంది. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ని ఫోన్ కలిగి ఉంది. ఈ డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై కెమెరాల కోసం 3 సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. ఒకసారి Samsung Galaxy A14 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A14 5G ధర, స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A14 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీతో వచ్చింది. మరొకటి 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వచ్చింది. యూఎస్ లో బేస్ వేరియంట్ ధర 200 డాలర్లు (సుమారు రూ.16,000) గా ఉండగా, యూరోప్ లో బేస్ వేరియంట్ ధర 229 యూరోలు (సుమారు రూ.20,100) గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, డార్క్ రెడ్ మరియు లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, న్యారో బెజెల్స్, మందపాటి చిన్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

Samsung Galaxy A14 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సింగిల్ చార్జ్ పై ఈ ఫోన్ అడాప్టివ్ పవర్-సేవింగ్ టెక్నాలజీ ద్వారా 3 రోజుల పాటు పని చేస్తుందని కంపెనీ చెబుతోంది.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ ఫోన్ లో అల్ట్రావైడ్ లెన్స్ లేదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీ ఇస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. Samsung Galaxy A14 5G ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 204 మిల్లీ మీటర్ల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6GB ర్యామ్, Dimensity 700 చిప్ తో లాంచైన Samsung Galaxy A14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A14 5G ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-5g-india-launch-confirmed/ Tue, 06 Dec 2022 11:40:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=3836 హైలైట్స్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A14 శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy A14 SM-A146B/DS అనే మోడల్ నంబర్ కలిగి ఉన్న హ్యాండ్సెట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్న Samsung Galaxy A14 Samsung Galaxy A14 డివైజ్ శాంసంగ్ ఇండియా యొక్క సపోర్ట్ పేజీలో కనిపించింది. త్వరలోనే ఈ గెలాక్సీ-ఏ సిరీస్ ఫోన్ భారత్ […]

The post Samsung Galaxy A14 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A14
  • శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy A14
  • SM-A146B/DS అనే మోడల్ నంబర్ కలిగి ఉన్న హ్యాండ్సెట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో రానున్న Samsung Galaxy A14

Samsung Galaxy A14 డివైజ్ శాంసంగ్ ఇండియా యొక్క సపోర్ట్ పేజీలో కనిపించింది. త్వరలోనే ఈ గెలాక్సీ-ఏ సిరీస్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది.
ఈ 5జీ మోడల్ SM-A146B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది తప్పా, ఫోన్ కి సంబంధించి ఇంకా ఏ విషయాలు తెలియలేదు. అయితే ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని దీని ద్వారా తెలుస్తోంది. Samsung Galaxy A13 కి సక్సెసర్ గా Samsung Galaxy A14 వస్తోంది.

రీసెంట్ గా లీకైన రెండర్ ఇమేజ్ ద్వారా Samsung Galaxy A14 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని తెలిసింది. మూడు సర్క్యులర్ కటౌట్స్ లో ఈ కెమెరాలు ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది.

Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ FCC వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో వివిధ 5జీ బ్యాండ్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఇంకా NBTC, Bluetooth SIG వెబ్ సైట్స్ పై కూడా కనిపించింది. దీంతో ఈ ఫోన్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుందని తెలిసింది.

Samsung Galaxy A14 రెండు ప్రాసెసర్ ఆప్షన్స్ తో వస్తోంది. అవి: మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్. Samsung Galaxy A14 లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్ 6.8-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. Samsung Galaxy A14 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A14 యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్ యొక్క మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung Galaxy A14 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>