Samsung Galaxy A14 5G: మరొక స్టోరేజీ ఆప్షన్‌తో లాంచైన గెలాక్సీ ఏ14 5జీ

Highlights

  • లాంచైన Samsung Galaxy A14 5G 4జిబి+128జిబి వేరియంట్
  • Exynos 1330 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • కెమెరా: 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా Galaxy A14 5G డివైజ్ ని మరొక స్టోరేజీ ఆప్షన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అమ్ముడవుతోంది. ఇప్పుడు వీటికి జతగా 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ కూడా చేరింది. అయితే, తొలుత ఈ డివైజ్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ పై లభిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A14 5G 4జిబి+128జిబి వేరియంట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A14 5G ధర

  • Samsung Galaxy A14 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ జనవరి 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
  • Samsung Galaxy A14 5G డివైజ్ లిస్టింగ్ ధర రూ.15,499 గా ఉంటుందని సమాచారం.
  • Samsung Galaxy A14 5G కొత్త స్టోరేజీ మోడల్ మొదట ఆఫ్‌లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. తర్వాత ఆన్‌లైన్ లోకి వస్తుంది.
  • Samsung Galaxy A14 5G డివైజ్ 4జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ కాకుండా ఇంకా 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
  • Samsung Galaxy A14 5G డివైజ్ బ్లాక్, డార్క్ రెడ్ మరియు లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: ఎగ్జినోస్ 1330 చిప్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A14 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ వస్తాయి..
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Previous articleOPPO Reno 11, Reno 11 Pro: గ్లోబల్‌గా లాంచైన ఒప్పో రెనో 11 సిరీస్
Next article108MP కెమెరా, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Huawei Enjoy 70 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.