Samsung Galaxy A54 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 Feb 2023 14:10:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Galaxy A54 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-spotted-samsung-official-website/ Tue, 14 Feb 2023 14:10:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=4918 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. రీసెంట్ గా ఈ డివైజ్ TENAA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫోన్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. 2022 డిసెంబర్ లో తొలిసారిగా Bluetooth SIG సర్టిఫికేషన్ Samsung Galaxy A54 5G లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. రీసెంట్ గా […]

The post Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Galaxy A54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ పై కనిపించిన Samsung Galaxy A54 5G
  • గతంలో ఎన్నో సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయిన Samsung Galaxy A54 5G
  • కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy A54 5G యొక్క రిపెయిరబులిటీ స్కోర్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. రీసెంట్ గా ఈ డివైజ్ TENAA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫోన్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. 2022 డిసెంబర్ లో తొలిసారిగా Bluetooth SIG సర్టిఫికేషన్ Samsung Galaxy A54 5G లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది.

రీసెంట్ గా NBTC సర్టిఫికేషన్ ని Samsung Galaxy A54 5G క్లియర్ చేసింది. తర్వాత FCC పై లిస్ట్ అయ్యింది. రీసెంట్ గా Samsung Galaxy A54 5G డివైజ్ యూరోపియన్ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్, డివైజ్ రెండర్స్ లీకైయ్యాయి. ఎట్టకేలకు Samsung Galaxy A54 5G డివైజ్ శాంసంగ్ అధికార వెబ్ సైట్ లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోన్ యొక్క రిపేరబులిటీ స్కోర్ ఎంతో తెలిసింది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని గుర్తించారు.

Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy A54

ఇమేజెస్ ని బట్టి, Samsung Galaxy A54 డివైజ్ SM-A546B అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 8.4 రిపెయిరబులిటీ స్కోర్ ని నమోదు చేసినట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా లాంచైన శాంసంగ్ ఫ్లాగ్షిప్ డివైజ్ Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ కంటే ఇది ఉత్తమమైన స్కోర్. ఎందుకంటే, Samsung Galaxy A54 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.

ఇకపోతే Samsung Galaxy S23 Ultra కాంప్లెక్స్ బాడీతో కూడి ఎన్నో సెన్సర్స్ ని కలిగి ఉంటుంది. Samsung Galaxy A54 డివైజ్ శాంసంగ్ యొక్క యూరోపియన్ సపోర్ట్ పేజీలో ప్రత్యక్షమైంది. గతంలో ఈ ఫోన్ ధర 590 యూరోలు (సుమారు రూ.52,200) గా ఉంటుందని తెలిసింది. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇక 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర 610 యూరోలు (సుమారు రూ.54,000) గా ఉంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ అనే 4 కలర్ ఆప్షన్స్ లో లభించనుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ అవ్వడం ఖరారైంది.

గతంలో వచ్చిన ఎన్నో లీక్స్ ద్వారా Samsung Galaxy A54 డివైజ్ 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో రానుందని తెలిసింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ67 రేటింగ్ తో వస్తోంది. ఇంకా వై-ఫై 6 కనెక్టివిటీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Galaxy A54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samung-galaxy-a54-tenaa-listing-key-specifications/ Mon, 13 Feb 2023 09:03:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4893 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy A54 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A53 కి సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. పలు సర్టిఫికేషన్స్, లీక్స్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A54 కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా Samsung Galaxy A54 డివైజ్ చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో Samsung Galaxy A54 కి సంబంధించిన […]

The post TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy A54
  • 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న Samsung Galaxy A54
  • TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy A54 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A53 కి సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. పలు సర్టిఫికేషన్స్, లీక్స్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A54 కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా Samsung Galaxy A54 డివైజ్ చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో Samsung Galaxy A54 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

TENAA సర్టిఫికేషన్ ని పొందిన Samsung Galaxy A54

TENAA సర్టిఫికేషన్ ప్రకారం, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 4,905 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు తెలిసింది. ఈ డివైజ్ 5జీ కనెక్టివిటీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా బయటకు వచ్చింది. టెనా సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయిన వివరాలు ఇంతే.

గతంలో లీకైన రిపోర్ట్స్ ని బట్టి, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలిసింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy A54 డివైజ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో రానుంది. ఇకపోతే ఈ డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. Samsung Galaxy A54 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Samsung Galaxy A54 లో వై-ఫై 6 కనెక్టివిటీ, 5జీ సపోర్ట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ డివైజ్ ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A54 ఐపీ67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్సెట్ 158.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ డివైజ్ గతంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవ్వనుందని స్పష్టమైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a34-galaxy-a54-renders-leaked/ Wed, 11 Jan 2023 14:31:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=4438 హైలైట్స్ ఓ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల డిజైన్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A34, Galaxy A54 ఇంకా కన్ఫర్మ్ కాని Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల లాంచ్ తేదీ దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ త్వరలోనే కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ప్రముఖమైనవి Galaxy A34 మరియు Galaxy A54. ఈ రెండు […]

The post లీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఓ టిప్‌స్టర్ ద్వారా Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల డిజైన్స్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A34, Galaxy A54
  • ఇంకా కన్ఫర్మ్ కాని Samsung Galaxy A34, Galaxy A54 ఫోన్ల లాంచ్ తేదీ

దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ త్వరలోనే కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ప్రముఖమైనవి Galaxy A34 మరియు Galaxy A54. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క రెండర్స్ తాజాగా నెట్టింట్ల ప్రత్యక్షమయ్యాయి. ట్విట్టర్ ద్వారా ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లాస్ ఏ-సిరీస్ ఫోన్ల యొక్క రెండర్స్ ని లీక్ చేశాడు. లీక్స్ ని బట్టి ఈ రెండు ఫోన్లు A34, A54 అయ్యుంటాయని అంచనా వేస్తున్నాం. సరే పదండి, ఓసారి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

లీకైన Samsung Galaxy A34, Galaxy A54 డిజైన్స్

లీకైన రెండర్స్ ని SamMobile ద్వారా తీసుకోవడం జరిగింది. చూస్తుంటే, రెండు ఫోన్లు కూడా ఫ్లాట్ డిస్ప్లే, సన్నని బెజెల్స్ కలిగి ఉన్నాయని తెలుస్తోంది. Galaxy A54 లో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ఉండగా, Galaxy A34 లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. రెండు స్మార్ట్ ఫోన్లకు కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్స్ ఉన్నాయి. లీకైన రెండర్స్ లో రియర్ ప్యానెల్స్ కనిపించడం లేదు. రెండింట్లోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందనిపిస్తోంది. రెండర్స్ ద్వారా తెలిసిన సమాచారం ఇంతే.

Samsung Galaxy A34, Galaxy A54 స్పెసిఫికేషన్స్

Galaxy A34 లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ఉండనుంది. ఇకపోతే Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ముందే అనుకున్నట్లుగా రెండు ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. మిగతా సెన్సర్స్ లో 12ఎంపి సెకండరీ సెన్సర్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 లో ఎగ్జినోస్ 7904 చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని అంచనా. ఇంకా పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung కంపెనీ ఇంకా ఈ వివరాలను కన్ఫర్మ్ చేయలేదు.

Samsung Galaxy A34, Galaxy A54 భారత్ లో ఎప్పుడు లాంచ్ కానున్నాయి?

Samsung Galaxy A14 మరియు Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్లు జనవరి 18 న లాంచ్ అవ్వనున్నాయని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పుడు అదే రోజున Galaxy A34, Galaxy A54 ఫోన్లు లాంచ్ అవుతాయా లేదా అన్నది ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి శాంసంగ్ నుంచి ఓ ప్రకటన రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Exynos 1380 చిప్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-specs-leaked-before-launch/ Tue, 03 Jan 2023 13:50:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=4314 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Samsung Galaxy A54 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Samsung Galaxy A54 Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శాంసంగ్ నుంచి పలు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. సాధారణంగా ప్రతీ కొత్త సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. త్వరలో శాంసంగ్ నుంచి […]

The post Exynos 1380 చిప్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Samsung Galaxy A54
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Samsung Galaxy A54

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శాంసంగ్ నుంచి పలు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. సాధారణంగా ప్రతీ కొత్త సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. త్వరలో శాంసంగ్ నుంచి గెలాక్సీ ఏ-సిరీస్, ఎమ్-సిరీస్, ఎఫ్-సిరీస్ ఫోన్లు భారత్ లో లాంచ్ అవ్వనున్నాయి. ఇక ఏ-సిరీస్ లో గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ఏ-సిరీస్ లో ప్రీమియమ్ ఫోన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఏ74 రద్దు నిర్ణయంతో ఇకపై ఏ-సిరీస్ లో ఏ54 టాప్ ఎండ్ మోడల్ గా నిలవనుంది. సరే, ఓసారి Samsung Galaxy A54 యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ మరియు ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 2023 తొలి త్రైమాసికంలో లాంచ్ కాబోయే ప్రీమియమ్ 5జీ ఫోన్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ యోగేశ్ బ్రార్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్ లాక్ ఉంటాయి.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 8జిబి వరకు ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుంది. Samsung Galaxy A54 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A54 ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ67 రేటింగ్ తో రానుంది. Samsung Galaxy A54 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లైమ్ గ్రీన్, పర్పుల్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Samsung Galaxy A54 ఫోన్ 158.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Exynos 1380 చిప్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A54 రెండర్స్; వర్టికల్ ట్రిపుల్ కెమెరాస్ తో వస్తున్న ఫోన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-renders-specs-leaked/ Tue, 15 Nov 2022 12:30:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=3447 హైలైట్స్ పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54 5G వైట్ కలర్ ఆప్షన్ లో లభించనున్న Samsung Galaxy A54 5G, ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం 2023 ఆరంభంలో లాంచ్ కానున్న Samsung Galaxy A54 5G Samsung Galaxy A54 5G కి సంబంధించిన 5కే రెండర్స్, మరియు 360-డిగ్రీ వీడియోని ప్రముఖ లీక్‌స్టర్ ఆన్‌లీక్స్ సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చాం. […]

The post లీకైన Samsung Galaxy A54 రెండర్స్; వర్టికల్ ట్రిపుల్ కెమెరాస్ తో వస్తున్న ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54 5G
  • వైట్ కలర్ ఆప్షన్ లో లభించనున్న Samsung Galaxy A54 5G, ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం
  • 2023 ఆరంభంలో లాంచ్ కానున్న Samsung Galaxy A54 5G

Samsung Galaxy A54 5G కి సంబంధించిన 5కే రెండర్స్, మరియు 360-డిగ్రీ వీడియోని ప్రముఖ లీక్‌స్టర్ ఆన్‌లీక్స్ సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చాం. Samsung Galaxy A53 కి సక్సెసర్ గా Samsung Galaxy A54 5G మార్కెట్ లోకి వస్తోంది. Samsung Galaxy A54 5G డిజైన్ గత మోడల్ మాదిరిగానే ఉందనిపిస్తోంది. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, మందపాటి బెజెల్స్, ట్రిపుల్ కెమెరాలు ఈ ఫోన్ లో కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. టిప్‌స్టర్ OnLeaks ఫోన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు.

2023 ఆరంభంలో Samsung Galaxy A54 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లకు జనాల్లో మంచి డిమాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. శాంసంగ్ లవర్స్ ఏ53 సక్సెసర్ అయిన Samsung Galaxy A54 5G కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Samsung Galaxy A54 5G డిజైన్

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్, లావైన బెజెల్స్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. యూఎస్బీ టైప్ సీ పోర్ట్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ ట్రే, సెకండరీ మైక్రోఫోన్ టాప్ లో ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రియర్ ప్యానెల్ పైన శాంసంగ్ లోగో ఉంది.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnLeaks బయటపెట్టిన సమాచారాన్ని బట్టి, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ డివైజ్ ట్రిపుల్ కెమెరాస్ తో వస్తోంది. అయితే సెన్సర్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 158.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉండనుంది. అయితే ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

అయితే గతంలో లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 4,905 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలిసింది. అయితే దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇక ట్రిపుల్ రియర్ కెమెరా లేఅవుట్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉండనుంది. ఈసారి డెడికేటెడ్ డెప్త్ సెన్సర్ ని స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపై దాని పని మెయిన్ సెన్సరే చేయనుంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికి ఏ వివరాలు కన్ఫర్మ్ కాలేదు. త్వరలోనే స్పెసిఫికేషన్స్ పై స్పష్టత రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Samsung Galaxy A54 రెండర్స్; వర్టికల్ ట్రిపుల్ కెమెరాస్ తో వస్తున్న ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరాతో రానున్న Samsung Galaxy A54 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-camera-specs-tipped/ Tue, 04 Oct 2022 10:26:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=2731 హైలైట్స్: 2023 లో లాంచ్ కానున్న Samsung Galaxy A54 ఈ ఏడాది మొదట్లో వచ్చిన గెలాక్సీ ఏ53 కి సక్సెసర్ గా రానున్న Samsung Galaxy A54 నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A54 కెమెరా స్పెసిఫికేషన్స్ ఈ ఏడాది మొదట్లో Samsung Galaxy A53 ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. ప్రతి సంవత్సరం ఒక ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేస్తుంది శాంసంగ్. ఈ క్రమంలో 2023 ప్రథమార్థంలో Samsung Galaxy A54 ఫోన్ […]

The post 50MP కెమెరాతో రానున్న Samsung Galaxy A54 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2023 లో లాంచ్ కానున్న Samsung Galaxy A54
  • ఈ ఏడాది మొదట్లో వచ్చిన గెలాక్సీ ఏ53 కి సక్సెసర్ గా రానున్న Samsung Galaxy A54
  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A54 కెమెరా స్పెసిఫికేషన్స్

ఈ ఏడాది మొదట్లో Samsung Galaxy A53 ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. ప్రతి సంవత్సరం ఒక ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేస్తుంది శాంసంగ్. ఈ క్రమంలో 2023 ప్రథమార్థంలో Samsung Galaxy A54 ఫోన్ ని లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. లాంచ్ కి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపు నెట్టింట్లో పలు లీక్స్ సందడి చేస్తున్నాయి.

GalaxyClub వెబ్ సైట్ ప్రచురించిన కథనం ద్వారా Samsung Galaxy A54 యొక్క కెమెరా ఫీచర్లు వెలుగు చూశాయి. ఈ కథనాన్ని బట్టి, Samsung Galaxy A54 లో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెజుల్యూషన్ పరంగా ఇది గత మోడల్ తో పోల్చితే డౌన్‌గ్రేడ్ అని చెప్పాలి. Galaxy A52, Galaxy A52 5G, Galaxy A52s 5G, and Galaxy A53 5G మోడల్స్ లో శాంసంగ్ 64 ఎంపి ప్రైమరీ కెమెరాను వాడింది. కానీ Samsung Galaxy A54 లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాకే ఓటేసినట్లు తెలుస్తోంది.

అయితే Samsung Galaxy A54 లో వాడబోవు 50 మెగా పిక్సెల్ సెన్సర్ బెటర్ క్వాలిటీ కలిగి ఉంటుందని సమాచారం. గెలాక్సీ ఎస్22 లో వాడిన 50ఎంపి సెన్సర్ ని Samsung Galaxy A54 లో ఉపయోగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే, శాంసంగ్ తయారు చేసిన మరొక హై-ఎండ్ 50ఎంపి సెన్సర్ ని వాడే అవకాశాలున్నాయి.

గెలాక్సీక్లబ్ చెబుతున్నట్లు 50 ఎంపి కెమెరా సెన్సర్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ఏ రకమైన 50ఎంపి సెన్సర్ ని Samsung Galaxy A54 లో వాడుతున్నారో ఇంకా స్పష్టత లేదు. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ SM-A546B అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు గెలాక్సీక్లబ్ తెలిపింది. Samsung Galaxy A54 ఎగ్జినోస్ ప్రాసెసర్ తో రాబోతున్నట్లు సమాచారం. Samsung Galaxy A53 లో కూడా ఎగ్జినోస్ 1280 చిప్ ని వాడటం జరిగింది.

యూరోప్ లో టెస్టింగ్ దశలో ఉన్న Samsung Galaxy A14 5G, A34 5G

త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A54 తో పాటు కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్, Galaxy A34, Galaxy A14 5G ఫోన్లను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు SM-A346B, SM-A146B అనే మోడల్ నంబర్లను కలిగి ఉంది. ఈ అన్ని స్మార్ట్ ఫోన్స్ 2023 లో లాంచ్ కానున్నాయి. రానున్న వారాల్లో ఈ డివైజెస్ కి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 50MP కెమెరాతో రానున్న Samsung Galaxy A54 first appeared on 91Mobiles Telugu.

]]>