Samsung Galaxy F14 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Feb 2024 18:40:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Samsung Galaxy F14 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f14-5g-launched-india-price-specs-availability/ Sun, 26 Mar 2023 12:48:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=5581 Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ శుక్రవారం నాడు భారత్ లో లాంచైంది. ప్రస్తుతం ఉన్న Samsung Galaxy F13 కి సక్సెసర్ గా Samsung Galaxy F14 5G మార్కెట్ లోకి వచ్చింది. ఈ హ్యాండ్సెట్ 50ఎంపి మెయిన్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. […]

The post 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Samsung Galaxy F14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వచ్చిన Samsung Galaxy F14 5G
  • భారత్ లో Samsung Galaxy F14 5G ప్రారంభ ధర రూ.12,990

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ శుక్రవారం నాడు భారత్ లో లాంచైంది. ప్రస్తుతం ఉన్న Samsung Galaxy F13 కి సక్సెసర్ గా Samsung Galaxy F14 5G మార్కెట్ లోకి వచ్చింది. ఈ హ్యాండ్సెట్ 50ఎంపి మెయిన్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy F14 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 6.6-ఇంచ్ డిస్ప్లేని ఈ ఫోన్ లో అందించారు. సరే, ఓసారి Samsung Galaxy F14 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F14 5G ధర, సేల్ తేదీ

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,990 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,990 గా నిర్ణయించారు. అయితే ఇవి ఇంట్రడక్టరీ ధరలని గమనించాలి. అంటే ఈ ధరల్ని శాంసంగ్ సంస్థ ఏ సమయంలోనైనా మార్చేస్తుంది. ఈ ఫోన్ సేల్ మార్చి 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1330 చిప్సెట్
  • 4జిబి/6జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 6జిబి వరకు ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. Samsung Galaxy F14 5G ఫోన్ లోజీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఏఐ వాయిస్ బూస్ట్, కస్టమైజ్డ్ కాల్ బ్యాగ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్స్, స్ప్లిట్ వ్యూ మల్టీ టాస్కింగ్, క్విక్ షేర్, ప్రైవసీ మరియు సెక్యూరిటీ డ్యాష్ బోర్డ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy F14 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Samsung Galaxy F14 5G first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే వారం భారత్‌లో రూ.15 వేల ధరతో లాంచ్ కానున్న Samsung Galaxy F14 5G? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f14-5g-india-launch-timeline-tipped/ Wed, 15 Mar 2023 05:35:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=5502 ఇటీవలె శాంసంగ్ సంస్థ మార్చి 16 న Galaxy A54 5G, Galaxy A34 5G ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈలోపు మరొక వార్త బయటకు వచ్చింది. ఎఫ్-సిరీస్ లో Samsung Galaxy F14 5G డివైజ్ ని శాంసంగ్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ డివైజ్ ఒక వారంలో భారత మార్కెట్ లోకి ప్రవేశిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.15,000 వద్ద ఉండేందుకు అవకాశం ఉంది. ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ద్వారా Samsung […]

The post వచ్చే వారం భారత్‌లో రూ.15 వేల ధరతో లాంచ్ కానున్న Samsung Galaxy F14 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వారం తర్వాత భారత మార్కెట్ లోకి Samsung Galaxy F14 5G డివైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ద్వారా బయటకు వచ్చిన లాంచ్ సమాచారం
  • ఈ శాంసంగ్ ఫోన్ రూ.15,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం

ఇటీవలె శాంసంగ్ సంస్థ మార్చి 16 న Galaxy A54 5G, Galaxy A34 5G ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈలోపు మరొక వార్త బయటకు వచ్చింది. ఎఫ్-సిరీస్ లో Samsung Galaxy F14 5G డివైజ్ ని శాంసంగ్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ డివైజ్ ఒక వారంలో భారత మార్కెట్ లోకి ప్రవేశిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.15,000 వద్ద ఉండేందుకు అవకాశం ఉంది.

ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ద్వారా Samsung Galaxy F14 5G లాంచ్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. వచ్చే వారం శాంసంగ్ అధికార ప్రకటన చేయనున్నట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రూ.15,000 లోపు ధరలోనే ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుంది. ఇప్పటి వరకు వచ్చిన శాంసంగ్ ఎఫ్-సిరీస్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ ద్వారానే సేల్ కి వచ్చాయి. దీంతో రాబోవు Galaxy F14 5G కూడా ఇదే ఈ-కామర్స్ సంస్థ ద్వారా అమ్మకానికి రానుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇప్పటి వరకు తెలిసిన దాన్ని బట్టి, Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడనున్నారు. Samsung Galaxy F14 5G లో 6జిబి ర్యామ్ ఆప్షన్ ఉండనుంది. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేయనుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండనుంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర లెన్సెస్ వివరాలు ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే వాటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇంకా Samsung Galaxy F14 5G లాంచ్ మరియు స్పెసిఫికేషన్స్ కి సంబంధించి శాంసంగ్ నుంచి అధికార ప్రకటన రాలేదు. అప్పటి వరకు వస్తోన్న సమాచారాన్ని కచ్చితమైనదిగా చెప్పలేం. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. అధికార ప్రకటన తర్వాతే అసలు సమాచారం తెలియనుంది. మార్చి 16 న Galaxy A34 5G, Galaxy A54 5G లాంచ్ సమయంలో శాంసంగ్ Galaxy F14 5G ని టీజ్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post వచ్చే వారం భారత్‌లో రూ.15 వేల ధరతో లాంచ్ కానున్న Samsung Galaxy F14 5G? first appeared on 91Mobiles Telugu.

]]>